Showing posts with label తాళపత్ర రహస్యాలు. Show all posts
Showing posts with label తాళపత్ర రహస్యాలు. Show all posts

పూజలో కొబ్బరికాయ క్రుళ్ళితే మంచిదా? కాదా?

0 comments
పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు తెలిసి చేసిన పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదేకాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్నితీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.

ఉత్తరం దిక్కున తలపెట్టి ఎందుకు నిద్రించరాదు?

0 comments
మన భూమిలో గురుత్వాకర్షణశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న ఆ శక్తి యొక్క తరంగాలు మన మెదడులో దాగావున్న శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి. దానివలన అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పువస్తుంది. మెదడులో లోపాలు తల ఎత్తుతాయి. అలా కాకుండా తూర్పు పడమరల వైపు నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉంది మెరుగు పడుతుంది. రక్త ప్రసరణసరిగా జరిగి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది.

తిరుమల తిరుపతిలో పూలబావి ప్రత్యేకత ఏమిటి?

0 comments
అద్దాల మండపానికి  ఉత్తరం దిక్కున ఉంది ఈ పూలబావి. స్వామి వారికి సమర్పించిన తులసి, పూలదండలు, పువ్వులు ఎవ్వరికి ఇవ్వకుండా ఈ పూలబావిలోనే పడేస్తారు.
ఆపదవచ్చినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య సొరంగ మార్గం ద్వారానే ఆ వెంకటేశ్వరస్వామిని శరణువేడాడు. స్వామి వారు ఆ ఆపద సమయంలో ఏకాంతంగా ఉన్నారు. తొండమానుడ్ని చూసి శ్రీమహాలక్ష్మీ సిగ్గుతో శ్రీమహా విష్ణువు వక్షస్థలంలో చేరింది. అదే సమయంలో భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్ళి రహస్యంగా దాక్కుందని పురాణాల గాధ.

లక్ష్మీదేవి తామర పువ్వులోనూ, ఇరుప్రక్కలా ఏనుగులతోనూ ఎందుకు ఉంటుంది?

0 comments
సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం. ఇక ఇరుప్రక్కలా వున్న ఏనుగులకు అర్థం ఏమిటంటే శ్రీమహాలక్ష్మీ ధనబలము గజబలమంతటిదని అర్థం చేసుకోమని పరమార్థం.

‘ఏడు’ సంఖ్య మంచిదా కాదా?

0 comments
తిరుమల తిరుపతిలో కొండలు 7. ప్రత్యక్షదైవం సూర్య భగవానుడి నుంచి వచ్చే కిరణాలు 7, పాతాళం క్రింద లోకాలు 7, భువర్లోకాలు 7. అలాగే ద్వీపాలు 7. పెళ్ళిలో వధూవరులు ఇద్దరూ కలిసి వేసే అడుగులు 7. అగ్ని దేవుని నాలుకలు 7. బ్రహ్మోత్సవాలు జరిగేది 7వ నెలలో. సప్తస్వరాలు కూడా ఏడే. 7 సంఖ్యమంచిది కాదని కొందరి మూఢనమ్మకము. 7 కూడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మనకోసమే. డాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకిలభిస్తుంది.

హారతి వల్ల లాభము ఏమిటి?

0 comments
గృహములోను, పూజాగదిలోనే కాడు, గుడిలోనూ, శుభకార్యాలప్పుడూ….పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను, క్రొత్త పెళ్లికూతురు గృహములోకి ప్రవేశించేతప్పుడూ హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. సుభాకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగాకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటూవ్యాధులూ ప్రబల కుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిచేసిన  పోతుందో, అలాగే మనం తెలిసీ సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం.

మాతృ, పితృ, ఆచార్య, దైవ ఋషి రుణాలంటే?

0 comments
పశుపక్షాదుల్లా పుట్టగానే, కాళ్ళు రాగానే బైటికి తరిమెయ్యరు. తల్లీ, తండ్రి ఇద్దరూ జీవితకాలం సంపాదించిన ధనాన్ని పోగు చేసి ఇచ్చి, పెళ్లి కూడా చేసి ధర్మ, అర్థాలతో సుఖించే పరిస్థితులని సృష్టిస్తారు. ప్రేమతో పెంచుతారు. తల్లీ, తండ్రీ రుణం, ఎంత సేవచేసినా తీరదు. చేయాల్సిందల్లా ముసలితనంలో వారని బిడ్డల్లా చూసుకోవటమే.మల ముత్రాలకు కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో తల్లి ఋణం తీర్చుకోవాలి. తాను సంపాదనతో నిస్వార్తముతో పెంచి పెద్ద చేసిన తండ్రి ఋణం తీర్చుకోవాలి. లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, నేర్పినందుకు గురు ఋణాన్ని, మనకి బుద్ధినీ, కర్మనీ ఇస్తున్న దైవ ఋణాన్ని భక్తి ద్వారా ధర్మ మార్గం ద్వారా, సకల శాస్త్రాలనూ, ధర్మాలనూ గ్రంథాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషి రుణాన్ని తీర్చుకోవాలి.తిరిగి తాను  వివాహం ద్వారా అన్ని రుణాలన్నీ తీర్చి, తరిగి తాను ఋణ పడటమే మానవ జన్మ.  

