మృగరాజును వెంటపడి మరీ తరమింది..

0 comments
అడవికి ఓ న్యాయం ఉంటుంది. ఆ న్యాయం ప్రకారం అడవికి రాజు సింహం. దానిని చూసి అన్నీ జంతువులు భయపడాల్సిందే. ఎదైనా జంతువు ఎదురుతిరిగి నువ్వెంత అని కొమ్ములు ఎగరేస్తే.. సింహం తన పంజా విసురుతుంది. ఎదురుగా జంతువు కనిపిస్తేనే దానికి ఆహారంగా మారిపోతుంది. అలాంటిది ఎదురుతిరిగితే బతికి బయటపడగలదా? కానీ ఇక్కడ మాత్రం ఆటవిక న్యాయం తిరగబడింది.

బర్రె (గెదే)ను చూసి ఆడ సింహం ఒకటి భయపడింది. గెదే మీదకు ఉరికొస్తుంటే.. సింహం బెదిరి పోరిపోయింది. ఆ సింహాన్ని వెంటాడి మరీ గెదే తరిమేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని గిర్‌ అడవిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన నాటకీయ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది.
 

తణుకులో చేపల వాన... పట్టుకునేందుకు పోటీపడ్డ ప్రజలు!

0 comments
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపల వాన కురిసింది. దీంతో చేపలను పట్టుకునేందుకు అక్కడి ప్రజలు పోటీ పడ్డారు. తణుకు జాతీయ రహదారి వెంబడి వర్షంతో పాటు చేపలు కూడా కురిశాయి. దీంతో, ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది. కాగా, గత ఏడాది కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని గోళ్లమూడి, పల్లగిరి గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూముల్లో ఆకాశంలో నుంచి చేపలు, కప్పలు రాలిబడ్డాయి.

దొంగ మొగుడిని పట్టించిన ఆధార్!

0 comments
తన భార్యకు తెలియకుండా, ఇంకో యువతిని వివాహం చేసుకుని, ఇద్దరితోనూ కాపురం చేస్తున్న దొంగమొగుడి వ్యవహారం ఆధార్ పుణ్యమాని బట్టబయలైన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ములకలచెరువుకు చెందిన ఓ యువతి రేషన్ కోసం వెళ్లగా, ఐదు కిలోల బియ్యం తగ్గాయి. ఈ పాస్ లో తన భర్త పేరు కనిపించక పోవడంతో కోటా తగ్గింది. పేరుంటేనే బియ్యం ఇస్తానని డీలర్ చెబుతుండటంతో, భర్త ఆధార్ నంబరును ఇంటర్నెట్ కేంద్రంలో ఇచ్చి పరిశీలించగా, అతను ఇంకో యువతి పేరిట ఉన్న రేషన్ కార్డులో నమోదైనట్టు తెలిసింది. ఒకే ఆధార్ సంఖ్య రెండు రేషన్ కార్డుల్లో ఉండకూడదు కాబట్టి మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. డబ్బు సంపాదన కోసం బెంగళూరు వెళ్తానని చెబుతూ, రెండో పెళ్లి చేసుకున్నాడని ఆ యువతి బావురుమంది. ములకలచెరువుతో పాటు దుగ్గసానిపల్లె తదితర గ్రామాల్లోనూ ఇలా రెండు సంసారాల ఉదంతాలు ఆధార్ అనుసంధానంతో బయటపడ్డాయి.

