రావణాసురుడు బ్రాహ్మణుడా? రాక్షసుడా?

రావణుడు బ్రాహ్మణుడు అంటారు కదా, మరి అతను రాక్షస రాజు ఎలా అయ్యాడు? ఒకవేళ అతను రాక్షసుడే అయితే బ్రాహ్మణత్వం ఎలా వచ్చింది?

8 comments:

Anonymous said...

బ్రాహ్మణులూ రాక్షసులే , మాలమాదిగలు ఆర్యులు

Anonymous said...

ఆర్యులంటే మధ్య అసియా నుండి వలస వచ్చిన ఆదిమజాతుల వారు కధా !

Unknown said...

Ravana was born to a great sage Vishrava (or Vesamuni), and his wife, the daitya princess Kaikesi. He was born in the Devagana gotra, as his grandfather, the sage Pulastya, was one of the ten Prajapatis or mind-born sons of Brahma and one of the Saptarishi (Seven Great Sages Rishi) in the first Manvantara. Kaikesi's father, Sumali (or Sumalaya), king of the Daityas, wished her to marry the most powerful being in the mortal world, so as to produce an exceptional heir. He rejected the kings of the world, as they were less powerful than him. Kaikesi searched among the sages and finally chose Vishrava, the father of Kubera. Ravana was thus partly Brahmin and partly Daitya.

From wikipedia...

Anonymous said...

అసలు ఆర్య ద్రావిడ కబుర్లు అబద్దం కదా. ఈ మధ్య దళితులు రాక్షసులు పైగా చక్రవర్త్లు అంటూ కొందరు కథలను ప్రచారం చేస్తున్నారు అవీ నమ్మశక్యమ్ గా లేదు. నిజంగా ద్రావిడులు ఉన్నారనుకుంటే ఆ రాక్షసులలో చక్రవర్తులూ వున్నది నిజమైతే రెడ్డిలు లాంటి వాళ్ళు ఐ ఉమ్టారు వాళ్ళలొనే ఆ రాక్షతత్వం, నాయకత్వ లక్షనాలు ఉంటాయి.

Anonymous said...

బ్రహ్మ రాక్షసుడు

Anonymous said...

మొదటి, పై అనానిమస్ చెప్పిందే నిజం. కాదన్న వాడు రాక్షసుడు. దళిత హిరణ్యకశిపుడు ఆర్యుడు. ప్రహ్లాదుడు దానవుడు.

పూర్ణప్రజ్ఞాభారతి said...

