Showing posts with label పాటలు. Show all posts
Showing posts with label పాటలు. Show all posts
0 comments
పంట చేలో పాల కంకి నవ్విందీ.... 

చిత్రం: పదహారేళ్ళ వయసు (1978)
నటీనటులు: చంద్రమోహన్, శ్రీదేవి

పల్లవి:
పంట చేలో పాల కంకి నవ్విందీ..పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ..
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా.. లేత పచ్చ కోన సీమా ఎండల్లా
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...

పంట చేలో పాల కంకి నవ్విందీ..పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ..
 చరణం 1:
శివగంగ తిరణాలలో.. నెలవంక తానాలు చేయాలా...
చిలకమ్మ పిడికిళ్ళతో.. గొరవంక గుడిగంట కొట్టాలా..
నువ్వు కంటి సైగ చెయ్యాలా... నే కొండ పిండి కొట్టాలా...
మల్లినవ్వే మల్లె పువ్వు కావాలా
మల్లినవ్వే మల్లె పువ్వు కావాలా
ఆ నవ్వుకే ఈ నాప చేను పండాలా...

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...

పంట చేలో పాల కంకి నవ్విందీ..పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ..
చరణం 2:
గోదారి పరవళ్ళలో.. మా పైరు బంగారు పండాలా...
ఈ కుప్ప నూర్పిళ్ళతో.. మా ఇళ్ళు వాకిళ్ళు నిండాలా..
నీ మాట బాట కావాలా.. నా పాట ఊరు దాటాలా...
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా
ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...

పంట చేలో పాల కంకి నవ్విందీ... అహహ అహహ
పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ... అహహ అహహ
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా... అహహ అహహ
లేత పచ్చ కోన సీమా ఎండల్లా... అహహహ అహహహ

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని

0 comments

చిత్రం: గాయం (1993)
నటీనటులు: జగపతి బాబు, రేవతి 
పల్లవి:
నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని 
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని 
మారదు లోకం మారదు కాలం 
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని 
మారదు లోకం మారదు కాలం
చరణం 1:
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి 
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి 
యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం 
యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం 
రామబాణమార్పిందా రావణ కాష్ఠం 
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
చరణం 2:
పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా 
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా 
వేట అదే వేటు అదే నాటి కధే అంతా 
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా 
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా 
శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ

అలుపన్నది ఉందా

0 comments

చిత్రం : గాయం (1993)
నటీనటులు: జగపతి బాబు, రేవతి 
పల్లవి:
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
ల ల ల ల లలలలలలలా
చరణం 1:
నా కోసమె చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు
ల ల ల ల లలలలలలలా
చరణం 2:
నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
ల ల ల ల లలలలలలలా

నిను వీడని నీడను నేనే... కలగా మెదిలే కథ నేనే

1 comments
ఓఓఓఓఓఓఓ..............ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
నిను వీడని నీడను నేనే... కలగా మెదిలే కథ నేనే
నిను వీడని నీడను నేనే... కలగా మెదిలే కథ నేనే      ||నిను వీడని నీడను నేనే||

నునులేత పూవునై విరిసీ...... నిను నమ్మి చేరినా వలచి
నునులేత పూవునై విరిసీ...... నిను నమ్మి చేరినా వలచి
వలపంత ధూళిలో కలిసే..
వలపంత ధూళిలో కలిసే..
బ్రతుకే బలియై ముగిసే....       ||నిను వీడని నీడను నేనే||

ఓఓ.....ఓఓఓ....ఓఓఓఓఓ.....ఓఓఓఓఓ

నిరుపేద కెందుకూ వలపూ..... కలవారి ఆటకే గెలుపు
నిరుపేద కెందుకూ వలపూ..... కలవారి ఆటకే గెలుపు
స్మృతినైన మాయని తలపు    
స్మృతినైన మాయని తలపు
బ్రతుకే చితియై తుదకూ....       ||నిను వీడని నీడను నేనే||

సిరిమల్లెపువ్వా ... సిరిమల్లెపువ్వా ...

