‘నేను ప్యాసింజర్ రైల్లో అహ్మెద్‌పూర్ రైల్వే స్టేషన్‌కు వచ్చాను. కడుపు విపరీతమైన ఉబ్బరంగా ఉంది. రైలు దిగాను. స్టేషన్లో ఓ లోటలో నీల్లు పట్టుకున్నాను. రైలు పట్టాలకు దూరంగా పరిగెత్తాను. కడుపు భారాన్ని దించుకుంటున్నాను. ఇంతలో రైల్వే గార్డు పచ్చ జెండా ఊపాడు. నేను వెనక నుంచి మొత్తుకుంటూ ఒక చేతిలో లోట, మరో చేతిలో దోవతి పట్టుకొని పరుగెత్తుకొస్తున్నాను. కాళ్లకు దోవతి అడ్డంపడి ఊడిపోయింది. స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ మీదున్న మహిళలు, పురుషులు అందరి ముందు నా మానం పోయింది. నా కోసం ఐదు నిమిషాలు రైలు ఆపని గార్డుకు ప్రజల తరఫున భారీ జరిమానా విధించాలని ప్రార్థిస్తున్నాను. అలా చేయని పక్షంలో పత్రికలకు నివేదిస్తా’ అని ఓఖిల్ చంద్ర సేన్ అనే ప్రయాణికుడు 1909లో జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఫ్రేమ్ కట్టిన ఈ ఫిర్యాదు లేఖ ఢిల్లీ రైల్వే మ్యూజియంలో నేటికి కనిపిస్తుంది.
ఈ లేఖనే రైల్వే బోగీల్లో మరుగుదొడ్లు నిర్మించాలనే ఆలోచనకు నాంది పలికింది.
ఈ లేఖనే రైల్వే బోగీల్లో మరుగుదొడ్లు నిర్మించాలనే ఆలోచనకు నాంది పలికింది.