బాయ్ ఫ్రెండ్ కోసం అమ్మాయిల ‘స్ట్రీట్ ఫైట్’..

0 comments

ప్రియురాలి కోసం ఇద్దరు యువకులు పోట్లాడుకోవడం మనం విన్నాం, చూశాం కూడా. అయితే ఇప్పుడు ఏకంగా సీను మారింది. బుల్లితెర నుంచి వెండితెర వరకు పాకిన మహిళా విలనిజం.. ఇక వాస్తవ రూపం కూడా దాల్చింది. ఇటీవల యూపీలో ఓ లేడా డాన్ తన తుపాకితో స్థానికులను బెదిరించి.. చర్చి పక్కను వున్న భూమిని కబ్జా చేసేందుకు యత్నించి.. అడ్డువచ్చిన మహిళను కూడా ట్రాక్టర్ తో తొక్కించిన ఘటనను మరువక ముందే మీరట్ లో మరోకటి అలాంటి ఘటనే వెలుగుచూసింది. అయితే ఇది కబ్జా కోసం మాత్రం కాదు. ఇద్దరు యువతలు వారి బాయ్ ఫ్రెండ్ కోసం పోట్లాడుకున్నారు. 

ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ మాధవాపురానికి చెందిన ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పూజ (మారు పేరు) అనే యువతి స్థానిక మొబైల్ దుకాణంలో పనిచేస్తుంది. పూజ తన ప్రియుడిని తనకు కాకుండా చేస్తోందని ఆర్తి (మారు పేరు) అనే యువతి అరోపించింది.  పూజ ఓ యువకుడితో కలసి మొబైల్ దుకాణానికి వెళ్తుండగా ఆర్తి అడ్డుకుంది. తన బాయ్ ఫ్రెండ్ కు దూరంగా వుండాలని హెచ్చరించింది. అయినా ఆర్తి మాటలను పూజ లక్ష్యపెట్టలేదు, దీంతో వారిద్దరి మధ్య వాగ్వాధం తీవ్రస్థాయికి చేరింది.

దీంతో ఆగ్రహానికి గురైన ఆర్తి.. పూజను రోడ్డు మీద పడేసి కోట్టింది. తన ప్రియుడికి దూరంగా వుండకపోతే ఫలితం దారుణంగా వుంటుందని బెదిరించింది. రోడ్డుపై వెళ్తున్న పలువురు ఇద్దరు యువతులను విడదీసేందుకు ఎంత ప్రయత్నించినా పలితం లేకపోయింది. మరోవైపు వీరిద్దరూ అలా ఒకరినోకరు కొట్టుకుంటుంటే సందట్లో సడేమియాలాగా స్థానికులు ఆ దృశ్యాలను మొబైల్ లో చిత్రీకరించారు

కొబ్బరి చెట్టు నవ్వింది... అదెలాగో చూడండి!

0 comments
కర్ణాటకలోని ఓ కుటుంబానికి ఎదురైన విచిత్రమైన అనుభవం ఇది! ఉడుపి జిల్లాలోని వండ్సే గ్రామంలో గోవింద అనే వ్యక్తి ఇంట్లో ఓ కొబ్బరి చెట్టు ఉంది. ఓ సాయంత్రం ఆ చెట్టు నుంచి చిన్న పిల్లవాడి నవ్వులు వినిపించాయి. దాంతో, ఆశ్చర్యపోయిన ఆ కుటుంబ సభ్యులు కొబ్బరి చెట్టు వద్ద ఎవరైనా పిల్లలు ఉన్నారేమో అని చూస్తే అక్కడెవరూ కనిపించలేదు. కాసేపటి తర్వాత పిల్లవాడి నవ్వు ఆగిపోయింది. మళ్లీ నవ్వులు వినపడడంతో ఈసారి ఆశ్చర్యం స్థానంలో భయం కలిగింది గోవింద కుటుంబ సభ్యుల్లో. దాంతో, గోవింద ఓ జ్యోతిష్యుడిని కలిసి విషయం వివరించాడు. ఆ జ్యోతిష్యోత్తముడు సదరు కొబ్బరి చెట్టుపై దుష్టశక్తులు చేరి ఉంటాయని, హోమం చేస్తే అవి పారిపోతాయని చెప్పాడు. ఆయన మాట విని హోమం చేసినా ఫలితం శూన్యం! అదే రోజు సాయంత్రం మళ్లీ పిల్లవాడి నవ్వులు వినిపించాయి. ఈ రకమైన విచిత్రమైన పరిస్థితిలో గోవింద కుటుంబ సభ్యులు కొట్టుమిట్టాడుతుండగా... కొబ్బరికాయలు కోసే వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. ఆ నవ్వుల కారణమేంటో ఆ వ్యక్తి నోట విన్న గోవింద కుటుంబ సభ్యుల ముఖాల్లో నవ్వులు విరబూశాయి.

ఆ వ్యక్తి కొబ్బరి కాయలు కోసే సమయంలో తన సెల్ ఫోన్ ను చెట్టుపైనే మర్చిపోయాడట. అయితే, ఊర్లో చాలా చెట్లు ఎక్కే అతడు, తన ఫోన్ ను ఏ చెట్టుపై మర్చిపోయాడో గుర్తురాక వేరే ఫోన్ నుంచి తన ఫోన్ నెంబర్ కు కాల్ చేసేవాడు. చిన్న పిల్లవాడి నవ్వులే అతడి ఫోన్ కు రింగ్ టోన్ గా పెట్టుకున్నాడు! అందుకే ఆ వ్యక్తి తన ఫోన్ కు కాల్ చేసినప్పుడల్లా గోవింద కుటుంబానికి నవ్వులు వినిపించేవి. ఎవరు నవ్వుతున్నారో తెలియక, పాపం, హడలిచచ్చేవారు! చివరికి గోవింద ఇంటి వద్ద కొబ్బరిచెట్టుపై తన ఫోన్ ఉందన్న విషయాన్ని గ్రహించి, చెట్టెక్కి తన ఫోన్ తెచ్చుకున్నాడా మతిమరపు వ్యక్తి. దీంతో, పిల్లవాడి నవ్వుల వ్యవహారం అలా అందరినీ నవ్వించింది.  
Copyright © ఆకాశ గంగ