శ్రీకృష్ణపరమాత్ముడు నెమలి ఫించాన్ని తలపై ఎందుకు ధరిస్తాడు?

1 comments
సకల చరాచర సృష్టిలో సంభోగం చెయ్యని ఏకైక ప్రాణి నెమలి మాత్రమే. శ్రీకృష్ణునికి 16,000 వేలమంది గోపికలు. అన్ని వేలమంది గోపికలతో శ్రీకృష్ణుడు సరసల్లాపాలు మాత్రమే ఆడాడు. అల్లరి చేసి గెలిచేవాడు. ఆ విషయాన్ని తెలియచేయటానికే శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరిస్తాడు. శ్రీకృష్ణుడు ఒట్టి అల్లరి కృష్ణుడు మాత్రమే.

సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు?

0 comments
ప్రభాతవేళ, సూర్యాస్తమయవేళ, మిట్టమధ్యాహ్న సమయమున రవిని సూటిగా చూడరాదు. అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ సమయాల్లోనూ చూడరాదు. అట్టి సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవశరీర నిర్మాణానికి కీడును కలిగిస్తాయి.

పుత్రుడ్ని తండ్రి ఎలా పెంచాలి?

0 comments
పసివానిగా అయిదేళ్ళు వచ్చేవరకు రాజులా లాలించి, ప్రేమించి పెంచాలి. పదేళ్ళు వచ్చేవరకు అదిరించి, బెదిరించి అవసరం అయితే కొట్టి పెంచాలి. పదహారు సంవత్సరాలు దాటిన కొడుకుతో స్నేహితుడిలా మెలగాలి. చెప్పాలే గాని చెయ్యమని ఒత్తిడి చెయ్యకూడదు. 
ఆపై పెళ్ళైన తర్వాత తన బిడ్డలా కాక కోడలి భర్తగా మాత్రమే చూడాలి.

నిద్రపొయేవారిని ఎలా లేపాలి?

2 comments
పెద్దగా అరిచి లేపకూడదు. పడుకున్నవాణ్ణి కుదిపి కుదిపి లేపకూడదు. ముందు మెల్లగా పిలిచి, ఆపై స్వరం పెంచి, నెమ్మదిగా చేయివేసి కదిపి లేపాలి. ఒంటరిగా నిద్రపోతున్నవారి విషయం లో మరింత జాగరూకత వహించాలి.
మనిషి నిద్రిస్తున్నపుడు ఆత్మలోని కొన్ని అంశాలు బయటకు వెళుతుంటాయి అంటారు. అందుకే అనర్ధాలు జరిగే అవకాశం ఉండుటవలన నిద్రలేపే విషయంలో అదీ అనారోగ్యంగా ఉన్నవారి విషయంలో పెద్దవారి విషయంలో జాగ్రత్త వహించాలి.

గంగాజలంలో అంతటి శక్తి ఉండటానికి గల కారణం ఏమిటి?

2 comments
హిమాలయాల్లో పుట్టిన జలం గంగ. గంగ ప్రవహించే చాలా ప్రాంతం భూభాగంలో ఔషధ మొక్కలు ఉండటం వల్ల ఈ నీటిలో చైతన్యం కలిగించే శక్తి నిక్షిప్తమై ఉంటుంది. కలరా, అంటువ్యాధులు వంటి క్రిములు ఈ నీటిలో బ్రతకలేవు. గంగాజలం సమస్త వ్యాధులను పోగొట్టే అమృతజలమని చరకమహర్షి చెప్పారు.

తల్లితండ్రుల గొప్పతనం

0 comments
తల్లితండ్రుల గొప్పదనం గురించి శాస్త్రాలలో చెప్పబడిన విధానం:
  • ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి
  • ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి
  • ఒక్కసారి తల్లికి,తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.
  • సత్యం తల్లి .............. జ్ఞానం తండ్రి.
  • పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.
  • ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం
  • ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.
  • తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే అని ధర్మశాస్త్రం చెబుతోంది. తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదు.

