అష్టదిగ్గజములు

0 comments
  1.  అల్లసాని పెద్దన: 'మనుచరిత్ర' అను ప్రబంధమును రచించెను. శ్రీకృష్ణదేవరాయలకు అంకితము చేసి సత్కారము పొందెను.ఆంధ్రకవితాపితామహుడు అను బిరుదు కూడా కలదు.
  2. నందితిమ్మన: ఈయనను  ముక్కుతిమ్మన అని కూడా అందురు. 'పారిజాతాపహరణము' అను గ్రంథమును రచించెను.
  3. మాదయగారి మల్లన్న: ఇతడు 'రాజశేఖరచరిత్ర' అను గ్రంథమును  రచించెను.
  4. ధూర్జటి:  శ్రీకాళహస్తి మహత్యము, శ్రీకాళహస్తీశ్వర శతకములను రచించెను
  5. అయ్యలరాజ రామభద్రుడు: ఇతడు రామాభ్యుదయమును రచించెను
  6. పింగళి సూరన: ఇతడు రాఘవ పాండవీయము అను శ్లేష కావ్యమును, కళాపూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నము అను గ్రంథములను రచించెను.
  7. రామరాజభూషణుడు: భట్టుమూర్తి ఇతని నామాంతరము. వసుచరిత్ర అను శ్లేష కావ్యమును, హరిశ్చంద్రోపాఖ్యానము అను ద్వర్థి కావ్యము రచించెను
  8. తెనాలి రామకృష్ణుడు: ఇతనికి వికటకవి అని కూడా పేరు. పాండురంగ మహత్యము అను కావ్యమును రచించెను

కేకు తిన్నానండి!

0 comments
భార్య: ఏమండీ! రాత్రి నాకు కేకు తిన్నట్లు కల వచ్చిందండీ!
భర్త: ఓహో పొద్దున్న నాకు సబ్బుబిళ్ళ కనిపించలేదు అందుకేనా?

ఆలీ as మగధీర

0 comments


నిద్రపొయేవారిని ఎలా లేపాలి?

2 comments
పెద్దగా అరిచి లేపకూడదు. పడుకున్నవాణ్ణి కుదిపి కుదిపి లేపకూడదు. ముందు మెల్లగా పిలిచి, ఆపై స్వరం పెంచి, నెమ్మదిగా చేయివేసి కదిపి లేపాలి. ఒంటరిగా నిద్రపోతున్నవారి విషయం లో మరింత జాగరూకత వహించాలి.
మనిషి నిద్రిస్తున్నపుడు ఆత్మలోని కొన్ని అంశాలు బయటకు వెళుతుంటాయి అంటారు. అందుకే అనర్ధాలు జరిగే అవకాశం ఉండుటవలన నిద్రలేపే విషయంలో అదీ అనారోగ్యంగా ఉన్నవారి విషయంలో పెద్దవారి విషయంలో జాగ్రత్త వహించాలి.

గంగాజలంలో అంతటి శక్తి ఉండటానికి గల కారణం ఏమిటి?

2 comments
హిమాలయాల్లో పుట్టిన జలం గంగ. గంగ ప్రవహించే చాలా ప్రాంతం భూభాగంలో ఔషధ మొక్కలు ఉండటం వల్ల ఈ నీటిలో చైతన్యం కలిగించే శక్తి నిక్షిప్తమై ఉంటుంది. కలరా, అంటువ్యాధులు వంటి క్రిములు ఈ నీటిలో బ్రతకలేవు. గంగాజలం సమస్త వ్యాధులను పోగొట్టే అమృతజలమని చరకమహర్షి చెప్పారు.

తల్లితండ్రుల గొప్పతనం

0 comments
తల్లితండ్రుల గొప్పదనం గురించి శాస్త్రాలలో చెప్పబడిన విధానం:
  • ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి
  • ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి
  • ఒక్కసారి తల్లికి,తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.
  • సత్యం తల్లి .............. జ్ఞానం తండ్రి.
  • పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.
  • ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం
  • ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.
  • తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే అని ధర్మశాస్త్రం చెబుతోంది. తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదు.

చతుర్విద దానములు అనగా?

