బాలతీర్ధం

తిరుమల లో 108 తీర్ధాలు ఉన్నాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందులో బాలతీర్ధం గురించి విన్నప్పుడల్లా నాకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఆ బాలతీర్ధం లోని జలం సేవిస్తే ముసలివాళ్ళు, బాలలు (యవ్వనవంతులు) గా మారతారని, ఇక ఎపుడూ వృద్ధాప్యం దరి చేరదని అంటారు. ఆ తీర్ధాన్ని సర్పాలు ఎల్లప్పుడూ కావలి కాస్తూ ఉంటాయని కూడా అంటారు. కానీ అలా అందరూ బాలలు గా మారితే సృష్టి కి అవరోధం అవుతుంది అని దానిని పెద్ద పెద్ద బండల తో మూసివేశారని చెప్తారు. నిజం గా ఆ జలం తాగితే బాలలు గా మారతారా? ఏమో అంతా ఆ శ్రీవారికే తెలియాలి.

0 comments:

Post a Comment

Copyright © ఆకాశ గంగ