ఊహలు గుసగుసలాడే నా హ్రుదయము ఊగిసలాడే

చిత్రం: బందిపోటు
నటినటులు: యన్.టి.ఆర్

పల్లవి:
ఊహలు గుసగుసలాడే నా హ్రుదయము ఊగిసలాడే
ప్రియా

ఊహలు గుసగుసలాడే నా హ్రుదయము ఊగిసలాడే

చరణం 1 :
వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే అది నీకు ముందే తెలుసు (ఊహలు గుసగుసలాడే..)

చరణం 2 :
నను కోరి చేరిన బేలా.... దూరాన నిలిచేవేలా
నను కోరి చేరిన బేలా.... దూరాన నిలిచేవేలా
నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా (ఊహలు గుసగుసలాడే..)

చరణం ౩:
దివి మల్లెపందిరి వేసే.... భువి పెళ్ళిపీటను వేసే..
దివి మల్లెపందిరి వేసే.... భువి పెళ్ళిపీటను వేసే..
నెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెళ్ళిని చేసే (ఊహలు గుసగుసలాడే...)4 comments:

Anonymous said...

ఎనకమాల ఆడియోసాంగ్ కూడా ప్లేచెయ్యాల

నాని said...

Try chestanu andi

Anonymous said...

అడి యో సాంగ్ కోసం పోతే వి డి యో సాంగ్ దొరికినట్టు .బావుంది నాని .keep going

నాని said...

thanq

Post a Comment

Copyright © ఆకాశ గంగ