0 comments
చావుభయంతో  భీతిల్లేవాడికి ప్రాణ అభయం ఇవ్వటమూ, రోగాలతో, రొప్పులతో భాధపడేవారికి వైద్యం చేయించడమూ, పేదవారికి ఉచితవిద్యను అందించడమూ, ఆకలితో అల్లాడేవారికి ఆహారం ఇవ్వడం. ఇవీ చతుర్విద దానాలు. ఈ దానాలు చేసిన వారికి పూర్వజన్మ పాపాలు నశిస్తాయి.

ఎపుడు అభ్యంగన స్నానం చెయ్యకూడదు?

0 comments
శ్రాద్ధ దినములయందు, ఆది, మంగళ వారములు, పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, చతుర్ధశి తిధులయందు అభ్యంగన స్నానం చెయ్యరాదని శుకమహర్షి తెలియచేశారు.

శంఖం పూరించుటవలన?

0 comments
గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి. ఆరునెలల పురాణ శ్రవణం వలన కలిగిన ఫలం, ఒక్కసారి శంఖం పూరించినంతనే కలుగుతుంది.

ఉత్తమమైన ఆహరం ఏది?

0 comments
తీగ ద్వారా వచ్చే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ, గుమ్మడి, చిక్కుడు, దోసకాయ మరియు ఆకుకూరలు ఉత్తమమైన ఆహరం. కాయల ద్వారా వంకాయ, టొమేటో మొదలైనవన్నీ మధ్యమాలు. ఇక అధమం - భూమిలో పండేవి. అనగా దుంప కూరలు. దుంపకూరలు ఆరోగ్యానికి ఏమంత మంచి చేయవని వైద్యశాస్త్రం చెబుతోంది.

తల్లి గర్భం లో బిడ్డ ఎలా ఎదుగుతాడు?

0 comments
మొదటిరోజు కలిలం అవుతుంది. అయిదురోజులకు బుద్బుదాకారము. పదిరోజులకు రేగుపండంత. ఒక నెలకి తల, రెండో నెలకి భుజాలు, మూడో నెల పూర్తయ్యేసరికి ఆకలిదప్పికలు మొదలవుతాయి.
ఆరునెలలకి మాయతో కప్పబడతాడు. ఏడు నెలలకి జ్ఞానము కలుగుతుంది. కదలడం మొదలవుతుంది. అపుడే భగవంతుడ్ని, గత జన్మలో వలె పాపాలు చెయ్యననీ, మంచి బుద్ధిని ఇవ్వమనీ అనేకవిధాల వేడుకుంటాడు. నెలలు నిండాక భూమి మీద పడతాడు. తల్లి కడుపులో చేసిన ప్రతిజ్ఞలన్నీ మర్చిపోతాడు. అతనిని మహామాయ కమ్మేస్తుంది.

వరాలివ్వకూడదు

0 comments
రాజు:  ఒరేయ్ రవీ !  రామాయణం చదవడం వలన నువ్వు గ్రహించిన నీతి ఏమిటో చెప్పరా?
రవి:  భార్యకు వరాలివ్వకూడదు.
రాజు:  ????????????????????

నేనా? మా ఆయనా?

0 comments
డాక్టర్:    మీ ఆరోగ్య విషయమై దాంపత్యానికి కొంతకాలం దూరంగా ఉండాలి.
పేషెంటు భార్య:    నేనా? మా ఆయనా?
డాక్టర్:     ???????????????????????

ఎన్ని యజ్ఞాలు చేసినా పోని పాపాలు ఏవి?

0 comments
అన్యాయంగా పరుల ధనాన్ని చేజిక్కించుకున్నవారికీ, పరాయివాని భార్యని ఆశించి పొందినవానికీ, ఇంటి యజమాని లేదా పెద్దలు లేనపుడు పిల్లలకి చెందాల్సిన ఆస్తిని కాజేసినవారికీ ఎన్ని శ్రాధ్ధాదులు పెట్టినా, ఎన్ని యజ్ఞాలు చేసినా ఆ పాపాలు నశించవు. ఆ పాపాలకు శిక్ష పై లోకాలలోనూ, ఇక్కడా అనుభవించవలసిందే.

యమపురి దారి ఎలా ఉంటుంది?

