దొంగ మొగుడిని పట్టించిన ఆధార్!

తన భార్యకు తెలియకుండా, ఇంకో యువతిని వివాహం చేసుకుని, ఇద్దరితోనూ కాపురం చేస్తున్న దొంగమొగుడి వ్యవహారం ఆధార్ పుణ్యమాని బట్టబయలైన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ములకలచెరువుకు చెందిన ఓ యువతి రేషన్ కోసం వెళ్లగా, ఐదు కిలోల బియ్యం తగ్గాయి. ఈ పాస్ లో తన భర్త పేరు కనిపించక పోవడంతో కోటా తగ్గింది. పేరుంటేనే బియ్యం ఇస్తానని డీలర్ చెబుతుండటంతో, భర్త ఆధార్ నంబరును ఇంటర్నెట్ కేంద్రంలో ఇచ్చి పరిశీలించగా, అతను ఇంకో యువతి పేరిట ఉన్న రేషన్ కార్డులో నమోదైనట్టు తెలిసింది. ఒకే ఆధార్ సంఖ్య రెండు రేషన్ కార్డుల్లో ఉండకూడదు కాబట్టి మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. డబ్బు సంపాదన కోసం బెంగళూరు వెళ్తానని చెబుతూ, రెండో పెళ్లి చేసుకున్నాడని ఆ యువతి బావురుమంది. ములకలచెరువుతో పాటు దుగ్గసానిపల్లె తదితర గ్రామాల్లోనూ ఇలా రెండు సంసారాల ఉదంతాలు ఆధార్ అనుసంధానంతో బయటపడ్డాయి.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