సెంచరీ మిస్సయిన సచిన్
నాగపూర్ లో న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్, మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే, సచిన్ 61 పరుగులకు మెక్ కే బౌలింగ్ లో ఔటయ్యాడు.
సిరిమల్లెపువ్వా ... సిరిమల్లెపువ్వా ...
చిత్రం: పదహారేళ్ళ వయసు
నటీనటులు: చంద్రమోహన్, శ్రీదేవి.
పల్లవి:
సిరిమల్లెపువ్వా ... సిరిమల్లెపువ్వా ...
చిన్నారి చిలకమ్మా...
నా వాడు ఎవరే? నా తోడు ఎవరే?
ఎన్నాళ్ళకొస్తాడే?
సిరిమల్లెపువ్వా.....
చరణం 1 :
తెల్లారబోతుంటే... నా కల్లోకి వస్తాడే....
కళ్ళారా చూదామంటే.... నా కళ్ళు మూస్తాడే....
ఆ అందగాడు... నా ఈడు జోడు ఏడే?
ఈ సందెకాడ... నా చందమామ రాడే
చుక్కల్లారా ...... దిక్కులు దాటి
వాడెన్నాళ్ళకొస్తాడో? (సిరిమల్లెపువ్వా ... )
చరణం 2 :
కొండల్లో కోనల్లో.... కూయన్న ఓ కోయిలా...
ఈ పూల వానల్లో..... ఝుమ్మన్న ఓ తుమ్మెదా....
వయసంతా వలపై.... మనసే మైమరపై ఊగేనే...
పగలంతా పగలు..... రేయంతా దిగులు రేగేనే...

వరుసకు ఏమి అవుతారు?
ఇది భేతాళ కధలు లోనిది. భేతాళుడు విక్రమార్క చక్రవర్తి ని అడిగిన ప్రశ్న. ప్రశ్న మీకోసం.
ఒకనాడు ఇద్దరు తండ్రీకొడుకులు నదీ తీరాన నడుచుకుంటూ వెళుతున్నారు. కొంతదూరం వెళ్ళాక వాళ్ళకు రెండు రకాల అడుగుజాడలు పక్కపక్కన కనిపించాయి. అవి స్త్రీ ల అడుగుజాడలు అని ఆ తండ్రీకొడుకులు గ్రహించారు. తండ్రి ఆ చిన్న అడుగులు గల స్త్రీ ని వివాహమాడతానని ప్రతిజ్ఞ చేశాడు. అలాగే కొడుకు ఆ పెద్ద అడుగుల స్త్రీ ని పెళ్లి చేసుకుంటానని శపధం చేశాడు. అలా వాళ్ళు ఆ అడుగుల వెంబడి నడుస్తూ వెళ్లారు. కొంతసేపటికి ఆ ఇద్దరి స్త్రీ లను కలుసుకున్నారు. తీరా చూస్తే వాళ్ళు కూడా వీల్లలాగే ఒక తల్లీకూతుల్లు . కాని వాళ్ళ శపధం కోసం కొడుకు తల్లిని, తండ్రి కూతురుని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం పిమ్మట కొడుకుకి తల్లి వల్ల ఆడబిడ్డ, తండ్రికి కూతురి వల్ల మగబిడ్డ జన్మించారు. అయితే మొత్తంగా వాళ్ళ వరుసలు ఏమిటి?

శ్రీ రామదాసు ను బంధించిన జైలు - గోల్కొండ
నవాబు అనుమతి లేకుండా రాముని గుడి కట్టినందుకు గోపన్న ను గోల్కొండ కోటలో బంధించిన విషయం మనకు తెలిసిందే. పై చిత్రం ఆయనను బంధించిన కారాగారమే. ఆయన ఈ కారాగారం లో ఉండగా సీతారామ లక్ష్మణుల మరియు హనుమంతుని చిత్రాలను చిత్రించి వాటిని కీర్తిస్తూ ఉండేవాడట. ఆయన కీర్తన లలో బాగా ప్రాచుర్యం పొందినవి, ఈ కారాగారం లో రచించినవే అంటారు. ఈసారి గోల్కొండ వెళ్ళినపుడు ఈ కారాగారాన్ని దర్శించి ఆ మహానుభావున్ని మననం చేసుకుని రండి.
మావటి ని చంపిన ఏనుగు.
తమిళనాడు లోని వేలూరు సమీప స్వర్ణాలయం లో భక్తులను ఆశీర్వదించే ఒక ఏనుగు గురువారం రాత్రి అకస్మాత్తుగా భక్తులపై దాడి చేసింది. దీనిని ఆపడానికి ప్రయత్నించిన మావాటిని తొండం తో విసిరికొట్టి చంపివేసింది. విశేషం ఏమిటంటే అసలు మావటి సెలవుల్లో ఉంటే ఇతనిని తాత్కాలికంగా నియమించారు.
నోబెల్ బహుమతి అందుకునే చేతులు కరువు?
