తక్కువగా తినడానికి పాటించవలసిన చిట్కాలు

బరువుతగ్గాలనుకునే వారంతా తక్కువగా తింటే సరిపోతూంటుందని భావిస్తారు. మరి కొంతమంది అసలు తినకపోవటం అనే తప్పు కూడా చేస్తారు. బరువు తగ్గాలంటూ ద్రవాహారాలపైనే కొంతమంది జీవిస్తారు. ఇవన్నీ సరైనవే కాని అన్నీ తాత్కాలికమే. అసలు తనకపోయినా, శరీరానికి కావలసినదానికంటే తక్కువతిన్నా అనారోగ్యం కలుగుతుంది. మరి ఆరోగ్యకరంగా తినాలంటే ఒక రహస్యం తక్కువగా వేళకు తింటూండాలి. తగిన శ్రమ చేయాలి. రోజంతా ఆహారం ఎలా నియంత్రించాలి? అంటూ ఆలోచిస్తున్నారా? దిగువ చిట్కాలు పరిశీలించండి.

మీరు తినాలనుకునేవాటి జాబితా తయారు చేయండి. వారంకి సరిపడా ఏమేమి తినాలనేది నిర్ధారించుకోండి. దానిని ఆచరణలో పెట్టండి. ఇక అధికంగా తినటం జరగదు. మీరు వ్రాసిన జాబితాలో ఎంతా పరిమాణంలో ఆహారం తీసుకోవాలి అనేదానిని కూడా పేర్కొనండి. ఉదాహరణకు ఒక చిన్న కప్పు అన్నం, రెండు చపాతీలు మధ్యాహ్నం వేళ తినాలి అని నిర్ణయించండి.

ప్రణాళిక - వ్రాసిన ప్రణాళిక ఆచరణలో తప్పక పెట్టాలి. ఖచ్చితంగా మీ తక్కువ ఆహారం ప్రణాళిక ఆచరిస్తే బరువు తగ్గటం తేలికే. సరైన ఆహారం - సరైన ఆహారం ఎంచుకోండి అది మీ ఆకలిని గంటల తరబడి నియంత్రిస్తుంది. కడుపు నింపే ఆహారాలు అనేకం వున్నాయి. మీ ఆకలి తీరాలంటే కడుపు నింపేవే తినాలి. డార్క్ చాక్లెట్, బాదం పప్పులు, అరటి పండు వంటివి త్వరగా కడుపు నింపేస్తాయి. ద్రవాలు అధికం - ద్రవాహారాలు అధికంగా తాగండి. కడుపులో ఎపుడూ ద్రవాలు పూర్తిగా వుంటే అది మిమ్మల్ని ఘనాహారం తినకుండా చేస్తుంది. నీరు, పండ్లరసాలు, వెజిటబుల్ రసం వంటివి తాగాలి. ఇవి శరీరంనుండి మలినాలను విసర్జిస్తాయి. తక్కువ కొ్వ్వు, కేలరీలు వుండే వాటిని ఎంచుకోండి. మెల్లగా తినండి - తినటానికి అధిక సమయం కేటాయించి మెల్లగా తినాలి. వేగంగా తింటే, ఆహారం అధికంగా లోపలికిపోతుంది. నమిలితే దవడ కొవ్వు కరుగుతుంది. ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. కనుక మీ ఆహారాన్ని మెల్లగా తినటమనేది కూడా తక్కువ తినటంలో ఒక చిట్కా అని గ్రహించండి.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