3 comments
మనిషి ఆయువు తీరిన పదమూడో రోజు తర్వాత యమభటులు జీవిని యమపురికి తీసుకెళ్తారు. దారి అంతా ఎగుడు దిగుడులు. ఆకలిదప్పికలు తీరే అవకాశం లేని ప్రాంతంలో అరికాళ్ళు బొబ్బలెత్తినా యమభటులు కొరడాలతో కొట్టి నడిపిస్తారు. కనుచూపు మేరలోనే నీరు ఉంటుంది. త్రాగబోతే చేతికి అందదు. మేఘాలు  నిరంతరం రక్తాన్ని వర్షిస్తుంటాయి. అలా పదిహేడు రోజులపాటు, జీవించినపుడు చేసిన పాపాలను తలచుకుని వాపోతుంటాడు జీవుడు. ఆ తరువాతే యమపురి మజిలీ అయిన సౌమ్యపురం చేరతాడు.

దేవత్వ స్త్రీ లక్షణాలేమిటి?

0 comments
అడుగు దూరంలోనే సువాసన తగులుతుంది. నిట్టూర్పుల శరీరతత్వం కలది. ప్రశాంతమైన ముఖంతో ఎపుడూ నిండుకుండలా కనిపించే స్త్రీ దేవత్వ అని చెప్పబడింది.

వైతరణి నది ఎలా ఉంటుంది?

0 comments
వంద యోజనాల వెడల్పు తో ఉంటుంది. అందులో చిక్కని రక్తం, చీము , మహా జలచరాలు ఉంటాయి. ఒక్క క్షణం కూడా భరించలేని వాసన. ఎన్ని దీనాలాపనలు చేసినా పాపి అక్కడ తాను చేసిన పాపాలకు ఫలితం అనుభవించవలసిందే.
అందుకే తమ వారి కోసం భూమిపై వారి పేరు మీద గోదానం చేస్తారు. గోదానం చేస్తే వైతరణి నదిని సులభంగా దాటగలరని పురాణంలో శ్రీ మహవిష్ణువు స్వయంగా గరుగ్మంతునికి చెప్పాడని అంటారు.

కరెంట్ తీగలు పక్షులకు షాక్ కొట్టవా?

0 comments
కరెంట్ తీగల మీద కూర్చున్న పక్షి శరీరం కరెంట్ తీగలతో సమాంతర వలయాన్ని ఏర్పరచడం వలన విద్యుత్ పొటెన్షియల్ స్థిరం గా ఉంటుంది. పక్షి రెండు కాళ్ళ మధ్య పొటెన్షియల్లో ఏ భేధం ఉండదు. అందుకే షాక్ కొట్టదు.
కానీ అదే పక్షి ఒక తీగ మీద వాలి ఉండి, ముక్కుతో మరో తీగను తాకితే విద్యుత్ పొటెన్షియల్ లో భేధం ఏర్పడి, విద్యుత్ ప్రవహించి షాక్ కొడుతుంది.

అసూయాపరురాలైన కోడలు అంటే ఎవరు?

0 comments
'నిండు నూరేళ్ళు బ్రతకడం ఎలా?' అన్న పుస్తకం భర్త తెచ్చిస్తే అత్తగారు ఎక్కడ చదివేస్తారో అని బీరువాలో దాచేసేది.

తిరుమలస్వామి ని దర్శించేటపుడు బ్రహ్మనాడి ని కూడా దర్శించాలా?

1 comments
తిరుమలస్వామి ని దర్శించేటపుడు బ్రహ్మనాడి ని కూడా దర్శించాలంటారు. సప్తగిరివాసుని దర్శనానికి వెళ్ళినపుడు కనులు మూసుకుని ధ్యానించకుండా సాధ్యమైనంతవరకు స్వామినే  చూడాలి. శ్రీవారి విగ్రహ నొసటి కుడిప్రక్కన నామం క్రింద సూర్యనాడి, ఎడమ ప్రక్కనున్న నామం క్రింద బ్రహ్మనాడి ఉంటాయి. అంటే మధ్యనున్న ఎర్రని నామమే బ్రహ్మనాడి. దీనియందే పరమాత్ముడు ఉన్నాడంటారు. 

నందకం అంటే ఏమిటి?

0 comments
శ్రీవారి పంచాయుధాలలో నందకమనే ఖడ్గం తిరుమలలో సూర్యకఠారి అనే పేరు తో నడుము భాగం లో అలంకరించబడుతుంది. సుమారు మూడడుగుల పొడవు తో బంగారు ఒర లో ఇమిడిన నిజమైన ఖడ్గమది.

