అదనపు జాయింట్ కలెక్టర్ మృతి

అనంతపురం పట్టణ శివారులో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ జయచంద్రనాయుడు మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న కారు వడియంపేట బ్రిడ్జి దగ్గర డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అదే కారులో ఉన్న ఆయన కుమారుడు సహా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