గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లో ఓ దొంగ కోతి సంచలనం రేపింది. అక్కడి జువెల్లరీ షాప్ లో కి ఎంటరైన ఈ వానరం చాకచక్యంగా షాపు క్యాష్ బాక్స్ లోని 10 వేల నోట్ల కట్టను దొంగిలించి పరారైంది. మొదట అది షాపులోకి రావడాన్ని గమనించిన సిబ్బందిలో ఒకరు దాన్ని అదిలించడానికి ప్రయత్నించినా అది బెదరలేదు. సుమారు 20 నిముషాలు అక్కడే గడిపింది.
సమయం చూసుకుని క్యాష్ బాక్సున్న రూమ్ లోకి ప్రవేశించి బాక్సులోని సొమ్ములో 10 వేల నోట్ల కట్ట తీసుకుని ఉడాయించింది. షాపు ఓనర్ దాన్ని బెదిరించి డబ్బు స్వాధీనం చేసుకోవడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. షాపు సిబ్బంది ఇదంతా చూస్తూ షాక్ తినడం తప్ప మరేమీ చేయలేకపోయారు. ఈ దొంగ కోతి యవ్వారం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. కొందరు దొంగలు... కోతులను పెంచి ఇలా దొంగతనాల్లో ట్రైనింగ్ ఇస్తారట.

0 comments:
Post a Comment