నోబెల్ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ఈసారి 2010 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని అందుకునే చేతులు కరువయ్యాయి. చైనా ప్రజాస్వామ్యం పై జరిపిన పోరాటానికి గాను ఉద్యమ నేత లియూ జియాంబోకు శాంతి నోబెల్ బహుమతి ప్రకటించారు. బహుమతి ప్రకటించినపుడు ఆయన జైలులో ఉన్నారు. ఇపుడిపుడే ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. పోనీ అయన తరపున ఆయన కుటుంబసభ్యులు కూడా అందుకునే పరిస్థితులు కనిపించడంలేదు. కావున ఈ సారి శాంతి నోబెల్ ప్రదాన కార్యక్రమం రద్దు కావచ్చునని భావిస్తున్నారు. చైనా ప్రభుత్వం మనసు మార్చుకుని కనీసం అవార్డు ప్రధానోత్సవనికైనా ఆయనను తీసుకువస్తే బావుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
సైనా జోరు కు అడ్డుకట్ట.
ఆసియాడ్ బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్న సైనా నెహ్వాల్ జోరు కు అడ్డుకట్ట పడింది. క్వార్టర్ ఫైనల్లో ఓటమి తో వెనుతిరిగింది. నిరుటి ఆసియాడ్‌లో రజత పతక విజేత 'యిప్ పుయ్ యిన్' చేతి లో సైనా 8-21, 21-8, 19-21తో ఓటమి చవిచూసింది.
ఊహలు గుసగుసలాడే నా హ్రుదయము ఊగిసలాడే
చిత్రం: బందిపోటు
నటినటులు: యన్.టి.ఆర్
పల్లవి:
ఊహలు గుసగుసలాడే నా హ్రుదయము ఊగిసలాడే
ప్రియా
ఊ
ఊహలు గుసగుసలాడే నా హ్రుదయము ఊగిసలాడే
చరణం 1 :
వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే అది నీకు ముందే తెలుసు (ఊహలు గుసగుసలాడే..)
చరణం 2 :
నను కోరి చేరిన బేలా.... దూరాన నిలిచేవేలా
నను కోరి చేరిన బేలా.... దూరాన నిలిచేవేలా
నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా (ఊహలు గుసగుసలాడే..)
చరణం ౩:
దివి మల్లెపందిరి వేసే.... భువి పెళ్ళిపీటను వేసే..
దివి మల్లెపందిరి వేసే.... భువి పెళ్ళిపీటను వేసే..
నెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెళ్ళిని చేసే (ఊహలు గుసగుసలాడే...)

బిగ్‌బాస్ కు పండగ
బిగ్‌బాస్ , రాఖీ కా ఇన్సాఫ్ కార్యక్రమాలను ఇకపై రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలని కేంద్ర సమాచార శాఖ ఉత్తర్వులు జారీ చేయడం తో బిగ్‌బాస్ నిర్వాహకులు ముంబై హైకోర్టు ను ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది.
180 కిలోల గొర్రె
నాగపూర్‌లో బక్రీద్ సందర్భంగా అమ్మకానికి తీసుకొచ్చిన ఓ గొర్రె ఏకంగా నాలుగడుగుల ఎత్తు.. 180 కిలోల బరువుతో అందరినీ ఆశ్చర్య పరిచింది! మధ్యప్రదేశ్‌లోని చంబల్‌నుంచి తెచ్చిన ఆ గొర్రెకు మంచి ఆహారం, పాలు ఇచ్చి రెండేళ్ల నుంచి పోషిస్తున్నట్లు దాని యజమాని నదీంఖాన్ చెప్పాడు. రోజుకు తాను దాని ఆహారానికి రూ. 400 ఖర్చుపెట్టానని, అల్లా దయతో 1.75 లక్షలకు అమ్మానని తెలిపాడు.
అశ్లీల, అభ్యంతరకర టీవీ కార్యక్రమాలపై..............
అశ్లీల, అభ్యంతరకర టీవీ కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వివాదాస్పదంగా మారిన ‘బిగ్‌బాస్’, ‘రాఖీ కా ఇన్సాఫ్’ కార్యక్రమాలను ఇకపై రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల లోపు ప్రసారం చేయాలని వాటిని ప్రసారం చేస్తున్న చానళ్లను బుధవారం ఆదేశించింది. ఈమేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నగ్నదృశ్యాలను ప్రసారం చేస్తున్న ఎస్‌ఎస్ మ్యూజిక్ చానల్‌ను వారం రోజులు నిషేధించింది. ‘కలర్స్ చానల్‌లో వస్తున్న బిగ్‌బాస్, ఎన్డీటీవీ ఇమాజిన్ చానల్‌లో వస్తున్న రాఖీ కా ఇన్సాఫ్‌లు అందరూ చూడడానికి ఉద్దేశించినవి కావు. వీటిని ఎక్కువ మంది టీవీ చూసే సమయం(ప్రైమ్ టైమ్)లో ప్రసారం చేయొద్దు’ అని పేర్కొంది. బిగ్‌బాస్‌లో పాల్గొంటున్న వారు తరచూ గొడవలు పడుతూ బూతులు మాట్లాడుతున్నారని, ముష్టి యుద్ధాలకు దిగుతూ, వ్యక్తిగత విషయాలు బట్టబయలు చేస్తున్నారని తెలిపింది.
