చంద్రుని కుమారుడు బుధుడు!

నారాయణుని నాభినుంచి పుట్టిన బ్రహ్మకు పుత్రుడు అత్రిమహర్షి. వీరి కుమారుడే చంద్రుడు. ఇతడు తనకున్న ఆధిపత్యం చేత, చక్కదనం చేత దేవగురువు బృహస్పతి భార్య అయిన తారను చెరబట్టాడు. దేవతలు వెంటరాగా ఇంద్రుడు చంద్రునిపైకి యుద్ధానికి వెళ్ళాడు. దానవులు చంద్రునికి సహాయం చేయడంతో దేవతలు వెనుదిరగక తప్పలేదు. శివుని  ప్రమేయంతో తార తిరిగి బృహస్పతి ఇంట చేరింది. అప్పటికే ఆమె గర్భవతి.

అతడు బృహస్పతికి పుట్టినవాడో - చంద్రునికి పుట్టినవాడో తెలుసుకోగోరిన దేవతలు, బ్రహ్మ సహాయంతో ఆమె చేత నిజం పలికించారు. అతడు చంద్రునికి పుట్టినవాడే అని రూఢి అయింది. చంద్రుడాతనికి బుధుడని పేరు పెట్టాడు.

1 comments:

indhu said...

mari chandrudu kshirasagaram chilikinapudu puttaru antaru kada

Post a Comment

Copyright © ఆకాశ గంగ