విశ్వాసమంటే ఇదే... నిద్రిస్తున్న యజమానిని రక్షించేందుకు పులితో పోరాడి ప్రాణాలు వదిలిన శునకరాజం

0 comments
తాను నమ్మిన యజమాని ప్రాణాలను కాపాడేందుకు ఆ శునకం ఓ పులితో పోరాడి ప్రాణాలను వదిలింది. ఈ ఘటన షాజహాన్ పూర్ సమీపంలోని దుడ్వా జాతీయ పార్కును ఆనుకుని ఉన్న గ్రామంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బర్బత్ పూర్ గ్రామంలోని రైతు గురుదేవ సింగ్, జాకీ అనే శునకాన్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. తన ఇంటి బయట గురుదేవ్ నిద్రిస్తుండగా, పక్కనే ఉన్న అడవిలో నుంచి ఓ పెద్దపులి వచ్చింది. పెద్దపులిని పసిగట్టిన శునకం పెద్దగా అరుస్తూ, తన యజమానికి ముంచుకొచ్చిన ప్రమాదాన్ని తెలియజేస్తూ, దానిపై కలబడింది. గురుదేవ్ లేచి సహాయం కోసం ఇతరులను పిలిచేలోగా, పులి పంజా దెబ్బలకు ఆ శునకం తీవ్రంగా గాయపడగా, దాన్ని ఆ పులి అడవుల్లోకి లాక్కెళ్లింది. గురుదేవ్ కుటుంబం, గ్రామస్తులు శునకం కోసం వెతుకులాడగా, కొంతదూరంగా దాని మృతదేహం కనిపించింది. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిపిన గురుదేవ్, శునకం విశ్వాసాన్ని తలచుకుంటూ, దాని అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు. జాకీ ఓ వీధి శునకమని, నాలుగేళ్ల క్రితం చిన్న పిల్లగా ఉన్నప్పుడు తన పిల్లలు ఇంటి తేగా, ఇంట్లోని మనిషిలా కలిసిపోయిందని గురుదేవ్ తెలిపారు.

''బాబు బంగారం'' టీజర్

0 comments

రైళ్లలో టాయ్‌లెట్లు ఎట్లా వచ్చాయంటే..

2 comments
‘నేను ప్యాసింజర్ రైల్లో అహ్మెద్‌పూర్ రైల్వే స్టేషన్‌కు వచ్చాను. కడుపు విపరీతమైన ఉబ్బరంగా ఉంది. రైలు దిగాను. స్టేషన్లో ఓ లోటలో నీల్లు పట్టుకున్నాను. రైలు పట్టాలకు దూరంగా పరిగెత్తాను. కడుపు భారాన్ని దించుకుంటున్నాను. ఇంతలో రైల్వే గార్డు పచ్చ జెండా ఊపాడు. నేను వెనక నుంచి మొత్తుకుంటూ ఒక చేతిలో లోట, మరో చేతిలో దోవతి పట్టుకొని పరుగెత్తుకొస్తున్నాను. కాళ్లకు దోవతి అడ్డంపడి ఊడిపోయింది. స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ మీదున్న మహిళలు, పురుషులు అందరి ముందు నా మానం పోయింది. నా కోసం ఐదు నిమిషాలు రైలు ఆపని గార్డుకు ప్రజల తరఫున భారీ జరిమానా విధించాలని ప్రార్థిస్తున్నాను. అలా చేయని పక్షంలో పత్రికలకు నివేదిస్తా’ అని ఓఖిల్ చంద్ర సేన్ అనే ప్రయాణికుడు 1909లో జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఫ్రేమ్ కట్టిన ఈ ఫిర్యాదు లేఖ ఢిల్లీ రైల్వే మ్యూజియంలో నేటికి కనిపిస్తుంది.

 ఈ లేఖనే రైల్వే బోగీల్లో మరుగుదొడ్లు నిర్మించాలనే ఆలోచనకు నాంది పలికింది.

వరుసకు అన్నాచెల్లెళ్లు.. కానీ ప్రేమించుకున్నారు

0 comments
కొన్ని సందర్భాల్లో చోటు చేసుకునే సంఘటనలు చాలాచిత్రంగా అనిపిస్తాయి. సాధ్యమా అనిపించేలా ఉన్న ఇలాంటి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వరుసకు అన్నా చెల్లెళ్లు అయ్యే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇంకేదైనా ఫర్లేదుకానీ.. చూస్తూ.. చూస్తూ ఇలాంటివి ఎలా ఒప్పుకుంటామని పిల్ల.. పిల్లాడి తల్లిదండ్రులు గట్టిగా చెప్పటం.. తాను కోరుకున్న ప్రేమ లభించకపోవటంతో సదరు యువతి ఆత్మహత్యాయత్నం చేయటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. కాస్త చిత్రంగా.. మరికాస్త ఇబ్బందిగా  అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..