ఈ కార్యక్రమాలను పునఃప్రసారం కూడా చేయొద్దని ఆదేశించింది. తమ చానల్‌లో ప్రసారం చేస్తున్న వాటిలో అశ్లీల దృశ్యాలేమీ లేవంటూ ఎస్‌ఎస్ చానల్ ప్రతినిధి చెప్పారు. కొన్ని పాటల విజువల్స్‌ను చూపగా, అవి అశ్లీలమైనవేనని ఆయన అంగీకరించారు. అయితే వాటిని తమ చానల్‌లో ఎప్పుడూ ప్రసారం చేయలేదని చెప్పారు. అశ్లీల కార్యక్రమాలపై కొరడా ఝళిపించాలని సోమవారం జరిగిన అంతర్ మంత్రిత్వశాఖల సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో హోంశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, విదేశాంగ శాఖ, సమాచార ప్రసారాల శాఖల అదనపు కార్యదర్శులు పాల్గొన్నారు.

క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్న సైనా నేహ్వాల్
ఆసియా క్రీడల మహిళల సింగిల్స్ బాడ్మింటన్‌లో భారత నెంబర్‌వన్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. రెండవ రౌండ్‌లో మలేషియాకు చెందిన లిడియా ఛీపై 21-15, 21-17 స్కోరు తేడాతో విజయం సాధించింది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో హాంగ్‌కాంగ్‌కు చెందిన ప్యూ యిన్, తైపై క్రీడాకారిణి మా సియా పాయ్‌ల మధ్య జరిగే పోటీలో గె లుపొందిన వారితో తలపడనుంది.
ఇంటివాడైన అనంతశ్రీరాం
ఇండస్ట్రీకి ప్రవేశించిన ఆనతికాలం లోనే అగ్రస్థాయికి ఎదిగిన అతికొద్ది మంది గేయ రచయితలలో అనంతశ్రీరాం ఒకరు. ఈయన వివాహం నిన్న రాత్రి పాలకొల్లు లో వైభవం గా జరిగింది. ఈయన యలమంచిలి లో జన్మించారు. పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు వివాహానికి హాజరై వీరిని ఆశీర్వదించారు.
అతి ఖరీదైన వజ్రం
గ్రాఫ్ పింక్ అనే పేరు గల ఈ వజ్రాన్ని ఇటీవల జెనీవా లో వేలం వేశారు. ఈ పింక్ కలర్ వజ్రం చాలా అరుదైనది గా గుర్తించారు. దీని బరువు దాదాపుగా 25 క్యారట్స్ ఉంటుంది. దీనిని లండన్ కు చెందినా ఒక వ్యాపారి దాదాపుగా 210 కోట్లకు కైవసం చేసుకున్నాడు.
తిరుమల లో వై.యస్ చిత్రపటం పై రగడ
తిరుమల లోని ఒక సత్రం లో దివంగత వై.యస్ చిత్రపటం ఏర్పాటు చేయడంపై టి.టి.డి నోటీసులు జారీ చేసింది. ఆ చిత్రపటాన్ని తక్షణమే తొలగించాలని లేనిపక్షంలో ఆ సత్రం యొక్క లైసెన్సును రద్దు చేస్తామని తెలిపింది. నిబంధనల ప్రకారం తిరుమల లో వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవార్ల చిత్రపటాలు మాత్రమే ఉండాలట.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు హీరో గా రంగప్రవేశం?
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు హీరో గా రంగప్రవేశం చేయబోతున్నట్లు తెలిసింది. ఇతగాడి పేరు అశోక్. ఇతను కృష్ణ పెద్ద కూతురు కొడుకు. ఇతన్ని గ్రాండ్ గా లాంచ్ చెయ్యడానికి ప్రయత్నాలు జోరందుకున్నాయ్. ఎవరి బ్యానర్ లో చేయబోతున్నాడు, డైరెక్టర్ ఎవరు అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్.
తిరుమల భగవానుని జోస్యం
ఇది ఎపుడు జరిగిందో నాకు తెలియదు. రాత్రి టి.వి లో చూశాను. ఊరి పేరు తెలియదు (తమిళనాడు అనుకుంటాను). అక్కడ తిరుమల భగవానుని దేవాలయం ఉంది. అక్కడ 200 సంవత్సరాల క్రితం ఒక సిద్ధుడు ఉండేవాడట. అతను చాలా మహిమలు కలవాడని ప్రసిద్ధి. అతను అక్కడ ఒకానొక చోట, ఒక గిన్నెలో పంచదార వేసి తాడు ఆధారంగా ఉట్టి కట్టాడట. ఆ తాడు మెల్లిగా కిందకు జరుగుతూ, ఉట్టి ఎపుడైతే భూమికి అంటుకుంటుందో అపుడు ప్రళయం వచ్చి ఈ భూమండలం నాశనం అవుతుందని చెప్పాడట. ఆయన చెప్పినట్లే ఆ ఉట్టి కిందకు దిగుతూ వచ్చింది. ప్రళయ కాలంలో ఆ తిరుమల భగవానుడు అవతరించి దుష్టశిక్షణ చేస్తాడట. ఇపుడు ఆ ఉట్టికి, భూమికి మధ్య అర అంగుళం మాత్రమే ఖాళీ ఉంది. అది కూడా అయిపోతే ఈ భూమి అంతం అయిపోతుందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారని నిన్న టి.వి లో ప్రసారం చేశారు. అసలు ఉట్టికి, ప్రళయం రావడానికి సంబంధం ఏమిటో?
