దాదాపు 20ఏళ్ల యువతి 50 అంతస్తులున్న భారీ భవంతి నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. కంబోడియాలో జరిగిన ఈ దారుణం సంచలనం సృష్టించింది. ఈ షాకింగ్ సూసైడ్ వీడియో సెన్సేషన్ అయ్యింది.
దొంగ కోతి 10 వేలు ఎత్తుకెళ్ళింది
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లో ఓ దొంగ కోతి సంచలనం రేపింది. అక్కడి జువెల్లరీ షాప్ లో కి ఎంటరైన ఈ వానరం చాకచక్యంగా షాపు క్యాష్ బాక్స్ లోని 10 వేల నోట్ల కట్టను దొంగిలించి పరారైంది. మొదట అది షాపులోకి రావడాన్ని గమనించిన సిబ్బందిలో ఒకరు దాన్ని అదిలించడానికి ప్రయత్నించినా అది బెదరలేదు. సుమారు 20 నిముషాలు అక్కడే గడిపింది.
సమయం చూసుకుని క్యాష్ బాక్సున్న రూమ్ లోకి ప్రవేశించి బాక్సులోని సొమ్ములో 10 వేల నోట్ల కట్ట తీసుకుని ఉడాయించింది. షాపు ఓనర్ దాన్ని బెదిరించి డబ్బు స్వాధీనం చేసుకోవడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. షాపు సిబ్బంది ఇదంతా చూస్తూ షాక్ తినడం తప్ప మరేమీ చేయలేకపోయారు. ఈ దొంగ కోతి యవ్వారం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. కొందరు దొంగలు... కోతులను పెంచి ఇలా దొంగతనాల్లో ట్రైనింగ్ ఇస్తారట.

మైదానంలో స్ట్రేంజ్ గెస్ట్
విశాలమైన పచ్చిక మైదానంలో అనుకోని అతిథి ఎంటరయింది. నింపాదిగా నడచుకుంటూ వెళ్ళింది. భారీ డైనొసార్ లా ఉన్న ఆ జీవిని చూసిన ఓ వ్యక్తి బెదరలేదు. తన కెమెరాలో దాన్ని బంధించాడు.
ఎక్కడినుంచి వచ్చిందో.. అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని గోల్ఫ్ కోర్స్ మైదానంలో ఓ పెద్ద మొసలి ప్రవేశించి హల్ చల్ చేసింది. ఆ గ్రౌండ్స్ లో అప్పుడు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ మొసలి వైనాన్ని ఆ పెద్దమనిషి వీడియోకెక్కించి వదిలాడు.

మృగరాజును వెంటపడి మరీ తరమింది..
అడవికి ఓ న్యాయం ఉంటుంది. ఆ న్యాయం ప్రకారం అడవికి రాజు సింహం. దానిని చూసి అన్నీ జంతువులు భయపడాల్సిందే. ఎదైనా జంతువు ఎదురుతిరిగి నువ్వెంత అని కొమ్ములు ఎగరేస్తే.. సింహం తన పంజా విసురుతుంది. ఎదురుగా జంతువు కనిపిస్తేనే దానికి ఆహారంగా మారిపోతుంది. అలాంటిది ఎదురుతిరిగితే బతికి బయటపడగలదా? కానీ ఇక్కడ మాత్రం ఆటవిక న్యాయం తిరగబడింది.
బర్రె (గెదే)ను చూసి ఆడ సింహం ఒకటి భయపడింది. గెదే మీదకు ఉరికొస్తుంటే.. సింహం బెదిరి పోరిపోయింది. ఆ సింహాన్ని వెంటాడి మరీ గెదే తరిమేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని గిర్ అడవిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన నాటకీయ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.

తణుకులో చేపల వాన... పట్టుకునేందుకు పోటీపడ్డ ప్రజలు!
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపల వాన కురిసింది. దీంతో చేపలను పట్టుకునేందుకు అక్కడి ప్రజలు పోటీ పడ్డారు. తణుకు జాతీయ రహదారి వెంబడి వర్షంతో పాటు చేపలు కూడా కురిశాయి. దీంతో, ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది. కాగా, గత ఏడాది కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని గోళ్లమూడి, పల్లగిరి గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూముల్లో ఆకాశంలో నుంచి చేపలు, కప్పలు రాలిబడ్డాయి.
