సెలవులలో మీ పిల్లలకు ఏమి నేర్పించాలి?

సాదారణంగా పిల్లల జీవితంలో సెలవులు అనేవి చాలా అద్భుతమైన మరియు ఎదురుచూస్తున్న సమయంగా ఉంటాయి. పిల్లల రోజూవారీ జీవితం పాఠశాల,అదనపు తరగతులతో మరియు హోంవర్క్,పరీక్షల భారంతో ఉంటుంది. పిల్లలు సెలవుల సమయంలో మాత్రమే ఎటువంటి నియమాలు లేకుండా ఆటలు ఆడుకొని ఆనందిస్తారు. కానీ,సెలవులను కేవలం ఫన్ మరియు క్రీడలతో వృధా చేయకూడదు. తల్లిదండ్రులు వారి పిల్లలను బిజీగా ఉంచాలి.అంతేకాక వారి మనస్సులలో ఏదో ఒక ఆలోచన వచ్చేలా చేయాలి. 

సెలవుల్లో TV చూడటం మరియు కంప్యూటర్ గేమ్స్ ఆడటం వంటి వాటితో ఎక్కువ సమయం గడపకూడదు. అయితే వారికీ ట్యూషన్ మరియు హాబీ క్లాసులు పెద్ద భారం మరియు ఒత్తిడి కాకుండా ఉండేలా చూడాలి. సెలవుల సమయంలో పిల్లలకు నేర్పటానికి కొన్ని విషయాలు క్రింద వివరించబడ్డాయి: -

1. స్విమ్మింగ్
 పిల్లలు తప్పనిసరిగా స్విమ్మింగ్ చేయాలి. స్విమ్మింగ్ అనేది సరదాగా చేసే ఒక వ్యాయామం వంటిది అని చెప్పవచ్చు. ఇది సెలవుల్లో మీ పిల్లలకు నేర్పడానికి ఒక విషయంగా చెప్పవచ్చు. పిల్లల కోసం స్విమ్మింగ్ పాఠాలు సెలవుల సమయంలో అందుబాటులో ఉంచాలి. స్విమ్మింగ్ అనేది ఒక అలసిపోయే వ్యాయామం వలె ఉంటుంది. దీనిని నేర్చుకోవటానికి సెలవులు ఉత్తమ సమయం అని చెప్పవచ్చు.

2. ఆర్ట్&క్రాఫ్ట్
 ఆర్ట్&క్రాఫ్ట్ పాఠాలు మీ పిల్లల మనస్సులను విస్తృతం చేస్తాయి. ఈ తరగతుల వలన పిల్లల ఊహాత్మక ద్వారాలు తెరిచి వారి ఆలోచనలను మెరుగుపరుస్తాయి. వాటిలో డ్రాయింగ్,స్కెచ్చింగ్,వివిధ రకాల చిత్రాలు మొదలైన ముఖ్యాంశాలను చేర్చవచ్చు.

 3. డాన్స్
 మీ పిల్లలు గ్రూవ్ కలిగి ఉంటే సెలవుల సమయంలో డాన్స్ నేర్పించవచ్చు. డాన్స్ ఎల్లప్పుడూ తాజాదనం మరియు శక్తిని ఇస్తుంది. డాన్స్ పాఠాలు నేర్చుకోవటం వలన క్రమశిక్షణ మరియు పని మీద దృష్టి కలగటానికి సహాయం చేస్తుంది. 

4. సంగీతం
 సంగీతం అనేది సెలవుల సమయంలో మీ పిల్లలకు నేర్పడానికి ఒక ఉత్తమ విషయంగా ఉంది. సంగీతంలో గానం మరియు వివిధ సంగీత పరికరాలను వాయించటం రెండింటిని నేర్చుకోవచ్చు. సంగీతం కూడా పిల్లల మనస్సు మరియు ఆత్మ ప్రశాంతంగా ఉండెటట్లు చేస్తుంది. సంగీతం పాఠాలు బోధించడానికి సహనం ఉండాలి. మీ పిల్లలకు సంగీతం మరియు గానంలలో ఆసక్తి ఉంటే ప్రోత్సహించండి. 

5. శిబిరాలు మరియు సెలవులు 
మీ పిల్లలకు నిర్వహణ పాఠాలు బోధించడానికి కుటుంబం వెకేషన్ లేదా ఒక వేసవి శిబిరంనకు తీసుకోని వెళ్ళవచ్చు. మీ పిల్లలను శిబిరాలకు పంపితే వారు తమ సొంత వస్తువులు మరియు నగదును నిర్వహణ చేయుట,ఒంటరిరిగా ఎలా జీవించాలో తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. కుటుంబ వెకేషన్ కు వెళ్ళినప్పుడు మీరు యాత్ర ప్రాముఖ్యతను మరియు గమ్యం వివరాలను పిల్లలకు తప్పనిసరిగా చెప్పాలి.

1 comments:

Anonymous said...

Good ideas....

Post a Comment

Copyright © ఆకాశ గంగ