అంతేకాదండోయ్ ఇంకో విషయం కూడా ఉంది. 200 సంవత్సరాల క్రితం ఆ తిరుమల భగవానుడు ఉపయోగించిన మంచం ఇంకా అక్కడే ఉందట. అక్కడి పూజారులు దానిని గాలి కూడా చొరబడని గదిలో ఉంచి, రోజూ రాత్రి పూజ అవగానే, ఆ మంచం మీద శుభ్రమైన ధవళ వస్త్రం తో పక్క వేసి , దాని మీద పువ్వులు పెట్టి, పూజ చేసి, తలుపులు మూసి వెళతారట. తెల్లవారుజామున తలుపులు తీసి చూస్తే ఆ పక్క మీద ఎవరో విశ్రమించినట్లుగా, పక్క నలిగినట్లు ఉంటుందట. ఆ తిరుమల భగవానుడే వచ్చి విశ్రమించి వెలుతున్నట్లుగా అక్కడి ప్రజలు విశ్వశిస్తున్నారు.

నన్ను దోచుకుందువటే ....
చిత్రం: గులేబకావళి కధ.
నటీనటులు: యన్.టి,ఆర్, జమున.
పల్లవి:
నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసానీ
కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామీ... నిన్నే నా స్వామీ...
నన్ను దోచుకుందువటే ..........
చరణం1:
తరియుంతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియుంతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండ వోలె కర్పూర కళిక వోలె ....... కర్పూర కళిక వోలె
ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు
ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు
కలకాలం వీడని సంకెలను వేసినావు.... సంకెలను వేసినావు. (నన్ను దోచుకుందువటే.. )
చరణం 2:
నా మదియే మందిరమై..... నీవే ఒక దేవతవై...
నా మదియే మందిరమై..... నీవే ఒక దేవతవై...
వెలసినావు నాలో.. నే కలిసిపోదు నీలో...... కలిసిపోదు నీలో......
ఏనాటిదో మన బంధం .... ఎరుగరాని అనుబంధం
ఏనాటిదో మన బంధం .... ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా ఇది ఇరిగిపోని గంధం..... ఇరిగిపోని గంధం..... (నన్ను దోచుకుందువటే)

ఇండియా Vs న్యూజిలాండ్ 2nd టెస్ట్
మొదటి ఇన్నింగ్స్ లో 350 పరుగులు చేసిన న్యూజిలాండ్, సెకండ్ ఇన్నింగ్స్ ను 448 /8 వద్ద డిక్లేర్ చేసింది. మెక్‌కల్లం 225 పరుగులతో భారత్ విజయావకాశాలకు గండి కొట్టాడు. ఇపుడు భారత విజయలక్ష్యం 327 పరుగులు. సెహ్వాగ్ 7 పరుగులతోను, గంభీర్ 10 పరుగులతోను క్రీజ్ లో ఉన్నారు.
తిరుమలలో మహిళ హత్య!
తిరుమలలో ఓ భక్తురాలు హత్యకు గురైంది. గోవర్థనం అతిథి గృహంలో రూమ్ నెంబర్ 87లో ఈ ఘటన జరిగింది. మృతురాలు తమిళనాడులోని ధర్మపురికి చెందిన జయంతిగా పోలీసులు గుర్తించారు. ఈనెల 11వ తేదీన జయంతి ముగ్గురు వ్యక్తులతో కలిసి కాటేజీ అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు.
యంగ్ టైగర్ N .T .R కు పదేళ్ళు.
యంగ్ టైగర్ N .T .R సినీ ఇండస్ట్రీ కి వచ్చి నిన్నటికి పదేళ్ళు గడిచిపోయాయి. ఈ పదేళ్ళలో అతను చాలా ఎదిగిపోయాడు. ఎన్నో హిట్లు తన ఖాతాలో జమ వేసుకున్నాడు. సింహాద్రి తో తన సక్సెస్ శాతం నెమ్మదించినా యమదొంగ తర్వాత మళ్ళీ ఊపందుకొంది. నిజం చెప్పాలంటే తను వచ్చి పదేళ్ళ పైనే అయ్యింది. ఎందుకంటే తన మొదటి సినిమా 'బాల రామాయణం'. దీనిని శబ్ధాలయా పిక్చర్స్ వారు నిర్మించారు. కాకపోతే అతను కమర్షియల్ హీరో గా చేసిన మొదటి చిత్రం 'నిన్ను చూడాలని' . దీనిని ఉషాకిరణ్ మూవీస్ వారు నిర్మించారు.
మాంసం తింటున్న కోతులు
మనం సాధారణంగా కోతులు పూర్తి శాఖాహారులు అనుకుంటాం. ఇవి కామన్ గా పళ్ళు, చిరుతిళ్ళు వంటివి తింటాయి. కానీ బబూన్ వంటి కోతులు చనిపోయిన ఒక జంతువు శరీరాన్ని తింటున్న దృశ్యాన్ని మీరు కింది వీడియో లో చూడవచ్చు.
ఇవి సాధారణంగా ఆహారం దొరకనపుడు, ఆకలి తీర్చుకోవడం కోసం ఈ విధంగా చేస్తాయి.
ఇవి సాధారణంగా ఆహారం దొరకనపుడు, ఆకలి తీర్చుకోవడం కోసం ఈ విధంగా చేస్తాయి.
రతన్ టాటా ను లంచం అడిగిన కేంద్ర మంత్రి!
