నటీనటులు: యన్.టి,ఆర్, జమున.
పల్లవి:
నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసానీ
కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామీ... నిన్నే నా స్వామీ...
నన్ను దోచుకుందువటే ..........
చరణం1:
తరియుంతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియుంతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండ వోలె కర్పూర కళిక వోలె ....... కర్పూర కళిక వోలె
ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు
ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు
కలకాలం వీడని సంకెలను వేసినావు.... సంకెలను వేసినావు. (నన్ను దోచుకుందువటే.. )
చరణం 2:
నా మదియే మందిరమై..... నీవే ఒక దేవతవై...
నా మదియే మందిరమై..... నీవే ఒక దేవతవై...
వెలసినావు నాలో.. నే కలిసిపోదు నీలో...... కలిసిపోదు నీలో......
ఏనాటిదో మన బంధం .... ఎరుగరాని అనుబంధం
ఏనాటిదో మన బంధం .... ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా ఇది ఇరిగిపోని గంధం..... ఇరిగిపోని గంధం..... (నన్ను దోచుకుందువటే)
0 comments:
Post a Comment