రెండు తలల శిశువు జననం.

0 comments
చిత్తూరు జిల్లా , రేణిగుంట మండలం, కొత్తపాలెం కు చెందిన మునిరామిరెడ్డి కి ఈ శిశువు జన్మించాడు. ఈ శిశువు కి రెండు తలలు, రెండు వెన్నెముక లు ఉన్నాయి. జన్యు లోపం వల్ల ఇలా అరుదుగా పుడతారని వైద్యులు చెబుతున్నారు.

నటుల అసలు పేర్లు

1 comments
  1. రాజబాబు   ---------- పుణ్యమూర్తుల అప్పలరాజు
  2. చిరంజీవి    ---------- కొణిదెల శివశంకర వరప్రసాద్
  3. కృష్ణంరాజు  ---------- ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు
  4. ఎస్వీ రంగారావు  --------------- సామర్ల వెంకట రంగారావు
  5. బ్రహ్మానందం  --------------- కన్నెగంటి బ్రహ్మానందం
  6. సుత్తివేలు  -------------- కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు
  7. కృష్ణ భగవాన్ ----------- పాపారావు చౌదరి
  8. చక్రవర్తి  ---------------- కొమ్మినేని అప్పారావు
  9. గిరి బాబు -------------- యర్రా శేషగిరిరావు
  10. కృష్ణ  -------------------- ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి
  11. జగపతిబాబు ------------ వీరమాచనేని జగపతి చౌదరి
  12. కాంతారావు  -------------- తాడేపల్లి లక్ష్మీ కాంతారావు
  13. నూతన్ ప్రసాద్  ------------ వరప్రసాద్
  14. పవన్ కళ్యాణ్  ------------ కొణిదెల కల్యాణ్ బాబు
  15. మోహన్ బాబు  ----------- మంచు భక్తవత్సలం నాయుడు
  16. మమ్మూట్టి  ---------------- ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్
  17. సుమంత్   ---------------- యార్లగడ్డ సుమంత్ కుమార్
  18. రజినీకాంత్  -------------- శివాజీరావ్ గయక్వాడ్
  19. రవితేజ ----------------- భూపతిరాజు రవిశంకర్ రాజు
  20. శుభలేఖ సుధాకర్ -------------- సూరావఝుల సుధాకర్
  21. శోభన్ బాబు  ----------------- ఉప్పు శోభనా చలపతిరావు
  22. ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం  ------------ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
  23. ముక్కు రాజు  ----------------- సాగి రాజన్ రాజు
  24. సుమన్  -------------------- సుమన్ తల్వార్
  25. సూర్య  ---------------------- సూర్య శివకుమార్

పుల్లలేరాలిరా నేను?

1 comments

మీకు తెలుసా?

0 comments
  • హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పుస్తకం విడుదలైన మొదటి రోజునే తొమ్మిది మిలియన్ల ప్రతులు అమ్ముడయింది.
  • వైర్‌లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ ద్వారా మొబైల్ ఫోన్లలో మరియు పీడిఏ లలో వెబ్ ను సందర్శించవచ్చు.
  • నోబెల్ పతకాన్నిముందుగా 18 క్యారట్ల బంగారంతో తయారు చేసి దానికి 23 క్యారట్ల బంగారంతో పూత వేస్తారు.
  • అమెరికా అధ్యక్ష భవనం నిర్వహణకు ఏటా సుమారు 600 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. 
  • ఈ రోజు ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ (డిసెంబర్ 22 , 1887) జన్మించాడు

అంతరాత్మకు, మనసుకు గల తేడా ఏమిటి?

3 comments
ఈ ప్రశ్న ఉదయం నేను ఆఫీసు కు వస్తున్నపుడు నా స్నేహితుడు అడిగాడు. దీనికి సమాధానం ఎందుకు చెప్పలేములే అనుకున్నాను. కానీ సమాధానం చెప్పడానికి చాలా గింజుకున్నాను. ఇంతకీ సమాధానం చెప్పలేదనుకోండి అది వేరే విషయం. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి , నేను మళ్లీ వాడికి చెప్పాలి కదా!

ఆశకు తృప్తి కి తేడా ఏమిటి?