డెహ్రడూన్ లో జరిగిన ఒక కార్యక్రమం లో రతన్ టాటా పాల్గొన్నారు. అక్కడ ఒక విలేఖరి 'మీరు పౌర విమానయాన రంగం లోనికి ఎందుకు ప్రవేశించలేదు' అని అడిగిన ఒక ప్రశ్న కి ఆయన కింది విధంగా సమాధానమిచ్చారు.
'విమానయాన రంగం లోనికి ప్రవేశించాలని టాటా గ్రూప్ 1995 , 1997 , 2001 లో మూడు సార్లు ప్రయత్నించింది. అపుడు ఒక కేంద్ర మంత్రి 15 కోట్లు లంచం అడిగారు, లంచం ఇవ్వడం ఇష్టం లేని టాటా గ్రూప్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అపుడు లంచం ఇచ్చి ఉంటే టాటా గ్రూప్ ఎపుడో విమానయాన రంగం లో ఉండేది.'
కానీ ఆయన ఆ మంత్రి పేరు వెల్లడించలేదు. ఆ మంత్రి పేరు వెల్లడించాలని, ప్రధానమంత్రి దీనిపై C .B .I విచారణ జరిపించాలని కొందరు పట్టుబడుతున్నారు.

హైదరాబాద్ లో మొసలి పట్టివేత!
హైదరాబాద్ నానక్‌రాంగూడ సెల్లార్ గుంతలో కొద్ది రోజుల క్రితం కనిపించిన మొసలి ని పట్టుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. మొసలి ని పట్టుకునేందుకు అధికారులు కొద్దిరోజులుగా గుంతలోని నీటిని మోటార్లు తో తోడుతున్నారు. గుంతలో నీరు తగ్గిపోవడంతో ఉదయం మొసలి తప్పించుకుని బయటకు వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికుడు అధికారులకు తెలియచేయగా కొన్ని గంటలపాటు అధికారులు కష్టపడి దగ్గర లోని పొదల్లో మొసలి బంధించి, జూపార్క్ కు తరలించారు. అసలు ఈ గుంతలోకి మొసలి ఎలా వచ్చిందో అర్ధంకావడంలేదని స్థానికులు అంటున్నారు. ఎట్టకేలకు మొసలి ని బంధించడం తో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
త్రిమూర్తుల జననం
ఒకానొక ఇతిహాసం ప్రకారం త్రిమూర్తుల జననం ఒక విచిత్రం. ఆది పరాశక్తి, త్రినేత్రి యగు శ్రీ రాజరాజేశ్వరీ దేవి బ్రహ్మ,విష్ణు,మహేశ్వరు లకు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన అనంతరం ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను పరిణయమాడవలసినదిగా కోరింది. దానికి మొదట వారు నిరాకరించారు. తర్వాత పరమశివుడు తనను వివాహమాడటానికి ఒక షరతు మీద అంగీకరించాడు. ఆ షరతు ఏమిటంటే వివాహం జరిగిన పిమ్మట ఆమె మూడో నేత్రం తనకు ఇవ్వాలని. దానికి ఆమె అంగీకరించి శివుడ్ని వివాహమాడి, తన మూడో నేత్రాన్ని శివుడి కి ఇచ్చింది. మూడో నేత్రాన్ని స్వీకరించిన శివుడు ఆ నేత్రశక్తి తో ఆమెను భస్మం చేసి ఆ భస్మరాశి ని మూడు భాగాలుగా విభజించాడు. బ్రహ్మ ఆ మూడు భాగాలకు ప్రాణం పోశాడు. వాళ్ళే లక్ష్మి, పార్వతి, సరస్వతి.
best drupal/joomla institute?
Can anyone tell me which is best drupal/joomla training institute in hyderabad. In ammerpet locality is more preferable for me.
శ్రీ కృష్ణుడు గోపికలతో రాసలీలలు ఆడాడా?
శ్రీ కృష్ణుడు ఎంతో మంది గోపికలతో బృందావనం లో రాసలీలలు ఆడాడని చాలా మంది అనుకుంటారు. చాలా మంది వరకు ఎందుకు, మొన్నటి వరకు నేను కూడా అలానే అనుకున్నాను. కానీ ఒక బుక్ లో చదివినట్లు గుర్తు, కృష్ణుడు నిజంగా గోపికలతో ఉండడని, గోపికలు కృష్ణుని మీద అచంచలమైన ప్రేమతో ఆయన్ని ఊహించుకుంటారని. అలా ఊహించుకున్నప్పుడు నిజంగా కృష్ణుడే వాళ్లతో ఉన్నట్లుగా ఆ స్వామి వారిని అలా భ్రమింపచేస్తాడట.ఆ పరమాత్మ ఆ విధంగా వాళ్ళ కోరికలు తీరుస్తాడన్నమాట !.
రావణాసురుడు బ్రాహ్మణుడా? రాక్షసుడా?
రావణుడు బ్రాహ్మణుడు అంటారు కదా, మరి అతను రాక్షస రాజు ఎలా అయ్యాడు? ఒకవేళ అతను రాక్షసుడే అయితే బ్రాహ్మణత్వం ఎలా వచ్చింది?
మన డబ్బు మనమే ముద్రించవచ్చా?