శ్రీకాకుళం జిల్లా సంతకవిటికి చెందిన 20 ఏళ్ల యువతి అదే గ్రామానికి చెందిన పెద్దనాన్న కొడుకు ప్రేమలో పడింది. కుర్రాడి తల్లిదండ్రులు విజయనగరంలో ఉంటున్నారు. యువతి అప్పుడప్పుడు పెద్దనాన్న ఇంటికి వచ్చిన క్రమంలో వారి మధ్య ప్రేమ మొదలైంది. దీంతో.. ఇద్దరూ కలిసి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఈ విషయంపై ఇరు వర్గాల పెద్దలకు తెలిసి.. తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సదరు యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపారు. వీరి వ్యవహారం ఇరు వర్గాల పెద్దల మధ్య గొడవలకు కారణమైంది. యువతికి తల్లిదండ్రులు ఎంతగా నచ్చజెప్పినా ఆమె ససేమిరా అనటంతో ఈ వ్యవహారాన్నిఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.

మరోవైపు.. ఈ ఉదంతం గురించి తెలిసిన పోలీసులు సదరు యువతి వాంగ్మూలం తీసుకున్నారు. వరుసకు ఇద్దరూ అన్నాచెల్లెళ్లు కావటంతో కేసు నమోదు చేయకుండా.. కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు.

బాయ్ ఫ్రెండ్ కోసం అమ్మాయిల ‘స్ట్రీట్ ఫైట్’..

0 comments

ప్రియురాలి కోసం ఇద్దరు యువకులు పోట్లాడుకోవడం మనం విన్నాం, చూశాం కూడా. అయితే ఇప్పుడు ఏకంగా సీను మారింది. బుల్లితెర నుంచి వెండితెర వరకు పాకిన మహిళా విలనిజం.. ఇక వాస్తవ రూపం కూడా దాల్చింది. ఇటీవల యూపీలో ఓ లేడా డాన్ తన తుపాకితో స్థానికులను బెదిరించి.. చర్చి పక్కను వున్న భూమిని కబ్జా చేసేందుకు యత్నించి.. అడ్డువచ్చిన మహిళను కూడా ట్రాక్టర్ తో తొక్కించిన ఘటనను మరువక ముందే మీరట్ లో మరోకటి అలాంటి ఘటనే వెలుగుచూసింది. అయితే ఇది కబ్జా కోసం మాత్రం కాదు. ఇద్దరు యువతలు వారి బాయ్ ఫ్రెండ్ కోసం పోట్లాడుకున్నారు. 

ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ మాధవాపురానికి చెందిన ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పూజ (మారు పేరు) అనే యువతి స్థానిక మొబైల్ దుకాణంలో పనిచేస్తుంది. పూజ తన ప్రియుడిని తనకు కాకుండా చేస్తోందని ఆర్తి (మారు పేరు) అనే యువతి అరోపించింది.  పూజ ఓ యువకుడితో కలసి మొబైల్ దుకాణానికి వెళ్తుండగా ఆర్తి అడ్డుకుంది. తన బాయ్ ఫ్రెండ్ కు దూరంగా వుండాలని హెచ్చరించింది. అయినా ఆర్తి మాటలను పూజ లక్ష్యపెట్టలేదు, దీంతో వారిద్దరి మధ్య వాగ్వాధం తీవ్రస్థాయికి చేరింది.

