పసిపిల్లల దంతాలు ఎలా శుభ్రం చెయ్యాలి?

చిన్న పిల్లల్లో కూడా ఓరల్ హెల్త్ కేర్ చాలా అవసరం. పసిపిల్లల్లో పళ్ళు ఏర్పడటం మొదలు పెట్టగానే, తల్లులు ఎక్కువగా ఆలోచించరు. కానీ, పసిపిల్లల్లో 6 కంటే ఎక్కువ దంతాలు ఏర్పడినప్పుడు, బ్రషింగ్ చేయడాన్ని అలవాటుగా చేసుకోవాలి. పసిపిల్లల దంతాలు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఈ విషయంలో పసిపిల్లల వయస్సుతో పనిలేదు. కేవలం 6దంతాలకంటే ఎక్కువ మొదలవుతుంటే వెంటనే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. 

పసిపిల్లలు చాలా చిలిపిగా, పెరిగే కొద్దీ చాలా చురుకుగా, అల్లరిచేస్తుంటారు, వారి పళ్ళను శుభ్రం చేయడానికి మిమ్మల్ని అనుమతించరు. కాబట్టి, అటువంటి వారికి ఈ చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి. 

 శుభ్రమైన వస్త్రం: పసిపిల్లల్లో దంతాలు ఏర్పడటం మొదలవగానే, ప్రతి రోజూ పసిపిల్లల దంతాలను ఒక శుభ్రమైన ఉతికిన వస్త్రంతో, నీటిలో తడిపి పాల పళ్ళను తుడవాలి . అలాగే వారికి స్నానం చేయించేటప్పుడు కూడా వారి నోట్లో కొద్దిగా నీళ్ళు పోసి, వెంటనే చేత్తో దంతాల మీద శుభ్రం చేయాలి. 

దంతాలకు బ్రెష్ చేయడం: మీ పసిపిల్లల్లో దంతాలను శుభ్రం చేయడానికి ఒక మంచి మార్గం బ్రషింగ్. పసిపిల్లలకు దంతాలు ఏర్పడటం మొదలవగానే, వారి కోసం ఒక స్పెసిఫిక్ టూత్ బ్రష్ మరియు టూత్ పేస్ట్ ను కొనండి. పసిపిల్లల దంతసంరక్షణ కిట్ కొనేటప్పుడు, మీ పిల్లల వయస్సును గుర్తించుకొని కొనాలి. అలాగే టూత్ పేస్ట్ లో ఘాటైనవి కాకుండా, ప్లోరైడ్ లేనివి కాకుండా ఉండేటివి ఎంపిక చేసుకోవాలి. 

కలర్స్ ఎంపిక చేసుకోవడం: సాధారణంగా చిన్న పిల్లల్ల కలర్ ఫుల్ గా ఉండే బొమ్మలంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాబట్టి, వారికోసం అటువంటి కలర్ ఫుల్ బ్రైట్ కలర్ బ్రష్ లను ఎంపిక చేసుకోవాలి. ఈ బ్రష్ లను వారు చూడగానే ఆకర్షించబడి, వెంటనే వాటిని తీసుకొని నోట్లో పెట్టుకొని ఆడుకోవడం మొదలు పెడుతారు, బ్రష్ చిన్న చిన్న దంతాల మీద తగలడం వల్ల దంతాలు శుభ్రపడుతాయి. 

బ్రెష్ చేసుకోవడాన్ని అలవాటుగా మార్చండి: మీ పిల్లల యొక్క దంతాలను శుభ్రం చేయడానికి ఇది ఒక సులభమైన మార్గం. బ్రష్ చేసుకోవడం ఎప్పుడైతే వారు అలవాటుగా చేసుకుంటారో, అప్పుడు, తర్వాత రోజు నుండి వారికి మీరు టూత్ పేస్ట్ తో బ్రష్ చేసేటప్పుడు ఏడవకుండా ఉంటారు. 

గోరువెచ్చని నీళ్ళు: ఇంకా మీరు పిల్లలకు గోరువెచ్చని నీళ్ళు కూడా ఇవ్వొచ్చు. నోట్లో ఉన్న అన్ని రకాల బ్యాక్టీరియాను గోరువెచ్చని నీళ్ళు నాశనం చేస్తుంది. వేడి నీళ్ళలో ఉప్పు వేయకండి లేదంటే, వారిలో అప్పుడప్పుడే పెరిగే దంతాలు త్వరగా పాడవుతాయి.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