క్షమించాలి, ఇది చాలా సిల్లీ ప్రశ్న లా ఉండవచ్చు, ఈ మాత్రం తెలియదా అనిపించవచ్చు, కానీ నాకు నిజం గా తెలియకే అడుగుతున్నాను. మనం చాలా అప్పుల్లో ఉన్నాం, ఖజానా ఖాళీగా ఉంది అంటుంటాం. కానీ మన రిజర్వ్ బ్యాంక్ కు డబ్బు ముద్రించే (టంకశాల) రైట్స్ ఉన్నాయి కదా, మనకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ముద్రించుకుని మన దేశ ప్రగతి కి ఉపయోగించవచ్చును కదా, ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకోవడం దేనికి?
వెంకటేష్ కింగ్ గెటప్
నాగవల్లి లో వెంకటేష్ ఎలా ఉంటాడా అని ఎదురుచూసే ప్రేక్షకులకు సమాధానం దొరికింది. వెంకటేష్ కింగ్ గెటప్ ఫోటో నెట్ లో ఎవరో రిలీజ్ చేసారు.
ఇందులో వెంకటేష్ సైక్రియాట్రిస్త్ గాను, రాజు గాను కనిపించనున్నారు. చంద్రముఖి లో రజనీకాంత్ 'లక లక లక' అని అన్నట్లుగానే ఇందులో వెంకటేష్ ఏదో డిఫరెంట్ వర్డ్ ఉచ్చరిస్తారని తెలిసింది.
బలరాముడు తిరుమల ఆలయం ను దర్శించాడా?
కురుక్షేత్ర మహా సంగ్రామ సమయం లో బలరాముడు శాంతికాముకుడై పుణ్యక్షేత్రాలను దర్శించాడని, అలా దర్శించిన వాటిలో తిరుమల ఆలయం కూడా ఉన్నదని చాలా చోట్ల చదివాను. కానీ నాకు ఒక సందేహం. బలరామకృష్ణులు ద్వాపరయుగము లోని వారు. వెంకటేశ్వరస్వామి కలియుగం లోని వాడు. ద్వాపరయుగము తర్వాత కలియుగము వస్తుంది కదా. ఇంకా మొదలవని కలియుగంలోని తిరుమల ఆలయం ని, ద్వాపరయుగము లోని బలరాముడు ఎలా దర్శించాడు. ఒకవేళ అదే నిజం అయితే తిరుమల ఆలయం ద్వాపరయుగము లో కూడా ఉందా? ఉంటే శ్రీ కృష్ణుడు బ్రతికి ఉండగానే వెంకటేశ్వరస్వామి తిరుమల లో పూజలు అందుకున్నాడా?
నా సందేహాలను ఎవరైనా నివృత్తి చెయ్యండి దయచేసి.
నా సందేహాలను ఎవరైనా నివృత్తి చెయ్యండి దయచేసి.
ధర్మరాజు నరక ప్రయాణం
ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజు కు దారి లో వైతరణి నది కనిపిస్తుంది. ఈ నది ఎన్నో వేల వైశాల్యం కలిగి, ఎముకలు,చీము,రక్తము మరియు బురద కలిగిన మాంసము తో నిండి ఉంది. ఈ నది నిండా పెద్ద పెద్ద మొసళ్ళు, మాంసము తినే క్రిములు, విశ్వం లో మాంసాహారం భుజించే సకల జీవాలు అందులో నిక్షిప్తం అయి ఉన్నాయి. దోవ అంతా దుర్గందపూరితం గా ఉంది. దానిని భరించలేక ధర్మరాజు మూర్చపోయాడు. జన్మలో ఎటువంటి తప్పు చెయ్యని నాకు ఈ దురవస్థ ఏమిటని ధర్మరాజు ఇంద్రుని అడిగాడు. అపుడు ఇంద్రుడు ధర్మరాజు తో 'కురుక్షేత్ర సంగ్రామాన, అశ్వద్ధామ హత: అని బిగ్గరగా పలికి, కుంజర: అని హీన స్వరం తో పలికి గురుదేవుని వంచించిన ఫలితమిది' అని చెప్పాడు. అబద్దం ఆడిన వారికే నరక దర్శనం తప్పకపోతే ఇక పాపాలు చేసే వారి పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి.
భారత్ బ్లడ్ బ్యాంక్
రక్తదానం చెయ్యండి తోటివారిని బ్రతికించండి. ఎవరికైనా అత్యవసర పరిస్థితులలో రక్తం అవసరం అయినపుడు ఎవరైనా రక్తం ఇచేవాళ్ళు ఉన్నారేమో అని వెతుకులాడటం, లేదా టీవీ లో scroll చెయ్యడమో చేస్తుంటాం. అందుకోసం వృధాగా పోయే ప్రతి క్షణం భాదితుడి ఆయుర్దాయాన్ని హరించివేస్తుంది. ఇటీవల నేను ఒక వెబ్ సైట్ చూసాను. అందులో వివిధ ప్రాంతాల్లో వివిధ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల ఫోన్ నెంబర్ లు ఉంటాయి. ఆ వివరాలను ఉపయోగించి మనం ఆ వ్యక్తుల తో మాట్లాడి భాదితుడిని బ్రతికించవచ్చు. మన వివరాలు కూడా ఆ వెబ్ సైట్ లో పెడితే మనం కూడా కొంత మందిని బ్రతికించిన వాళ్ళమవుతాం. ఆ వెబ్ సైట్ పేరు మీ కోసం
Bharat Blood Bank
Bharat Blood Bank
బాలతీర్ధం
తిరుమల లో 108 తీర్ధాలు ఉన్నాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందులో బాలతీర్ధం గురించి విన్నప్పుడల్లా నాకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఆ బాలతీర్ధం లోని జలం సేవిస్తే ముసలివాళ్ళు, బాలలు (యవ్వనవంతులు) గా మారతారని, ఇక ఎపుడూ వృద్ధాప్యం దరి చేరదని అంటారు. ఆ తీర్ధాన్ని సర్పాలు ఎల్లప్పుడూ కావలి కాస్తూ ఉంటాయని కూడా అంటారు. కానీ అలా అందరూ బాలలు గా మారితే సృష్టి కి అవరోధం అవుతుంది అని దానిని పెద్ద పెద్ద బండల తో మూసివేశారని చెప్తారు. నిజం గా ఆ జలం తాగితే బాలలు గా మారతారా? ఏమో అంతా ఆ శ్రీవారికే తెలియాలి.