దీంతో ఆగ్రహానికి గురైన ఆర్తి.. పూజను రోడ్డు మీద పడేసి కోట్టింది. తన ప్రియుడికి దూరంగా వుండకపోతే ఫలితం దారుణంగా వుంటుందని బెదిరించింది. రోడ్డుపై వెళ్తున్న పలువురు ఇద్దరు యువతులను విడదీసేందుకు ఎంత ప్రయత్నించినా పలితం లేకపోయింది. మరోవైపు వీరిద్దరూ అలా ఒకరినోకరు కొట్టుకుంటుంటే సందట్లో సడేమియాలాగా స్థానికులు ఆ దృశ్యాలను మొబైల్ లో చిత్రీకరించారు

కొబ్బరి చెట్టు నవ్వింది... అదెలాగో చూడండి!

0 comments
కర్ణాటకలోని ఓ కుటుంబానికి ఎదురైన విచిత్రమైన అనుభవం ఇది! ఉడుపి జిల్లాలోని వండ్సే గ్రామంలో గోవింద అనే వ్యక్తి ఇంట్లో ఓ కొబ్బరి చెట్టు ఉంది. ఓ సాయంత్రం ఆ చెట్టు నుంచి చిన్న పిల్లవాడి నవ్వులు వినిపించాయి. దాంతో, ఆశ్చర్యపోయిన ఆ కుటుంబ సభ్యులు కొబ్బరి చెట్టు వద్ద ఎవరైనా పిల్లలు ఉన్నారేమో అని చూస్తే అక్కడెవరూ కనిపించలేదు. కాసేపటి తర్వాత పిల్లవాడి నవ్వు ఆగిపోయింది. మళ్లీ నవ్వులు వినపడడంతో ఈసారి ఆశ్చర్యం స్థానంలో భయం కలిగింది గోవింద కుటుంబ సభ్యుల్లో. దాంతో, గోవింద ఓ జ్యోతిష్యుడిని కలిసి విషయం వివరించాడు. ఆ జ్యోతిష్యోత్తముడు సదరు కొబ్బరి చెట్టుపై దుష్టశక్తులు చేరి ఉంటాయని, హోమం చేస్తే అవి పారిపోతాయని చెప్పాడు. ఆయన మాట విని హోమం చేసినా ఫలితం శూన్యం! అదే రోజు సాయంత్రం మళ్లీ పిల్లవాడి నవ్వులు వినిపించాయి. ఈ రకమైన విచిత్రమైన పరిస్థితిలో గోవింద కుటుంబ సభ్యులు కొట్టుమిట్టాడుతుండగా... కొబ్బరికాయలు కోసే వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. ఆ నవ్వుల కారణమేంటో ఆ వ్యక్తి నోట విన్న గోవింద కుటుంబ సభ్యుల ముఖాల్లో నవ్వులు విరబూశాయి.

ఆ వ్యక్తి కొబ్బరి కాయలు కోసే సమయంలో తన సెల్ ఫోన్ ను చెట్టుపైనే మర్చిపోయాడట. అయితే, ఊర్లో చాలా చెట్లు ఎక్కే అతడు, తన ఫోన్ ను ఏ చెట్టుపై మర్చిపోయాడో గుర్తురాక వేరే ఫోన్ నుంచి తన ఫోన్ నెంబర్ కు కాల్ చేసేవాడు. చిన్న పిల్లవాడి నవ్వులే అతడి ఫోన్ కు రింగ్ టోన్ గా పెట్టుకున్నాడు! అందుకే ఆ వ్యక్తి తన ఫోన్ కు కాల్ చేసినప్పుడల్లా గోవింద కుటుంబానికి నవ్వులు వినిపించేవి. ఎవరు నవ్వుతున్నారో తెలియక, పాపం, హడలిచచ్చేవారు! చివరికి గోవింద ఇంటి వద్ద కొబ్బరిచెట్టుపై తన ఫోన్ ఉందన్న విషయాన్ని గ్రహించి, చెట్టెక్కి తన ఫోన్ తెచ్చుకున్నాడా మతిమరపు వ్యక్తి. దీంతో, పిల్లవాడి నవ్వుల వ్యవహారం అలా అందరినీ నవ్వించింది.  