2 comments
ఆవగింజ కు అగ్నిపర్వతానికి ఉన్నంత తేడా ఉంది. కోట్లు మూలుగుతున్నా పావలా కోసం కక్కుర్తి పడటం ఆశ అయితే, దొరికిన అదే పావలా తో గంజి త్రాగి హాయిగా జీవితాన్ని వెళ్ళబుచ్చడం తృప్తి.

సీమంతం లో గాజులు ఎందుకు తొడుగుతారు?

2 comments
ఏ శుభకార్యాల్లో లేని విధంగా సీమంతం లో గాజులు తొడిగి పండంటి బిడ్డను ఇమ్మని ఆశీర్వదిస్తారు. అలా గాజులు ఎందుకు తొడుగుతారంటే గర్భం ధరించిన స్త్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి.  చేతుల్లో నరాలకీ, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది. అలా ఎక్కువ గాజులు తొడగడం వలన గర్భకోశం పై సరైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుంది.

శరీరాన్ని అనారోగ్యం ఎలా ఆవహిస్తుంది?

0 comments
  • ఆహారం జీర్ణం కాకముందే మళ్లీ మళ్లీ ఆత్రం గా తినడం వల్ల
  • అమితంగా పుల్లటి పదార్ధాలు తినడం వలన
  • చలిమిడి తినడం వలన
  • శరీరానికి పని లేకుండా ఉండుట వలన
  • పగటిపూట నిదురించుట వలన
  • పాలు, చేపలు ఏకకాలం లో ఆహారం గా తీసుకొనుట వలన

కంచు పాత్రల్లో ఎవరు భోజనం చెయ్యకూడదు?

1 comments
కంచు పాత్రల్లో మఠాధిపతులు, మతప్రచారకులు, సన్యాసులు, దీక్ష తీసుకున్నవాళ్ళు  భోజనం చెయ్యకూడదు. ఎందుకంటే కంచు అధికంగా శరీర పటుత్వాన్ని పెంచుతుంది. ఆ కారణం గా ఐహిక సుఖాల మీద వాంఛ పెరుగుతుంది.

మగవారికి ప్రాతివత్య నియమం లేదా?

2 comments
ఆడవారి లాగా మగవారికి ప్రాతివత్య నియమం ఎందుకు పెట్టలేదు?

తప్పు ఎవరు చేసినా తప్పే. స్త్రీ చేసినా పురుషుడు చేసినా నరకలోక శిక్షలు తప్పవు. ఐతే పురుషునికి ప్రాతివత్య నియమం ఎందుకు పెట్టలేదంటే, పురుషుడు తప్పు చేస్తే ఆ వంశం చెడదు. అదే స్త్రీ ప్రాతివత్య నియమాన్ని ఉల్లంఘిస్తే ఆ వంశం చెడుతుంది. ఎందుకంటే వంశాన్ని వృద్ది చేసేది స్త్రీ కాబట్టి. భర్త ద్వారా కాకుండా ప్రాతివత్య నియమాన్ని ఉల్లంఘించి బిడ్డను కంటే మరి ఆ వంశవృక్షం  నాశనం అయినట్లే కదా!

ఆయుష్షు ను పెంచుకోవడం ఎలా?

0 comments
  • సాయంకాల ఎండ ను ఆస్వాదించడం వలన 
  • యజ్ఞ యాగాదుల పొగను పీల్చడం వలన
  • తన కన్నా చిన్నదానిని భార్య గా చేసుకొనుట వలన
  • ఎక్కువ నీరు త్రాగటం వలన
  • రాత్రిపూట క్షీరాన్నం భుజించుట వలన
  • నిత్యం వ్యాయామం చేయుట వలన
  • అత్యాశ లేకుండుట వలన

ఎంత కంగారుపడ్డానో తెలుసా!

1 comments
భర్త ఆఫీసు నుండి ఇంటికి రాగానే భార్య 'హమ్మయ్య, మీరు క్షేమంగానే ఇల్లు చేరారు, మీరు ఇంకా రాలేదని నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా' అంది.

భర్త: ఎందుకు కంగారుపడటం. ఏమి జరిగింది.

భార్య: ఇందాక ఎవరో పిచ్చివాడి లా ఉన్న వ్యక్తి బస్సు కింద పడ్డాడని అందరూ అనుకుంటుంటే విన్నాను.

భర్త: ????????????

సాగర కన్యలు ఉన్నారా?