శ్రీ కృష్ణ నిర్యాణం
కురుక్షేత్ర సంగ్రామం అనంతరం, ఒకనాడు కణ్వ, విశ్వామిత్ర , నారద మహర్షులు శ్రీ కృష్ణుని సందర్శనార్దం ద్వారకకు విచ్చేశారు. వీరు పురవీధుల్లో సంచరిస్తూ ఉండగా కొందరు ద్వారక యువకులకు చిలిపి ఊహ తట్టింది. ఆ యువకులు ఒకడికి స్త్రీ వేషం వేసి ఆ మునుల వద్దకు తీసుకుని పోయి ఈ చిన్నదానికి ఆడ బిడ్డ పుడతాడో , మగ బిడ్డ పుడతాడో చెప్పమన్నారు. ఆ మహర్షులు అమాయకులు కాదు కదా, దివ్యదృష్టి తో మొత్తం కనుక్కుని ఆగ్రహం తో, ఆడబిడ్డా కాదు మగబిడ్డా కాదు ఒక ముసలం(రోకలి) పుడుతుంది, అది మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ విషయం శ్రీ కృష్ణునికి తెలిసింది. విధి రాత ను ఎవరూ తప్పించలేరు, యాదవ వంశానికి కాలం చెల్లింది అనుకున్నాడు.
మహర్షుల తపశ్శక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది. ఆ యువకులు దానిని శ్రీ కృష్ణుని వద్దకు తీసుకుపోయారు. శ్రీ కృష్ణునికి అది యాదవ వంశాన్ని నాశనం చేసే ఆయుధం లా కనిపించింది. దానిని పిండి చేసి సముద్రం లో కలపమని ఆ యువకులకు చెప్పాడు. వారు దానిని పిండి చేసి సముద్రం లో కలిపారు. చివరగా ఒక ముక్కను అరగదీయలేక దానిని సముద్రం లోనికి విసిరివేశారు. పిండి చేసిన ముసలం మనల్ని ఎలా నాశనం చేస్తుంది లెమ్మని సంతోషం గా ఇళ్ళకు పోయారు. కానీ మునుల వాక్కు వృధా పోదు కదా. మిగిలిన ఆ రోకలి ముక్క తీరానికి కొట్టుకు వచ్చి ఒకానొక చోట ఇసుకలో దిగబడింది. సముద్రంలో కలిసిన రోకలి పిండి బడబాగ్ని వలె కాచుకుని ఉంది. శ్రీ కృష్ణునికి ఇవన్నీ తెలిసినా విధి రాతను తప్పించే శక్తి లేక మిన్నకుండి పోయాడు.
అది మొదలు ద్వారక నగరం లో అనేక ఉత్పాతాలు సంభవించాయి. ఎపుడూ లేని విధంగా యాదవులు సజ్జనలును బాధించడం మొదలుపెట్టారు. స్త్రీలు భ్రష్టు పట్టిపోతున్నారు. యాదవవంశ నాశనం దగ్గరలోనే ఉందని కృష్ణునికి అర్ధం అయ్యింది. తను ఎంతో ప్రేమించే ద్వారకలో యాదవులు నాశనం అవ్వడం ఇష్టం లేని కృష్ణుడు యాదవులు అందరినీ కొలువుపర్చాడు. సముద్రానికి జాతర చెయ్యాలని అందరినీ బయలుదేరమని చెప్పాడు. అందరూ కావలసిన సరంజామా అంతా తీసుకుని బయలుదేరారు. బలరాముడు అరణ్యమునకు బయలుదేరాడు. శ్రీ కృష్ణుడు ఒక్కడే యాదవుల తో పాటు వెళ్ళాడు. వెళ్ళే ముందు తండ్రియైన వసుదేవునితో ఇలా అన్నాడు. "తండ్రీ! కొద్ది రోజులలో ద్వారకను సముద్రం ముంచెత్తనున్నది. అర్జునుడు వస్తాడు మిమ్ములను అందరినీ ఉద్ధరిస్తాడు. అతను వేరు నేను వేరు కాదు. అందరూ అతని ఆజ్ఞను పాటించండి."