పురాతన ప్రపంచంలోని అతి కిరాతక మరణ శిక్షలు

1 comments
పురాతన కాలంలో మరణదండన పలు రకాలుగా వుండేది. వాటితో అత్యంత భయానకంగా హింసించి మరణ శిక్షను విధించేవారు. వాటిలో అతి కిరాతకమైన శిక్షలు ఏమిటో మీకు తెలుసా..?

1. శిలువ: నేరానికి, రాజధ్రోహానికి పాల్పడిన నేరస్తుడిని భారీ చెక్క శిలువపై పడుకోబెట్టి ఇరు వైపులా చేతులకు పెద్ద మేకులు బిగించి, కాళ్ళు రెండు ఒకదానిపై మరొకటి అమర్చి పాదాల వద్ద మరో మేకును బిగించి నిర్మానుష్య ప్రాంతంలో పాతిపెడతారు. దీంతో ఆ భాదను భరించలేని మనిషి తన ప్రాణం ఎప్పడు పోతుందా అంటూ వేచి చూడాల్సిన పరిస్థతి ఏర్పడుతుంది. తీవ్ర రక్తస్రావంతో నేరస్థులు మరణాన్ని ఆహ్వానిస్తారు. ఇక మరికొన్ని ఘటనల్లో నేరస్థులు బతికుండగానే రాబంధులు వారిని పీక్కుతింటుంటాయి. క్రీస్తుపూర్వం నుంచి వస్తున్న ఈ శిక్షనే కరుణామయుడు ఏసుక్రీస్తుకు విధించారు.
2.పదునైన వస్తువును గుచ్చడం: ఇది మరో రకంగా మనుషులను హింసించి వారు అరవకుండా ప్రాణాలను తీయడమే. కాళ్లు, చేతులు కట్టేసి నేరస్థులను గుంజానికి కట్టి కూర్చోబెడతారు. ఆ తరువాత వారి నోట్లో పదునైన పొడవాటి ఆయుధాన్ని గుచ్చుతారు. తద్వారా నేరస్థుడు తన భాధను కూడా వెళ్లగక్కకుండా నోటి నుంచి శరీరంలోకి పదునైన వస్తువు దిగబడుతుంది. దీంతో క్రమంగా నోప్పిని భరించలేక నేరస్థుడు ప్రాణాలను కోల్పోతాడు. మనుషులను పదునైన వస్తువులతో పొడిచి అలానే వదిలేస్తారు. దీంతో మనుషులు నోప్పితో పాటు రక్తస్రావం జరిగి ప్రాణాలను కోల్పోతారు.
3. బ్రేకింగ్ వీల్: ఇప్పటికే పలు గ్రామాల్లో కనిపించే బండి చక్రం మాదిరిగానే ఇంకొంచెం పెద్ద పరిమాణంలో వున్న చక్రానికి నేరస్థుల చేతులు కాళ్లు కట్టి వారిని మెల్లిగా తిప్పుతారు. ఈ క్రమంగా వారు తిరుగుతున్న సమయంలోనే వారి కాళ్లను ముక్కలు ముక్కలుగా నరుకుతారు. దీంతో నేరస్తుడు చిత్ర హింసను అనుభవిస్తూ మరణిస్తాడు.
4. కట్టేసి నాలుగు వైపులా లాగటం: నేరస్థులను గుర్రానికి కట్టి, శిక్షను అమలు చేసే ప్రాంతానికి ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. అప్పటికే మరణం అంచుల్లోకి వెళ్లిన నేరస్తుడిని ఒక బల్లపై పడుకోబెట్టి నాలుగు వైపులా నాలుగు గుర్రాలతో కాళ్లు, చేతులు కట్టి లాగుతారు. అ తరువాత నడుము బాగంలో పెద్ద కత్తితో నేరస్థుడి శరీరాన్ని భాగాలుగా నరుకుతారు.
5. ఏనుగులతో తొక్కించడం: నేరస్థుడి తలను ఒక రాయికి లేదా కొంత ఎత్తైన ప్రాంతంలో పెట్టించి తలను బిర్రుగా కడతారు. ఆ తరువాత ఏనుగును తీసుకు వచ్చి శిరముపై తొక్కిస్తారు. దీంతో నేరస్తుడి తలకు బలమైన గాయమై, రక్తస్రావంతో మరణిస్తాడు
6. రాక్ : నేరస్థుడిని అర్ర లాంటి చట్రములో బంధించి నెమ్మదిగా చట్రాన్ని తిప్పుతారు. క్రమంగా అతని కాళ్లు కిందకు రావడం అవి ముక్కలవ్వడంతో నేరస్థుడు మరణిస్తాడు.
7. అంగాలఛ్చేధనం: నేరస్తుల కాళ్లను చేతులను కట్టిసి కడుపులో కత్తితో కొసి ఒక్కొక్క అంగాన్ని శరీరం నుంచి బయటకు తీసి పడేస్తారు. పొట్ట పైబాగంలో కోయడంతోనే భాధను భరించలేని నేరస్థుడు విలవిలలాడుతాడు. ఆ తరువాత పొట్టలోనుంచి అంగాలన్నింటినీ వేరుగా తీసేస్తారు. అప్పటికి నేరస్థుడు సజీవంగా వున్నా, మరణించినా పట్టించుకోకుండా అంగాలను వేరు చేస్తారు. దీంతో నేరస్థులు మరణిస్తారు.

