ఇది ఎపుడు జరిగిందో నాకు తెలియదు. రాత్రి టి.వి లో చూశాను. ఊరి పేరు తెలియదు (తమిళనాడు అనుకుంటాను). అక్కడ తిరుమల భగవానుని దేవాలయం ఉంది. అక్కడ 200 సంవత్సరాల క్రితం ఒక సిద్ధుడు ఉండేవాడట. అతను చాలా మహిమలు కలవాడని ప్రసిద్ధి. అతను అక్కడ ఒకానొక చోట, ఒక గిన్నెలో పంచదార వేసి తాడు ఆధారంగా ఉట్టి కట్టాడట. ఆ తాడు మెల్లిగా కిందకు జరుగుతూ, ఉట్టి ఎపుడైతే భూమికి అంటుకుంటుందో అపుడు ప్రళయం వచ్చి ఈ భూమండలం నాశనం అవుతుందని చెప్పాడట. ఆయన చెప్పినట్లే ఆ ఉట్టి కిందకు దిగుతూ వచ్చింది. ప్రళయ కాలంలో ఆ తిరుమల భగవానుడు అవతరించి దుష్టశిక్షణ చేస్తాడట. ఇపుడు ఆ ఉట్టికి, భూమికి మధ్య అర అంగుళం మాత్రమే ఖాళీ ఉంది. అది కూడా అయిపోతే ఈ భూమి అంతం అయిపోతుందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారని నిన్న టి.వి లో ప్రసారం చేశారు. అసలు ఉట్టికి, ప్రళయం రావడానికి సంబంధం ఏమిటో?
అంతేకాదండోయ్ ఇంకో విషయం కూడా ఉంది. 200 సంవత్సరాల క్రితం ఆ తిరుమల భగవానుడు ఉపయోగించిన మంచం ఇంకా అక్కడే ఉందట. అక్కడి పూజారులు దానిని గాలి కూడా చొరబడని గదిలో ఉంచి, రోజూ రాత్రి పూజ అవగానే, ఆ మంచం మీద శుభ్రమైన ధవళ వస్త్రం తో పక్క వేసి , దాని మీద పువ్వులు పెట్టి, పూజ చేసి, తలుపులు మూసి వెళతారట. తెల్లవారుజామున తలుపులు తీసి చూస్తే ఆ పక్క మీద ఎవరో విశ్రమించినట్లుగా, పక్క నలిగినట్లు ఉంటుందట. ఆ తిరుమల భగవానుడే వచ్చి విశ్రమించి వెలుతున్నట్లుగా అక్కడి ప్రజలు విశ్వశిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
ఉట్టి నేల తాకకుండ దాని కింద ఓ 5అడుగుల గోయి తీయాలి. ఈమాత్రం తెలియని బుర్రలేని జాతి అంతరిస్తుందని ఆ సిద్ధుడి ఉద్దేశ్యం.
hahaha baga chepparu.
ఏవడు జీ తెలుగు వాడేనా? రోజూ రాత్రి 11 కి వస్తుంది అనుకుంటా ఇలాంటిది ఏదో.
Taara
avunu meeru cheppindi correcte
Madhu
Post a Comment