0 comments
చిత్రం: పదహారేళ్ళ వయసు
నటీనటులు: చంద్రమోహన్, శ్రీదేవి.

పల్లవి:
సిరిమల్లెపువ్వా ... సిరిమల్లెపువ్వా ...
చిన్నారి చిలకమ్మా...
నా వాడు ఎవరే? నా తోడు ఎవరే?
ఎన్నాళ్ళకొస్తాడే?
సిరిమల్లెపువ్వా.....

చరణం 1 :
తెల్లారబోతుంటే... నా కల్లోకి వస్తాడే....
కళ్ళారా చూదామంటే.... నా కళ్ళు మూస్తాడే....
ఆ అందగాడు... నా ఈడు జోడు ఏడే?
ఈ సందెకాడ... నా చందమామ రాడే
చుక్కల్లారా ...... దిక్కులు దాటి
వాడెన్నాళ్ళకొస్తాడో?  (సిరిమల్లెపువ్వా ... )

చరణం 2 :
కొండల్లో కోనల్లో.... కూయన్న ఓ కోయిలా...
ఈ పూల వానల్లో..... ఝుమ్మన్న ఓ తుమ్మెదా....
వయసంతా వలపై.... మనసే మైమరపై  ఊగేనే...
పగలంతా పగలు..... రేయంతా దిగులు రేగేనే...
చుక్కల్లారా ...... దిక్కులు దాటి
వాడెన్నాళ్ళకొస్తాడో?  (సిరిమల్లెపువ్వా ... )

ఊహలు గుసగుసలాడే నా హ్రుదయము ఊగిసలాడే

4 comments
చిత్రం: బందిపోటు
నటినటులు: యన్.టి.ఆర్

పల్లవి:
ఊహలు గుసగుసలాడే నా హ్రుదయము ఊగిసలాడే
ప్రియా

ఊహలు గుసగుసలాడే నా హ్రుదయము ఊగిసలాడే

చరణం 1 :
వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే అది నీకు ముందే తెలుసు (ఊహలు గుసగుసలాడే..)

చరణం 2 :
నను కోరి చేరిన బేలా.... దూరాన నిలిచేవేలా
నను కోరి చేరిన బేలా.... దూరాన నిలిచేవేలా
నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా (ఊహలు గుసగుసలాడే..)

చరణం ౩:
దివి మల్లెపందిరి వేసే.... భువి పెళ్ళిపీటను వేసే..
దివి మల్లెపందిరి వేసే.... భువి పెళ్ళిపీటను వేసే..
నెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెళ్ళిని చేసే (ఊహలు గుసగుసలాడే...)

నన్ను దోచుకుందువటే ....

0 comments
చిత్రం: గులేబకావళి కధ.
నటీనటులు: యన్.టి,ఆర్, జమున.

పల్లవి:
నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసానీ
కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామీ... నిన్నే నా స్వామీ...
నన్ను దోచుకుందువటే ..........

చరణం1:
తరియుంతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియుంతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండ  వోలె కర్పూర కళిక వోలె ....... కర్పూర కళిక వోలె
ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు
ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు
కలకాలం వీడని సంకెలను వేసినావు.... సంకెలను వేసినావు. (నన్ను దోచుకుందువటే.. )

చరణం 2:
నా మదియే మందిరమై..... నీవే ఒక దేవతవై...
నా మదియే మందిరమై..... నీవే ఒక దేవతవై...
వెలసినావు నాలో.. నే కలిసిపోదు నీలో...... కలిసిపోదు నీలో......
ఏనాటిదో మన బంధం .... ఎరుగరాని  అనుబంధం
ఏనాటిదో మన బంధం .... ఎరుగరాని  అనుబంధం
ఎన్ని యుగాలైనా ఇది ఇరిగిపోని గంధం..... ఇరిగిపోని గంధం..... (నన్ను దోచుకుందువటే)

Copyright © ఆకాశ గంగ