దొంగ మొగుడిని పట్టించిన ఆధార్!
తన భార్యకు తెలియకుండా, ఇంకో యువతిని వివాహం చేసుకుని, ఇద్దరితోనూ కాపురం చేస్తున్న దొంగమొగుడి వ్యవహారం ఆధార్ పుణ్యమాని బట్టబయలైన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ములకలచెరువుకు చెందిన ఓ యువతి రేషన్ కోసం వెళ్లగా, ఐదు కిలోల బియ్యం తగ్గాయి. ఈ పాస్ లో తన భర్త పేరు కనిపించక పోవడంతో కోటా తగ్గింది. పేరుంటేనే బియ్యం ఇస్తానని డీలర్ చెబుతుండటంతో, భర్త ఆధార్ నంబరును ఇంటర్నెట్ కేంద్రంలో ఇచ్చి పరిశీలించగా, అతను ఇంకో యువతి పేరిట ఉన్న రేషన్ కార్డులో నమోదైనట్టు తెలిసింది. ఒకే ఆధార్ సంఖ్య రెండు రేషన్ కార్డుల్లో ఉండకూడదు కాబట్టి మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. డబ్బు సంపాదన కోసం బెంగళూరు వెళ్తానని చెబుతూ, రెండో పెళ్లి చేసుకున్నాడని ఆ యువతి బావురుమంది. ములకలచెరువుతో పాటు దుగ్గసానిపల్లె తదితర గ్రామాల్లోనూ ఇలా రెండు సంసారాల ఉదంతాలు ఆధార్ అనుసంధానంతో బయటపడ్డాయి.
విశ్వాసమంటే ఇదే... నిద్రిస్తున్న యజమానిని రక్షించేందుకు పులితో పోరాడి ప్రాణాలు వదిలిన శునకరాజం
తాను నమ్మిన యజమాని ప్రాణాలను కాపాడేందుకు ఆ శునకం ఓ పులితో పోరాడి ప్రాణాలను వదిలింది. ఈ ఘటన షాజహాన్ పూర్ సమీపంలోని దుడ్వా జాతీయ పార్కును ఆనుకుని ఉన్న గ్రామంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బర్బత్ పూర్ గ్రామంలోని రైతు గురుదేవ సింగ్, జాకీ అనే శునకాన్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. తన ఇంటి బయట గురుదేవ్ నిద్రిస్తుండగా, పక్కనే ఉన్న అడవిలో నుంచి ఓ పెద్దపులి వచ్చింది. పెద్దపులిని పసిగట్టిన శునకం పెద్దగా అరుస్తూ, తన యజమానికి ముంచుకొచ్చిన ప్రమాదాన్ని తెలియజేస్తూ, దానిపై కలబడింది. గురుదేవ్ లేచి సహాయం కోసం ఇతరులను పిలిచేలోగా, పులి పంజా దెబ్బలకు ఆ శునకం తీవ్రంగా గాయపడగా, దాన్ని ఆ పులి అడవుల్లోకి లాక్కెళ్లింది. గురుదేవ్ కుటుంబం, గ్రామస్తులు శునకం కోసం వెతుకులాడగా, కొంతదూరంగా దాని మృతదేహం కనిపించింది. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిపిన గురుదేవ్, శునకం విశ్వాసాన్ని తలచుకుంటూ, దాని అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు. జాకీ ఓ వీధి శునకమని, నాలుగేళ్ల క్రితం చిన్న పిల్లగా ఉన్నప్పుడు తన పిల్లలు ఇంటి తేగా, ఇంట్లోని మనిషిలా కలిసిపోయిందని గురుదేవ్ తెలిపారు.
రైళ్లలో టాయ్‌లెట్లు ఎట్లా వచ్చాయంటే..