2 comments
సముద్రం ఒక తరగని గని. అనంతమైన ఈ సాగరగర్భం లో సామాన్యులకు అర్ధం కాని ఎన్నో వింతలూ, విశేషాలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద నౌక లను ముంచివేసే ప్రాణులు ఉన్నాయి. ఎవరూ తెలుసుకోలేని భారీ ప్రాణులు ఉన్నాయి. సముద్రం మధ్యకు వెళ్ళిన హెలికాప్టర్ హఠాత్తుగా మాయమైనపోయిన సంఘటన ఈ మధ్య జరిగినది. అది ఎలా మాయమైనదో ఏమి జరిగిందో కూడా ఎవరికీ తెలియలేదు. అలాంటి ఒక విచిత్రమైన విశేషమే 'సాగర కన్య'.

చిన్నప్పుడు మనం చందమామ కధలలో సాగరకన్యల గురించి చదువుకున్నాం. కానీ అవి కధల వరకేనా లేక నిజంగా అవి ఉన్నాయా అనేదే ఇపుడు ప్రశ్న. తల నుండి నడుము వరకు మనిషి లా ఉండి, నడుము క్రింది భాగం అంతా చేప లా ఉండే ఈ సాగరకన్య లు సముద్రం లోని ఏ ప్రాణీ వెళ్లలేనంత లోతుకు వెల్లగలవని, వాటికి సముద్రం లోని అపారమైన ఖనిజ సంపదను గుర్తించే శక్తి ఉందని అంటుంటారు.

కొన్నేళ్ళ క్రితం ఫిజీ సముద్ర తీరం లో చేపలు పట్టేవాళ్ళకు ఒక మరణించిన మత్స్యం లభించింది. అది నడుము వరకు మనిషి లా, నడుము కింద చేపలా ఉండటం తో దాన్ని సాగరకన్య గా గుర్తించారు. దాంతో ఎన్నో ఏళ్లుగా సాగరకన్య ల మీద పరిశోధనలు చేస్తున్న డాక్టర్ గ్రిఫిన్ అక్కడకు వచ్చి దానిని తన ప్రయోగశాలకు తీసుకువెళ్ళి పరిశోధన చేసి దానిని సాగరకన్య గా నిర్ధారించాడు.

మన దేశం లో కూడా సాగరకన్య లభించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. డిసెంబరు 2004 లో సునామీ వచ్చినపుడు చెన్నై మెరీనా బీచ్ కు ఒక సాగరకన్య కొట్టుకువచ్చినట్లుగా అప్పట్లో కొంతమంది పేర్కొన్నారు. ఏది ఏమైనను భగవంతుని అపూర్వ సృష్టి లో సాగరకన్య ఒక అద్భుతం, విశేషం అది ఉన్నా లేకపోయినా.

పరమేశ్వరుడు లింగరూపం లోనే ఎందుకు ఉంటాడు?

0 comments
భృగు మహర్షి శాపం వలన పరమేశ్వరుడు లింగరూపం లో ఉంటాడు. లింగానికి పూజిస్తేనే ఫలితమెక్కువ. శివలింగానికి మడి, శుద్ధి, ఆచారము ఉండవు. కావున శివసన్నిధి కి ఎలా అయినా వెళ్ళవచ్చును.

విష్ణు ఆలయానికి మాత్రం అత్యంత శుభ్రత తో వెళ్ళాలి. లేదంటే విష్ణువు ఊరుకున్నా, మహాలక్ష్మి ఊరుకోదు.

పూర్వకాలం లో ఉపద్రవాలను ఎలా కనిపెట్టేవారు?

1 comments
  •  తేనెపట్టు లోని తేనెటీగలు బయటకు వచ్చి ఝుంకారనాదాన్ని  వినిపిస్తాయి.
  • పావురాలు దారితెన్నూ లేకుండా తిరుగుతూ అలజడి సృష్టిస్తాయి.
  • కొన్ని జంతువులు ఆహారం కోసం బయటకు రాకుండా లోపలే ఉండిపోతాయి.
  • కుక్కలు చెవులు రిక్కిరించి భయం తో తుఫాను దిశగా చూస్తాయి.
  • అరణ్యము లోని ఏనుగులు గుంపులు గుంపులు గా నిర్దిశ లో పరిగెడతాయి.
  • కొన్ని జంతువులు ఉపద్రవాలను ముందుగానే పసిగట్టి వాటి స్వభావానికి విరుద్ధముగా అరుస్తాయి.