సముద్ర తీరానికి వెళ్ళిన యాదవులు సుష్ఠుగా భోజనం చేసి, కృష్ణుని ఎదుటే మద్యం తాగి ఒకరిలో ఒకరు కలహించుకోసాగారు. అన్నీ తెలిసినా కృష్ణుడు ఏమీ చెయ్యలేని వాడయ్యాడు. అంతలో ఒకడు ఆనాడు సముద్ర తీరంలో దిగబడిన రోకలి తుంగను తీసుకుని ఒకడిని మోది చంపేశాడు. అది మొదలు అందరూ ఒకరిని ఒకరు చంపుకున్నారు.
మిగిలిన దారుకుడిని, భబ్రుడిని తీసుకుని బలరాముడు ఉన్న చోటికి బయలుదేరాడు శ్రీ కృష్ణుడు. అక్కడ బలరాముడు అరణ్యం లో ధ్యానం లో ఉన్నాడు. అపుడు శ్రీ కృష్ణుడు అర్జునుడి ని ద్వారకకు తీసుకురమ్మని దారుకుడిని పంపాడు. భబ్రుడి ని ద్వారకలోని స్త్రీలను, మిగిలిన వాళ్ళని ప్రయాణమునకు సిద్దం చెయ్యమని పంపాడు. కానీ మార్గమధ్యం లో ఒక ఆటవికుడు అతనిని అదే రోకలి తుంగ తో సంహరించాడు.
దారుకుడు ఏడుస్తూ పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అతనిని ఆ పరిస్థితి లో చూసి పాండవులు చలించిపోయారు. అపుడు దారుకుడు జరిగిన విషయం చెప్పి బలరామకృష్ణులు అరణ్యం లో ఉన్నారని, అర్జునుడుని ద్వారకకు తీసుకువెల్లమన్నారని చెప్పాడు. అది విని పాండవులు ఆశ్చర్యపోయారు. శ్రీ కృష్ణ భగవానుడు అచట ఉండగా ఇలా ఎందుకు జరిగిందా అని చాలా భాధపడ్డారు. అర్జునుడు వెంటనే ద్వారకకు పయనమయ్యాడు.
అచట అరణ్యంలో బలరాముడు తన దేహమును విడిచి తన అంశ అయిన మహా సర్ప రూపం ధరించి సముద్రం లో కలిసిపోయాడు. తన అన్న లేని లోకంలో ఉండటం వృధా అని తలచి, తను చెయ్యవలసిన పనులు కూడా ఏమీ లేవని గ్రహించి తన శరీరం వదలడానికి ఏమి కారణం దొరుకుతుందా అని వేచి చూడసాగాడు. ఒకనాడు తనకు అరికాలితో మరణం సంభవిస్తుందని దుర్వాస మహాముని శాపం ఇవ్వడం గుర్తుకువచ్చింది. అపుడు శ్రీ కృష్ణుడు ఒక మహా వృక్షం నీడన మేను వాల్చి, అక్కడకు వస్తున్న ఒక బోయవానికి, తన పాదం లేడి పిల్ల లాగా భ్రమింపచేశాడు. అది తెలియని బోయవాడు గురి చూసి కృష్ణుని పాదానికి బాణం వదిలాడు. తర్వాత వచ్చి చూసి దేవదేవుడైన వాసుదేవునికా నేను బాణం వేసింది అని రోదించడం మొదలు పెట్టాడు. శ్రీ కృష్ణుడు అతనిని ఓదార్చి ఇలా అన్నాడు. "త్రేతాయుగాన వాలి వైన నిన్ను చెట్టు చాటునుండి చంపిన ఫలితం ఇపుడు అనుభవిస్తున్నాను. కర్మ ఫలమును భగవంతుడైనను అనుభవించవలసినదే. నీవు నిమిత్తమాత్రుడవు." అని శ్రీ కృష్ణుడు తన శరీరమును త్యజించాడు.
ద్వారకకు చేరుకున్న అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకను చూసి ఖిన్నుడయ్యాడు. శ్రీ కృష్ణుడి ప్రియ సఖుడైన ఆర్జునుడిని చూడగానే శ్రీ కృష్ణుని భార్యలు పలు విధాల రోదించారు. వసుదేవుడు శ్రీ కృష్ణుడు తనకు చెప్పినదంతా అర్జునుడికి చెప్పి తన యోగనిస్ఠ తో శరీరం వదిలాడు.
వసుదేవుని మరణవార్త శ్రీ కృష్ణునికి చేరవేయడానికి అర్జునుడు అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యం లో శ్రీ కృష్ణ భగవానుని మృతదేహం చూసి కన్నీళ్ళ పర్వంతం అయ్యాడు. మృతదేహానికి చెయ్యవలసిన కార్యక్రమాలు చేసి తను ద్వారకకు పయనమయ్యాడు. సిద్ధంగా ఉన్నవారిని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు. అర్జునుడు ద్వారక విడిచిన మరుక్షణం అప్పటివరకు కాచుకుని ఉన్న సముద్రం ద్వారకను ముంచెత్తింది.
ఇపుడు సముద్రం లో బయటపడిన ద్వారక అదేనని అధికుల విశ్వాసం.
గమనిక:- నేను ఎపుడో ఒకసారి చదివిన విషయాన్ని గుర్తు ఉన్నంతవరకు రాశాను. తప్పులు ఉంటే మన్నించగలరు.

Subscribe to:
Posts (Atom)