అశ్లీల, అభ్యంతరకర టీవీ కార్యక్రమాలపై..............

అశ్లీల, అభ్యంతరకర టీవీ కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వివాదాస్పదంగా మారిన ‘బిగ్‌బాస్’, ‘రాఖీ కా ఇన్సాఫ్’ కార్యక్రమాలను ఇకపై రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల లోపు ప్రసారం చేయాలని వాటిని ప్రసారం చేస్తున్న చానళ్లను బుధవారం ఆదేశించింది. ఈమేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నగ్నదృశ్యాలను ప్రసారం చేస్తున్న ఎస్‌ఎస్ మ్యూజిక్ చానల్‌ను వారం రోజులు నిషేధించింది. ‘కలర్స్ చానల్‌లో వస్తున్న బిగ్‌బాస్, ఎన్డీటీవీ ఇమాజిన్ చానల్‌లో వస్తున్న రాఖీ కా ఇన్సాఫ్‌లు అందరూ చూడడానికి ఉద్దేశించినవి కావు. వీటిని ఎక్కువ మంది టీవీ చూసే సమయం(ప్రైమ్ టైమ్)లో ప్రసారం చేయొద్దు’ అని పేర్కొంది. బిగ్‌బాస్‌లో పాల్గొంటున్న వారు తరచూ గొడవలు పడుతూ బూతులు మాట్లాడుతున్నారని, ముష్టి యుద్ధాలకు దిగుతూ, వ్యక్తిగత విషయాలు బట్టబయలు చేస్తున్నారని తెలిపింది.

ఈ కార్యక్రమాలను పునఃప్రసారం కూడా చేయొద్దని ఆదేశించింది. తమ చానల్‌లో ప్రసారం చేస్తున్న వాటిలో అశ్లీల దృశ్యాలేమీ లేవంటూ ఎస్‌ఎస్ చానల్ ప్రతినిధి చెప్పారు. కొన్ని పాటల విజువల్స్‌ను చూపగా, అవి అశ్లీలమైనవేనని ఆయన అంగీకరించారు. అయితే వాటిని తమ చానల్‌లో ఎప్పుడూ ప్రసారం చేయలేదని చెప్పారు. అశ్లీల కార్యక్రమాలపై కొరడా ఝళిపించాలని సోమవారం జరిగిన అంతర్ మంత్రిత్వశాఖల సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో హోంశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, విదేశాంగ శాఖ, సమాచార ప్రసారాల శాఖల అదనపు కార్యదర్శులు పాల్గొన్నారు.

2 comments:

Anonymous said...

ఈ మాటర్ పొద్దున్నే సాక్షి పేపర్లో వచ్చినదే .కొత్త విషయాలేమైనా రాయండి .

Anonymous said...

Big Boss got a stay from Bombay High Court !!

Post a Comment

Copyright © ఆకాశ గంగ