హైదరాబాద్ లో మొసలి పట్టివేత!

హైదరాబాద్ నానక్‌రాంగూడ సెల్లార్ గుంతలో కొద్ది రోజుల క్రితం కనిపించిన మొసలి ని పట్టుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. మొసలి ని పట్టుకునేందుకు అధికారులు కొద్దిరోజులుగా గుంతలోని నీటిని మోటార్లు తో తోడుతున్నారు. గుంతలో నీరు తగ్గిపోవడంతో ఉదయం మొసలి తప్పించుకుని బయటకు వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికుడు అధికారులకు తెలియచేయగా కొన్ని గంటలపాటు అధికారులు కష్టపడి దగ్గర లోని పొదల్లో మొసలి బంధించి, జూపార్క్ కు తరలించారు. అసలు ఈ గుంతలోకి మొసలి ఎలా వచ్చిందో అర్ధంకావడంలేదని  స్థానికులు అంటున్నారు. ఎట్టకేలకు మొసలి ని బంధించడం తో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