ప : తలఁగరో లోకులు తడవకురో మమ్ము
కలిగిన దిది మాకాఁపురము
కలిగిన దిది మాకాఁపురము
చ : నరహరికీర్తన నానినజిహ్వ
వొరుల నుతింపఁగనోపదు జిహ్వ
మురహరుపదముల మొక్కినశిరము
పరులవందనకుఁ బరగదు శిరము
వొరుల నుతింపఁగనోపదు జిహ్వ
మురహరుపదముల మొక్కినశిరము
పరులవందనకుఁ బరగదు శిరము
చ : శ్రీపతినే పూజించినకరములు
చోఁపి యాచనకుఁ జొరవు కరములు
యేపున హరికడ కేఁగినకాళ్ళు
పాపులయిండ్లకుఁ బారవు కాళ్ళు
చోఁపి యాచనకుఁ జొరవు కరములు
యేపున హరికడ కేఁగినకాళ్ళు
పాపులయిండ్లకుఁ బారవు కాళ్ళు
చ : శ్రీవేంకటపతిఁ జితించుమనసు
దావతి నితరముఁ దలఁచదు మనసు
దేవుఁ డతనియాధీనపుతనువు
తేవల నితరాధీనముగాదు
దావతి నితరముఁ దలఁచదు మనసు
దేవుఁ డతనియాధీనపుతనువు
తేవల నితరాధీనముగాదు
0 comments:
Post a Comment