రతన్ టాటా ను లంచం అడిగిన కేంద్ర మంత్రి!

డెహ్రడూన్  లో జరిగిన ఒక కార్యక్రమం లో రతన్ టాటా పాల్గొన్నారు. అక్కడ ఒక విలేఖరి 'మీరు పౌర విమానయాన రంగం లోనికి ఎందుకు ప్రవేశించలేదు' అని అడిగిన ఒక ప్రశ్న కి ఆయన కింది విధంగా సమాధానమిచ్చారు.

'విమానయాన రంగం లోనికి ప్రవేశించాలని టాటా గ్రూప్ 1995 , 1997 , 2001 లో మూడు సార్లు ప్రయత్నించింది. అపుడు ఒక కేంద్ర మంత్రి 15 కోట్లు లంచం అడిగారు, లంచం ఇవ్వడం ఇష్టం లేని టాటా గ్రూప్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అపుడు లంచం ఇచ్చి ఉంటే టాటా గ్రూప్ ఎపుడో విమానయాన రంగం లో ఉండేది.'

కానీ ఆయన ఆ మంత్రి పేరు  వెల్లడించలేదు. ఆ మంత్రి పేరు వెల్లడించాలని, ప్రధానమంత్రి దీనిపై C .B .I విచారణ జరిపించాలని కొందరు పట్టుబడుతున్నారు.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