‘నేను ప్యాసింజర్ రైల్లో అహ్మెద్‌పూర్ రైల్వే స్టేషన్‌కు వచ్చాను. కడుపు విపరీతమైన ఉబ్బరంగా ఉంది. రైలు దిగాను. స్టేషన్లో ఓ లోటలో నీల్లు పట్టుకున్నాను. రైలు పట్టాలకు దూరంగా పరిగెత్తాను. కడుపు భారాన్ని దించుకుంటున్నాను. ఇంతలో రైల్వే గార్డు పచ్చ జెండా ఊపాడు. నేను వెనక నుంచి మొత్తుకుంటూ ఒక చేతిలో లోట, మరో చేతిలో దోవతి పట్టుకొని పరుగెత్తుకొస్తున్నాను. కాళ్లకు దోవతి అడ్డంపడి ఊడిపోయింది. స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ మీదున్న మహిళలు, పురుషులు అందరి ముందు నా మానం పోయింది. నా కోసం ఐదు నిమిషాలు రైలు ఆపని గార్డుకు ప్రజల తరఫున భారీ జరిమానా విధించాలని ప్రార్థిస్తున్నాను. అలా చేయని పక్షంలో పత్రికలకు నివేదిస్తా’ అని ఓఖిల్ చంద్ర సేన్ అనే ప్రయాణికుడు 1909లో జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఫ్రేమ్ కట్టిన ఈ ఫిర్యాదు లేఖ ఢిల్లీ రైల్వే మ్యూజియంలో నేటికి కనిపిస్తుంది.
ఈ లేఖనే రైల్వే బోగీల్లో మరుగుదొడ్లు నిర్మించాలనే ఆలోచనకు నాంది పలికింది.
ఈ లేఖనే రైల్వే బోగీల్లో మరుగుదొడ్లు నిర్మించాలనే ఆలోచనకు నాంది పలికింది.
వరుసకు అన్నాచెల్లెళ్లు.. కానీ ప్రేమించుకున్నారు
కొన్ని సందర్భాల్లో చోటు చేసుకునే సంఘటనలు చాలాచిత్రంగా అనిపిస్తాయి. సాధ్యమా అనిపించేలా ఉన్న ఇలాంటి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. వరుసకు అన్నా చెల్లెళ్లు అయ్యే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇంకేదైనా ఫర్లేదుకానీ.. చూస్తూ.. చూస్తూ ఇలాంటివి ఎలా ఒప్పుకుంటామని పిల్ల.. పిల్లాడి తల్లిదండ్రులు గట్టిగా చెప్పటం.. తాను కోరుకున్న ప్రేమ లభించకపోవటంతో సదరు యువతి ఆత్మహత్యాయత్నం చేయటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. కాస్త చిత్రంగా.. మరికాస్త ఇబ్బందిగా అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..
శ్రీకాకుళం జిల్లా సంతకవిటికి చెందిన 20 ఏళ్ల యువతి అదే గ్రామానికి చెందిన పెద్దనాన్న కొడుకు ప్రేమలో పడింది. కుర్రాడి తల్లిదండ్రులు విజయనగరంలో ఉంటున్నారు. యువతి అప్పుడప్పుడు పెద్దనాన్న ఇంటికి వచ్చిన క్రమంలో వారి మధ్య ప్రేమ మొదలైంది. దీంతో.. ఇద్దరూ కలిసి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ విషయంపై ఇరు వర్గాల పెద్దలకు తెలిసి.. తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సదరు యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపారు. వీరి వ్యవహారం ఇరు వర్గాల పెద్దల మధ్య గొడవలకు కారణమైంది. యువతికి తల్లిదండ్రులు ఎంతగా నచ్చజెప్పినా ఆమె ససేమిరా అనటంతో ఈ వ్యవహారాన్నిఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
మరోవైపు.. ఈ ఉదంతం గురించి తెలిసిన పోలీసులు సదరు యువతి వాంగ్మూలం తీసుకున్నారు. వరుసకు ఇద్దరూ అన్నాచెల్లెళ్లు కావటంతో కేసు నమోదు చేయకుండా.. కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు.

Subscribe to:
Posts (Atom)