తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి

శ్రీ వారి గర్భగుడి లో ఒక పిల్లి అనుచానంగా నివసిస్తు వస్తోంది. మాములుగా శ్రీ వారి ఆలయం బంగారు వాకిలి తలుపులు తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాతసేవ సమయంలో అర్చకులచే తెరువబడుతాయి. ఆ సమయంలో బంగారు వాకిలి లోపలికి అర్చకులు, జీయంగారు స్వామి, ఏకాంగితో పాటుగా 'సన్నిధి గొల్ల' అనబడే ఒక యాదవుడూ మాత్రమే ప్రవేశిస్తారు. కాని అదే సమయంలో అశ్చర్యకరంగా ఒక దైవీకమైన పిల్లి క్రమం తప్పకుండా వీరితో పాటుగా బంగారు వాకిలిలో ప్రవేశిస్తుంది. ఇది శ్రీ వారి లీల మాత్రమేగాని మరియొకటి కాదు. ఈ పిల్లి (లేక పిల్లులు)సుమారుగా 100 సంవత్సరముల(ఈ గుడితో సంబధం ఉన్నటువంటి పూర్వికుల నుండి గ్రహించిన సమాచారం మేరకు) నుండి శ్రీవారి గర్భాలయంలో వున్నట్టు తెలుస్తోంది.

మాములుగా రాత్రి శ్రీవారి ఏకాంత సేవ సమయంలో తలుపులు మూసి వేస్తారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చిస్తారని ప్రతీతి. ఆ సమయంలో గర్భాలయం ఎట్టి పరిస్థితుల్లోను లోపల ఎవ్వరు ఉండకుడదు. ఇది అనుచానంగా శ్రీవారి ఆలయంలో వస్తున్న సంప్రదాయం. ఆశ్చర్యకరంగా ఈ పిల్లి కూడా ఈ నిబంధనను క్రమంతప్పక పాటిస్తుంది. ఆ తర్వాత తిరిగి సుప్రభాత సమయంలోనే అర్చకులతో పాటు ఈ పిల్లి లోనికి ప్రవేశిస్తుంది. ఈ పిల్లి శ్రీవారికి నివేదించిన తర్వాత మాత్రమే ప్రసాదం స్వీకరిస్తుంది అది కూడా అర్చకులు పిల్లి చేసే సంజ్ఞలను గుర్తించి ప్రసాదాన్ని పిల్లి కోసం పెట్టినప్పుడు మాత్రమే అది స్వీకరిస్తుంది.

అలాగే రాత్రి ఏకాంత సేవ సమయంలో శ్రీ వారికి నివేదించబడిన పాలు అర్చకులు ఇవ్వగా స్వీకరిస్తుంది. శ్రీ వారికి నివేదించని ప్రసాదాన్ని ఇది స్వీకరించదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. మరొక విషయమేంటంటే ఈ పిల్లి ఆయుర్దాయం తీరిన వెంటనే ఆ స్థానంలో మరొక పిల్లి శ్రీవారి కైంకర్యం చేయడానికి సిద్ధంగా వుంటుంది. ఈవిధంగా శ్రీ వారు మనుష్యులతో పాటు జంతువులను కుడా కటాక్షిస్తున్నారు!

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