పురాతన కాలంలో మరణదండన పలు రకాలుగా వుండేది. వాటితో అత్యంత భయానకంగా హింసించి మరణ శిక్షను విధించేవారు. వాటిలో అతి కిరాతకమైన శిక్షలు ఏమిటో మీకు తెలుసా..?
- Original from: http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/59211-world-s-top-ten-brutal-execution-of-the-ancient-world.html
1. శిలువ: నేరానికి, రాజధ్రోహానికి పాల్పడిన నేరస్తుడిని భారీ చెక్క శిలువపై పడుకోబెట్టి ఇరు వైపులా చేతులకు పెద్ద మేకులు బిగించి, కాళ్ళు రెండు ఒకదానిపై మరొకటి అమర్చి పాదాల వద్ద మరో మేకును బిగించి నిర్మానుష్య ప్రాంతంలో పాతిపెడతారు. దీంతో ఆ భాదను భరించలేని మనిషి తన ప్రాణం ఎప్పడు పోతుందా అంటూ వేచి చూడాల్సిన పరిస్థతి ఏర్పడుతుంది. తీవ్ర రక్తస్రావంతో నేరస్థులు మరణాన్ని ఆహ్వానిస్తారు. ఇక మరికొన్ని ఘటనల్లో నేరస్థులు బతికుండగానే రాబంధులు వారిని పీక్కుతింటుంటాయి. క్రీస్తుపూర్వం నుంచి వస్తున్న ఈ శిక్షనే కరుణామయుడు ఏసుక్రీస్తుకు విధించారు.
2.పదునైన వస్తువును గుచ్చడం: ఇది మరో రకంగా మనుషులను హింసించి వారు అరవకుండా ప్రాణాలను తీయడమే. కాళ్లు, చేతులు కట్టేసి నేరస్థులను గుంజానికి కట్టి కూర్చోబెడతారు. ఆ తరువాత వారి నోట్లో పదునైన పొడవాటి ఆయుధాన్ని గుచ్చుతారు. తద్వారా నేరస్థుడు తన భాధను కూడా వెళ్లగక్కకుండా నోటి నుంచి శరీరంలోకి పదునైన వస్తువు దిగబడుతుంది. దీంతో క్రమంగా నోప్పిని భరించలేక నేరస్థుడు ప్రాణాలను కోల్పోతాడు. మనుషులను పదునైన వస్తువులతో పొడిచి అలానే వదిలేస్తారు. దీంతో మనుషులు నోప్పితో పాటు రక్తస్రావం జరిగి ప్రాణాలను కోల్పోతారు.
3. బ్రేకింగ్ వీల్: ఇప్పటికే పలు గ్రామాల్లో కనిపించే బండి చక్రం మాదిరిగానే ఇంకొంచెం పెద్ద పరిమాణంలో వున్న చక్రానికి నేరస్థుల చేతులు కాళ్లు కట్టి వారిని మెల్లిగా తిప్పుతారు. ఈ క్రమంగా వారు తిరుగుతున్న సమయంలోనే వారి కాళ్లను ముక్కలు ముక్కలుగా నరుకుతారు. దీంతో నేరస్తుడు చిత్ర హింసను అనుభవిస్తూ మరణిస్తాడు.
4. కట్టేసి నాలుగు వైపులా లాగటం: నేరస్థులను గుర్రానికి కట్టి, శిక్షను అమలు చేసే ప్రాంతానికి ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. అప్పటికే మరణం అంచుల్లోకి వెళ్లిన నేరస్తుడిని ఒక బల్లపై పడుకోబెట్టి నాలుగు వైపులా నాలుగు గుర్రాలతో కాళ్లు, చేతులు కట్టి లాగుతారు. అ తరువాత నడుము బాగంలో పెద్ద కత్తితో నేరస్థుడి శరీరాన్ని భాగాలుగా నరుకుతారు.
5. ఏనుగులతో తొక్కించడం: నేరస్థుడి తలను ఒక రాయికి లేదా కొంత ఎత్తైన ప్రాంతంలో పెట్టించి తలను బిర్రుగా కడతారు. ఆ తరువాత ఏనుగును తీసుకు వచ్చి శిరముపై తొక్కిస్తారు. దీంతో నేరస్తుడి తలకు బలమైన గాయమై, రక్తస్రావంతో మరణిస్తాడు
6. రాక్ : నేరస్థుడిని అర్ర లాంటి చట్రములో బంధించి నెమ్మదిగా చట్రాన్ని తిప్పుతారు. క్రమంగా అతని కాళ్లు కిందకు రావడం అవి ముక్కలవ్వడంతో నేరస్థుడు మరణిస్తాడు.
