నోబెల్ బహుమతి అందుకునే చేతులు కరువు?

నోబెల్ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ఈసారి 2010  సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని  అందుకునే చేతులు కరువయ్యాయి. చైనా ప్రజాస్వామ్యం పై జరిపిన పోరాటానికి గాను ఉద్యమ నేత లియూ జియాంబోకు శాంతి నోబెల్ బహుమతి ప్రకటించారు. బహుమతి ప్రకటించినపుడు ఆయన జైలులో ఉన్నారు. ఇపుడిపుడే ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. పోనీ అయన తరపున ఆయన కుటుంబసభ్యులు కూడా అందుకునే పరిస్థితులు కనిపించడంలేదు. కావున ఈ సారి శాంతి నోబెల్ ప్రదాన కార్యక్రమం రద్దు కావచ్చునని భావిస్తున్నారు. చైనా ప్రభుత్వం మనసు మార్చుకుని కనీసం అవార్డు ప్రధానోత్సవనికైనా ఆయనను తీసుకువస్తే బావుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