కార్తీక మాసం

చంద్రుడు భూష్టుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి ఉంటుంది. కృత్రిక నక్షత్రంలో చంద్రుడు పూజ్యుడై సంచరిండం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చిందని పురాణ గాధలు చెబుతుంటాయి. విష్ణుదేవుడి కంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రాలు, గంగ కంటే పుణ్యప్రదములైన తీర్థములు లేవన్నది పురాణ గాధలు వినిపిస్తున్నాయి. కార్తీక మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం. దేశం నలుమూలల ఉన్న శివాలయాల్లో ఈ మాసంలో రుద్రాభిషేకాలు, రుద్రపూజలు, లక్ష బిల్వార్చనలు చేయడం ఆనవాయితీగా వస్తున్నదే. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభిష్టాలను తీరుస్తాడని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆ పరమేశ్వరుడికి ఆశశోషుడు అనే నామకరణం వచ్చిందని వేద పండితులు చెబుతున్నారు. 

అలంకారాలతో, రాజ భోగాలతో నైవేద్యాలతో పని లేదు. మనస్సులో భక్తిని ఉంచుకొని ఆ పరమేశ్వరుడిని ధ్యానిస్తూ ఉంటే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పొగొట్టి సకల శుభాలను కలుగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసే వారికి గ్రహ దోషాలు, ఇతి బాధలు ఉండవు. శివుడ్ని బిల్వ తలాలతో పూజిస్తే స్వర్గమున లక్ష సంవత్సరాలు జీవిస్తారని నమ్మకం. త్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏక కాలంలో రెండు రూపాలను ప్రదర్శిస్తాడు. ఎడమ భాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడిగా దర్శనం ఇచ్చే సమయమే త్రదోష కాలమని పురణాల్లో చెప్పబడింది. సదోష కాలంలో శివరాధన, శివదర్శనం చేసుకుంటే శివుడి అనుగ్రహం పొందగలరు. అష్టోత్తర, లింగార్చన, మహాలింగార్చన, సహస్త్ర లింగార్చనలు ఈ మాసంలో అర్చనలు చేస్తే సంవత్పరం మొత్తం ఫలాన్ని ఇస్తాయి. కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వం నది స్నానం చేయడం అత్యంత ఫలప్రదం. కార్తీక నది స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. 

నది జలాశయంలో, కొండలల్లోనూ, కోనల్లోనూ, చెట్టు, పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమాలికల రసం నది జలాశయాల్లో కలుస్తుంది. ఈ మాసంలో ముఖ్యంగా మహిళలు వేకుజామున స్నానం చేసి, తులసి దీపారాధన చేసి గౌరీ దేవిని పూజిస్తే ఈశ్వర అనుగ్రహంతో సౌభాగ్యాన్ని సకల శుభాలను పొందుతారు. కార్తీక మాసం మొదలు నుంచే ఆకాశ దీపం ప్రారంభం అవుతుంది. ఉభయ సందెలల్లో గృహం నందు పూజా మందిరంలో తులసి సన్నిధిలోనూ, శివాలయాల్లోనూ దీపారాధన చేస్తే సకల సౌభాగ్యాలను కలుగచేస్తుందని, అం దుకే ఈ మాసం దీపారాధనకే ప్రశస్థ్యం. దీపదానం ముందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి లోనే మద్యమం. కార్తీక మాసంలో సాయంకాలం శివ, విష్ణు ఆలయాల్లో దీపం వెలిగించాలి, విష్ణోస్త్రోత్రాన్ని గానీ, శివ స్త్రోత్రాన్ని చదవాలి. 

ఈ విధంగా కార్తీక మాసంలో భక్తి పరంగా స్నానం ఆచరిస్తే వారికి మరుజన్మ లేదని, మోక్షం లభిస్తుందని మునుల వాక్కు. ఈ జన్మలో మాత్రమే కాకుండా పూర్వపు జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. బ్రహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, సూద్రులు, స్త్రీలు, పురుషులు అందరూ కార్తీక మాసం వ్రతాన్ని ఆచరించవచ్చు. కార్తీక మాసం వ్రతాన్ని ఆచరించినా, వాటిని చూసినట్లు అయితే ఆ దినం చేసిన పాపాలు తొలగిపోతాయి. కార్తీక వ్రతాన్ని చేపట్టిన వారికి పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వలోక వాసులు అవుతారని న మ్మకం. ఈ మాసంలో కావేరి నదిలో స్నానం ఆచరిస్తే పుణ్యఫలాలు లభిస్తాయి. దీపారాధన మహిమ కార్తీక మాసంలో భక్తిని చక్కగా తీసుకొని ఒత్తులు చేసి గోధుమపిండితో ప్రమీదలు చేసి దానిలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి రుషికి దానం చేయాలి ఇదే విధంగా నెలమొత్తం దానం ఇచ్చి నెలాఖరును వెండి ప్రమీదలలో బంగారు రంగుతో అంటే పసుపును ఉంచిన ఒత్తితో దీపం వెలిగించి దానిని బ్రహ్మణులకు దానం చేయాలి. 

