30 మంది చిన్నారుల మరణం?

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లోని పలు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిలో 30 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు వెలువడుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఇక్కడ మత అల్లర్లు జరగడంతో బాధితులకు ప్రభుత్వం సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. అక్కడ వందలాది మంది తలదాచుకుంటున్నారు. అల్లర్లు సద్దుమణిగి చాన్నాళ్లు అయినా ఇంకా వారిప్పటికీ సహాయక శిబిరాల్లోనే ఉండిపోయారు. తిరిగి వెళ్లడానికి వారికి గూడు లేదు. అల్లర్ల సమయంలో నివాసాలను కోల్పోయారు. అయితే, శిబిరాల్లో ఉన్నవారికి యూపీ సర్కారు తగిన వసతులు కల్పించలేదని, తిండి కూడా సరిగా పెట్టడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. పైగా ఇప్పుడు చలి కాలం కావడంతో వాతావరణం తట్టుకోలేక శిబిరాల్లోని చిన్నారులు కన్నుమూసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