ఆంజనేయస్వామి కి పెళ్లి అయ్యిందా?

1 comments
ఆంజనేయుడు నిత్య బ్రహ్మచారి అనే విషయం మనకు తెలిసినదే. కానీ ఆయన సూర్యుని వద్ద సకల శాస్త్రాలు నేర్చుకునేటపుడు, వివాహితులు మాత్రమే నేర్చుకోవలసిన కొన్ని శాస్త్రాలను నేర్చుకోవడానికి వీలుగా, ఆంజనేయుడు సూర్యుని కుమార్తె అయిన సువర్చల ను వివాహమాడాడని, అయినను ఆయన బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లకుండా సూర్యభగవానుడు  ఆయనకు వరం ఇచ్చాడని చెప్తారు. ఇది నిజమా లేక పుక్కుటి పురాణమా అనేది తెలియదు. ఏది ఏమైనను మన ఆంజనేయుడు నిత్య నూతన బ్రహ్మచారి, సర్వదా పూజనీయుడు

అత్యాశ

0 comments
ఒకానొక పట్టణము లో ఒక బిక్షగాడు ఉండేవాడు. వాడికి చాలా కొద్ది మొత్తములో సాగు భూమి ఉన్నది. దాని మీద ఏమీ ఆదాయం లేక యాచన చేసుకుంటూ, ఆ వచ్చిన దానిని తిని బతుకుతుండేవాడు.

వాడికి ఒక రోజూ ఒక ఇంటిలో మంచి ఆహారం దొరికినది. వాడు ఆహారాన్ని ఆ ఇంటివద్దే కడుపునిండా భుజించాడు. కడుపు నిండడం తో ఆ రోజుకి యాచన చలించి ఇంటి దారి పట్టాడు. దారిలో ఒక గృహస్థుడు వానికి కొద్దిగా పేలపిండి ఇచ్చినాడు. వానికి ఆకలి తీరి ఉండటం తో దానిని భుజింపక తనతో తీసుకుని ఇంటిదారి పట్టాడు. దారిలో ఒక చెట్టు నీడలో విశ్రమింపదలచి, తన చెంత ఉన్న ఒక గుడ్డను చెట్టు కింద పరచి, తన మేను వాల్చి, తనలో తాను ఈ విధంగా ఊహించుకోసాగాడు

"ఇపుడు నా కడుపు నిండినది కనుక ఈ పేలపిండిని సంతలో అమ్మి ఆ వచ్చిన కొద్ది మొత్తము తో కొద్దిగా నువ్వులు కొని నా భూమిలో చల్లుతాను. కొంతకాలము తరువాత అవి మంచి కాపుకు వస్తాయి. వాటిని అమ్మి ఆ వచ్చిన మొత్తము తో వడ్డీ వ్యాపారము చేసి బాగుగా సంపాదిస్తాను. అప్పటికి నాకు వివాహ వయసు కూడా వస్తుంది. బాగా  డబ్బు సంపాదిస్తాను కనుక నాకు పిల్లను ఇవ్వడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. అందునుండి ఒక మంచి అమ్మాయిని ఎన్నుకుని వివాహం చేసుకుంటాను. ఎపుడైనా నా భార్య నా మాట విననిచో నేను ఊరుకోను, నా కాలితో గట్టిగా ఇలా తన్నుతాను"

అని అసంకల్పితంగా తన కాలితో పేల పిండిని తన్నాడు. అది కాస్త కింద పడి గాలికి మొత్తం ఎగిరిపోయింది. ఏదో జరుగుతుంది అని ఏదో ఏదో ఊహించుకుంటూ వాడి అత్యాశకు వాడే బలి అయ్యాడు.

మానేసి రెండేళ్లయ్యింది

3 comments
తండ్రి: బాబూ! నీకు ఈ రోజు కి 16 ఏళ్ళు వచ్చాయి. సిగరెట్, మందు, గుట్కా వగైరా అలవాటు అయ్యేవి ఈ వయసులోనే, కొంచెం జాగ్రత్త!

కొడుకు: నువ్వేమీ కంగారుపడకు నాన్నా! అవన్నీ మానేసి 2 సంవత్సరాలు అయ్యింది.

తండ్రి: ???????????? 
Copyright © ఆకాశ గంగ