వినరో భాగ్యము విష్ణుకథ

ప : వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ
చ : ఆదినుండి సంధ్యాదివిధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీదివీధులనే విష్ణుకథ
చ : వదలక వేదవ్యాసులు నుడిగిన
విదితపావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ
చ : గొల్లెతలు చల్ల గొనకొని చిలుకఁగ
వెల్లవిరియాయ విష్ణుకథ
యిల్లిదె శ్రీవేంకటేశ్వరునామము
వెల్లిగొలిపె నీవిష్ణుకథ

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