8. ఇత్తడి ఎద్దు : నేరస్తులను ఇత్తడితో చేసిన ఎద్దులో పడుకోబెట్టి చేతులు కాళ్లు, నడుము కట్టివేస్తారు. ఆ తరువాత పైబాగాన్ని మూసివేసి కింద మంట పెడతారు. మంటను క్రమంగా పెంచుతూ పోతారు. ఇత్తడి ఎద్దు పసుపు వర్ణం నుంచి బంగారు వర్ణం చేరుకునే వరకు మంటలను అలా పెంచుతారు. మంట వేడికి తాళలేక నేరస్థుడు ఎద్దు తరహాలో అరచి అరచి మరణానికి చేరువై ప్రాణాలను కోల్పోతాడు.
9. చర్మాన్ని ఒలచడం: నిందితుడిని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి చెట్లుకో, లేదా ఒక లావుపాటి దిమ్మెలకో కడతారు. అతడు ప్రాణాలతో వుండగానే అతని చర్మాన్ని, చేతుల నుండి ప్రారంభించి ఒలవడం ప్రారంభిస్తారు.  నేరస్థుడు మరింత బాధకు లోను కావడానికి ఉప్పు, కారం వంటి వస్తువులను అతని ఒలచిన చర్మంపై చల్లుతారు. అలా శరీరం మొత్తం నుండి చర్మాన్ని ఒలచి దేహాన్ని మరణానికి వదిలేస్తారు. తీవ్ర రక్తస్రావంతో నేరస్థుడు మరణిస్తాడు.
10 రంపపు కోత: ఈ శిక్షలో నేరస్థుడిని తలక్రిందులుగా వేలాడదీస్తారు. ఆ తరువాత అతన్ని, రెండు కాళ్ల నడుమ మర్మాంగం వద్ద నుండి రంపంతో కోస్తారు. ఇలా ఒక కాలును శరీరం నుండి వేరు చేస్తారు. దీంతో నేరస్తుడు మరణిస్తాడు. ఇంత దారుణమైన శిక్షలు పురాతన కాలంలో రాజుల హయాం లో  వుండేవి.

- Original from: http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/59211-world-s-top-ten-brutal-execution-of-the-ancient-world.html

ఆడపిల్ల ని బ్రతకనివ్వరా?

0 comments

దెయ్యం ప్రచారం - Nirma Ad

0 comments
 

నిర్మా డిటెర్జంట్ వారి సరికొత్త యాడ్

Copyright © ఆకాశ గంగ