పంట చేలో పాల కంకి నవ్విందీ.... 

చిత్రం: పదహారేళ్ళ వయసు (1978)
నటీనటులు: చంద్రమోహన్, శ్రీదేవి

పల్లవి:
పంట చేలో పాల కంకి నవ్విందీ..పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ..
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా.. లేత పచ్చ కోన సీమా ఎండల్లా
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...

పంట చేలో పాల కంకి నవ్విందీ..పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ..
 చరణం 1:
శివగంగ తిరణాలలో.. నెలవంక తానాలు చేయాలా...
చిలకమ్మ పిడికిళ్ళతో.. గొరవంక గుడిగంట కొట్టాలా..
నువ్వు కంటి సైగ చెయ్యాలా... నే కొండ పిండి కొట్టాలా...
మల్లినవ్వే మల్లె పువ్వు కావాలా
మల్లినవ్వే మల్లె పువ్వు కావాలా
ఆ నవ్వుకే ఈ నాప చేను పండాలా...

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...

పంట చేలో పాల కంకి నవ్విందీ..పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ..
చరణం 2:
గోదారి పరవళ్ళలో.. మా పైరు బంగారు పండాలా...
ఈ కుప్ప నూర్పిళ్ళతో.. మా ఇళ్ళు వాకిళ్ళు నిండాలా..
నీ మాట బాట కావాలా.. నా పాట ఊరు దాటాలా...
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా
ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...

పంట చేలో పాల కంకి నవ్విందీ... అహహ అహహ
పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ... అహహ అహహ
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా... అహహ అహహ
లేత పచ్చ కోన సీమా ఎండల్లా... అహహహ అహహహ

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే...

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