కార్తీక మాసం సోమవారాలలో చేసే ఉపవాసాల వలన కడుపులో ఆహారం పూర్తిగా జీర్ణమై కడుపు శుభ్రపడుతుంది. శరీరంలోని జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరకడం వలన నవ చైతన్యం కలుగుతుంది. కార్తీకమాసం తో చలికాలం ప్రారంభమవుతుంది. మంచి వానలు పడి వాతావరణంలో తేమ పేరుకుని ఉంటుంది. మాంసాహారం తీసుకునే వారికి జీర్ణసంబంధమైన ఇబ్బందులు తల ఎత్తే కాలం ఇది. మాంసం జీర్ణం కావాలంటే వాతావరణంలో వేడి ఉండాలి. ఈ పూజలు, నోముల రోజుల్లో మాంసాహారం నిషిద్ధం కనుక ఉపవాసం చేసే వ్యక్తులకు ఆరోగ్యం చేకూరుతుంది .

ఉపవాస దీక్షల వలన మనోబలం నిశ్చయంగా చేకూరుతుంది. కార్తీకమాసం రోజుల్లో చేసే నదీ స్నానాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. కార్తీకమాసంలో ఊసిరి, తులసి మొక్కలకి ఎంతో ప్రాధాన్యం ఉంది. తులసి మొక్క ఆరోగ్య సంబంధమైన ఓషధీగుణాల నిధి. ఈ మొక్కని ఆరాధించడంలో సౌభాగ్యమే కాదు, ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే ఉసిరిక వృక్షం, ఉసిరి కాయలు ఆరోగ్యానికి సంబంధించి ఎంతో విశిష్టమైనవి. ధాత్రి అంటే ఉసిరిక. లక్ష్మీ దేవికి ఉసిరిక అంటే మహా ప్రీతి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరిక వృక్షం క్రింద ధాత్రీదేవి, దామోదరులు ప్రతిమని ఉంచి పూజ చేస్తారు. 

ఈ కార్తీకమాసంలో ఉసిరిక వృక్షాలకింద వనభోజనాలు చేయడం కూడా ఒక విధి. ఈ భోజనాలవలన సంఘ జీవనం, వ్యక్తుల మధ్య మానసిక అనుబంధాలు గట్టిపడడం వంటి మేలు జరుగుతుంది. కార్తీకమాసం- దీపారాధన కార్తీకమాసంలో దీపం వెలిగించడం, దీపాన్ని దానం చేయడం అనే అంశాలను కూడా ప్రత్యేకంగా చెప్పారు. నూనె, నిప్పు, వత్తి కలిస్తే దీపం అవుతుంది. మూడు విడివిడిగా ఉంటే మూడింటికి పరస్పరం విరోధమే. తైలానికి అగ్నితో, వత్తితో అలాగే అగ్నికి, వత్తికి కూడా విరోధం. మూడు కలిస్తేనే దాని ఉపయోగం. విడివిడిగా ఉంటే విరోధపడేవి మూడూ కలిసి ప్రమిదలో ఉన్నప్పుడు చుట్టూ ఎటు చూసినా కాంతిని నింపుతాయి. మనుషులలో ఉండే స్వభావాలకు ఆధారం వారిలోని గుణాలు. రాజస, సాత్విక, తాపన గుణాలు మనిషిలో ఉంటాయి. ప్రమిదలో వత్తి సత్వగుణానికి, నూనె తమోగుణానికి, మంట సత్వగుణానికి ప్రతీకలు. 

ఇవన్నీ ఒకటికొకటి సంపూర్ణంగా వ్యతిరేకమయిన గుణాలు. కాని మూడూ కలిస్తే కాంతి నిండుతుంది. ఒక మంచి వ్యక్తిగా, పూర్ణపురుషుడిగా రూపు దాల్చాలనుకునే వారు తమలోని తామస,రజోగుణాలని అణిచిపెట్టుకోవాలి. సత్త్వ గుణాన్ని పెంచుకోవాలి. ఉత్తమ సాంగత్యం వలన ఉన్నతమైన వ్యక్తిత్వం అలవడి సత్త్వ గుణం పెరుగుతుంది. దీపం అంటే జ్ఞానానికి ప్రతీక. దీపాలను బయట వెలిగించడమే కాదు హృదయాలలో వెలిగించుకోవాలి. తద్వారా వ్యక్తుల జీవితాల్లో జ్ఞానదీపాలు ప్రకాశవంతంగా వెలుగుతాయి. రాగద్వేషాలకు అతీతమైన స్వబావాన్ని పెంపు చేసుకుని సాత్వికులుగా మారిన వ్యక్తులు సమాజానికి కూడా ఆదర్శప్రాయులవుతారు. ఆరోగ్యవంతులైన ప్రజలతో కూడిన, ఒక ప్రేమపూరితమైన వాతావరణంతో సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా కార్తీకమాసంలో తెల్లవారుఝామున చేసే నదీ స్నానాలు, దీపారాధనలు, శివాలయాల్లో అభిషేకాలు, ఉపవాసాలు వంటి విధులన్నీ సమాజంలో ఒక ఆథ్యాత్మిక వాతావరణం ఏర్పరచి భక్తిభావాన్ని పెంపొందించి వ్యక్తుల సుఖజీవనానికి ఆలంబనను అందిస్తాయి.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