చతుర్విద దానములు అనగా?

0 comments
చావుభయంతో  భీతిల్లేవాడికి ప్రాణ అభయం ఇవ్వటమూ, రోగాలతో, రొప్పులతో భాధపడేవారికి వైద్యం చేయించడమూ, పేదవారికి ఉచితవిద్యను అందించడమూ, ఆకలితో అల్లాడేవారికి ఆహారం ఇవ్వడం. ఇవీ చతుర్విద దానాలు. ఈ దానాలు చేసిన వారికి పూర్వజన్మ పాపాలు నశిస్తాయి.

ఎపుడు అభ్యంగన స్నానం చెయ్యకూడదు?

0 comments
శ్రాద్ధ దినములయందు, ఆది, మంగళ వారములు, పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, చతుర్ధశి తిధులయందు అభ్యంగన స్నానం చెయ్యరాదని శుకమహర్షి తెలియచేశారు.

శంఖం పూరించుటవలన?

0 comments
గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి. ఆరునెలల పురాణ శ్రవణం వలన కలిగిన ఫలం, ఒక్కసారి శంఖం పూరించినంతనే కలుగుతుంది.

ఉత్తమమైన ఆహరం ఏది?

0 comments
తీగ ద్వారా వచ్చే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ, గుమ్మడి, చిక్కుడు, దోసకాయ మరియు ఆకుకూరలు ఉత్తమమైన ఆహరం. కాయల ద్వారా వంకాయ, టొమేటో మొదలైనవన్నీ మధ్యమాలు. ఇక అధమం - భూమిలో పండేవి. అనగా దుంప కూరలు. దుంపకూరలు ఆరోగ్యానికి ఏమంత మంచి చేయవని వైద్యశాస్త్రం చెబుతోంది.

తల్లి గర్భం లో బిడ్డ ఎలా ఎదుగుతాడు?

0 comments
మొదటిరోజు కలిలం అవుతుంది. అయిదురోజులకు బుద్బుదాకారము. పదిరోజులకు రేగుపండంత. ఒక నెలకి తల, రెండో నెలకి భుజాలు, మూడో నెల పూర్తయ్యేసరికి ఆకలిదప్పికలు మొదలవుతాయి.
ఆరునెలలకి మాయతో కప్పబడతాడు. ఏడు నెలలకి జ్ఞానము కలుగుతుంది. కదలడం మొదలవుతుంది. అపుడే భగవంతుడ్ని, గత జన్మలో వలె పాపాలు చెయ్యననీ, మంచి బుద్ధిని ఇవ్వమనీ అనేకవిధాల వేడుకుంటాడు. నెలలు నిండాక భూమి మీద పడతాడు. తల్లి కడుపులో చేసిన ప్రతిజ్ఞలన్నీ మర్చిపోతాడు. అతనిని మహామాయ కమ్మేస్తుంది.

ఎన్ని యజ్ఞాలు చేసినా పోని పాపాలు ఏవి?

0 comments
అన్యాయంగా పరుల ధనాన్ని చేజిక్కించుకున్నవారికీ, పరాయివాని భార్యని ఆశించి పొందినవానికీ, ఇంటి యజమాని లేదా పెద్దలు లేనపుడు పిల్లలకి చెందాల్సిన ఆస్తిని కాజేసినవారికీ ఎన్ని శ్రాధ్ధాదులు పెట్టినా, ఎన్ని యజ్ఞాలు చేసినా ఆ పాపాలు నశించవు. ఆ పాపాలకు శిక్ష పై లోకాలలోనూ, ఇక్కడా అనుభవించవలసిందే.

యమపురి దారి ఎలా ఉంటుంది?

3 comments
మనిషి ఆయువు తీరిన పదమూడో రోజు తర్వాత యమభటులు జీవిని యమపురికి తీసుకెళ్తారు. దారి అంతా ఎగుడు దిగుడులు. ఆకలిదప్పికలు తీరే అవకాశం లేని ప్రాంతంలో అరికాళ్ళు బొబ్బలెత్తినా యమభటులు కొరడాలతో కొట్టి నడిపిస్తారు. కనుచూపు మేరలోనే నీరు ఉంటుంది. త్రాగబోతే చేతికి అందదు. మేఘాలు  నిరంతరం రక్తాన్ని వర్షిస్తుంటాయి. అలా పదిహేడు రోజులపాటు, జీవించినపుడు చేసిన పాపాలను తలచుకుని వాపోతుంటాడు జీవుడు. ఆ తరువాతే యమపురి మజిలీ అయిన సౌమ్యపురం చేరతాడు.
Copyright © ఆకాశ గంగ