7. అంగాలఛ్చేధనం: నేరస్తుల కాళ్లను చేతులను కట్టిసి కడుపులో కత్తితో కొసి ఒక్కొక్క అంగాన్ని శరీరం నుంచి బయటకు తీసి పడేస్తారు. పొట్ట పైబాగంలో కోయడంతోనే భాధను భరించలేని నేరస్థుడు విలవిలలాడుతాడు. ఆ తరువాత పొట్టలోనుంచి అంగాలన్నింటినీ వేరుగా తీసేస్తారు. అప్పటికి నేరస్థుడు సజీవంగా వున్నా, మరణించినా పట్టించుకోకుండా అంగాలను వేరు చేస్తారు. దీంతో నేరస్థులు మరణిస్తారు.
8. ఇత్తడి ఎద్దు : నేరస్తులను ఇత్తడితో చేసిన ఎద్దులో పడుకోబెట్టి చేతులు కాళ్లు, నడుము కట్టివేస్తారు. ఆ తరువాత పైబాగాన్ని మూసివేసి కింద మంట పెడతారు. మంటను క్రమంగా పెంచుతూ పోతారు. ఇత్తడి ఎద్దు పసుపు వర్ణం నుంచి బంగారు వర్ణం చేరుకునే వరకు మంటలను అలా పెంచుతారు. మంట వేడికి తాళలేక నేరస్థుడు ఎద్దు తరహాలో అరచి అరచి మరణానికి చేరువై ప్రాణాలను కోల్పోతాడు.
8. ఇత్తడి ఎద్దు : నేరస్తులను ఇత్తడితో చేసిన ఎద్దులో పడుకోబెట్టి చేతులు కాళ్లు, నడుము కట్టివేస్తారు. ఆ తరువాత పైబాగాన్ని మూసివేసి కింద మంట పెడతారు. మంటను క్రమంగా పెంచుతూ పోతారు. ఇత్తడి ఎద్దు పసుపు వర్ణం నుంచి బంగారు వర్ణం చేరుకునే వరకు మంటలను అలా పెంచుతారు. మంట వేడికి తాళలేక నేరస్థుడు ఎద్దు తరహాలో అరచి అరచి మరణానికి చేరువై ప్రాణాలను కోల్పోతాడు.
9. చర్మాన్ని ఒలచడం: నిందితుడిని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి చెట్లుకో, లేదా ఒక లావుపాటి దిమ్మెలకో కడతారు. అతడు ప్రాణాలతో వుండగానే అతని చర్మాన్ని, చేతుల నుండి ప్రారంభించి ఒలవడం ప్రారంభిస్తారు. నేరస్థుడు మరింత బాధకు లోను కావడానికి ఉప్పు, కారం వంటి వస్తువులను అతని ఒలచిన చర్మంపై చల్లుతారు. అలా శరీరం మొత్తం నుండి చర్మాన్ని ఒలచి దేహాన్ని మరణానికి వదిలేస్తారు. తీవ్ర రక్తస్రావంతో నేరస్థుడు మరణిస్తాడు.
10 రంపపు కోత: ఈ శిక్షలో నేరస్థుడిని తలక్రిందులుగా వేలాడదీస్తారు. ఆ తరువాత అతన్ని, రెండు కాళ్ల నడుమ మర్మాంగం వద్ద నుండి రంపంతో కోస్తారు. ఇలా ఒక కాలును శరీరం నుండి వేరు చేస్తారు. దీంతో నేరస్తుడు మరణిస్తాడు. ఇంత దారుణమైన శిక్షలు పురాతన కాలంలో రాజుల హయాం లో వుండేవి.
1 comments:
ఈ శిక్షలు ఇప్పటకి ఉన్నాయి .
పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ , ఇరాక్ లలో రాతియుగం నాటి మనుషులు ఇప్పటకి ఉన్నారు , అక్కడ ఇటువంటి శిక్షలు ఇప్పటకి ఉన్నాయి .
మనకి క్రూరంగా అనిపించొచ్చు కాని వాళ్లకి ఇది మామూలే.
Post a Comment