పురాగాథలలోని, పురాణాలలోని పాత్రలకు ప్రస్తుత కాలంలోని కుల వ్యవస్థ చట్రాన్ని అంటగట్టడం మనకు ఈమధ్యకాలంలో తరచు కనిపిస్తున్నదే. ఇక రావణాసురుని విషయానికి వస్తే
1. రావణ అనేది అతను అరిచిన పెద్ద అరుపు కారణంగా వచ్చిన బిరుదు. ఇలా బిరుద నామాలే ప్రఖ్యాతం కావడం మనం ఇతరుల విషయంలో కూడా గమనించవచ్చు. హనువుకు ఘాతం కలిగిన కారణంగా ఆంజన కుమారుడైన ఆంజనేయునికి హనుమంతుడు అని పేరు వచ్చింది. అలాగే రావణునికి కైలాస పర్వత ఉత్ఖనన సమయంలో అతడు రోదించిన బిగ్గరదైన రావం (అరుపు) కారణంగా రావణుడు అనే పేరు వచ్చింది. అది అతని అసలు పేరు కాదు.
2. రావణుడు పులస్త్యని వంశంలో జన్మించిన ముని కుమారుడు. కాబట్టి కులగతంగా అతను బ్రాహ్మణుడే. ఇది దాదాపు అందరూ అంగీకరించిన సత్యమే. ఇక తల్లి తరఫున అతను దైత్యుడు. అంచే దితిగారి సంతానం. దితి కూడా బ్రాహ్మణపత్నియే. కాబట్టి దైత్యులు కూడా కులగతంగా బ్రాహ్మణులే. కాబట్టి అమ్మ తరఫున, నాన్న తరఫునా రొండు వైపులా రావణుడు బ్రాహ్మణ కులానికి చెందినవాడే.
3. ఇక రాక్షసుడు కావడం విషయానికి వస్తే.... వయం రక్షామః అనే నియమం కలిగిన వారు రాక్షసులు. ఇందుకుగాను ఆయుధధారులు కావడం, యుద్ధకళలు నేర్చుకోవడం, శారీరిక బలాన్ని, మంత్ర యంత్ర బలాన్ని పెంచుకోవడం ఈ రాక్షసుల విధులు. అందుకే అన్ని పురాణాలలోనూ పేరుమోసిన రాక్షసులందరూ తపస్సులు చేసి వరాల ద్వారా అజేయమైన బలాన్ని సంపాదించారు. వీరు సురాపానానికి వ్యతిరేకులు. కాబట్టే వీరిని అసురులు అంటారు. శుక్రాచార్యుని ఆదేశం మేరకే వీరు తమ అన్నలైన సురులు సేవించే సురను వదిలిలేశారు. రావణుడు కూడా ఈ వయం రక్షామః (మేం రక్షిస్తాం) అనే నియమాన్ని స్వీకరించి లంకానగర పౌరుల రక్షణను స్వీకరించిన వ్యక్తి. ఈ లంకను ఇతను అన్నయైన కుబేరుని నుంచి బలప్రయోగంతో తీసుకున్నాడు. వారి రక్షణ స్వీకరించారు. అంటే ఇంగ్లీషులో ప్రొటెక్టర్ అన్నమాట. అందుకే రావణుడు రాక్షసుడు అయ్యాడు. అసురుడు అయ్యాడు.
4. ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్రాహ్మణుడైన వ్యక్తి రాక్షసత్వాన్ని (శారీరిక, మంత్ర, యంత్ర బలంతో రక్షణ కార్యక్రమాల్ని) తన వృత్తిగా స్వీకరిస్తే అతనిని బ్రహ్మరాక్షసుడు అని అంటారు. ఈ బాధ్యతను వదిలించుకోవడమే బ్రహ్మరాక్షసులు మళ్లీ బ్రాహ్మణులుగా మారిపోయారనే శాపవిమోచన కథల తాత్పర్యం. రక్షణ వంటి మంచి పనులు చేయడం శాపం ఎందుకౌతుంది అని ప్రశ్నించుకోవాలి మనం. రక్షణ బాధ్యతలు తీసుకున్న వ్యక్తి ఎవ్వరినీ పూర్తిగా విశ్వసించలేడు. ఎవ్వరినీ తన స్వంతవారిగా చూసుకోలేడు. బలం అధికారాన్ని కట్టబెడుతుంది. కాబట్టి మనస్సు పక్కదార్లు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్షణ బాధ్యతల్లో జీవితాన్ని గడపడం అంటే వ్యక్తిగత జీవితానికి, వైయ్యక్తిత భావాలకు తిలోదకాలు వదలడమే. అందుకే అది శాపం. అందుకే తపస్సులతో మహాశక్తులు సాధించిన రాక్షసులు అహంకారంతోనో, అధికారమదంతోనో, అవినీతి కార్యక్రమాల వల్లనో మరణాన్ని పొందారే తప్ప సహజ మరణాలు పొందిన వారు తక్కువగా మనకు పురా సాహిత్యంలో కనిపిస్తారు.

సినిమాల్లో రాక్షసులు అంటే నల్లగా, ఎత్తుగా, కొమ్ములతో చూపిస్తున్నారు కాబట్టి వాళ్ల ఆకారం అలా ఉంటుందని వాళ్లు మామూలు మనుష్యుల కన్నా భిన్నంగా ఉంటారని మనం భావిస్తున్నాం. అది నిజం కాదు. రావణుడు అందగాడు. సుందరకాండలో లంకలో ప్రవేశించిన హనుమ అంతఃపురంలో స్త్రీల మధ్యలో శయనించి ఉన్న రావణుని చూసి ఈ అందగానితో భార్యగా మారడానికి ఏ స్త్రీ కోరుకోదు. సీతమ్మకూడా అలా ఆయన భార్యగా మారిపోయిందేమో అని అనుమానించాడు. అశోకవనంలో ఆమెను చూసి అభిప్రాయం మార్చుకున్నాడు అది వేరే సంగతి. అంటే రావణుడు స్త్రీల మోహం కలిగించే అందగాడని వాల్మీకే స్వయంగా చెప్పిన విషయం సుందరకాండలో మనం హనుమ నోటి వెంట వినవచ్చు.

కాబట్టి ఈ రోజు మనం అనుకునే రాక్షసరూపం ఆయనకు లేదు. అది కుహనా జ్ఞానులు, కుహనా మేథావులు వ్యాప్తిలోకి తీసుకువచ్చిన విషయం. మూలగ్రంథాలను చదివే అలవాటు, తీరికా లేని ఇలాంటి మేథావులే ఇలాంటి తిక్క విషయాలను వ్యాప్తిలోకి తెస్తారు.

ఇప్పుడు కులాల వారీగా తెలివి పెరిగిపోతున్నది కాబట్టి దేవతల చేతిలో చచ్చినవారంతా దళితులని, రాక్షసులు అంటే దళితులను విపరీతార్థాలను వ్యాప్తిలోకి తీసుకువస్తున్నారు నేటికాలపు పరిశోధకులు, మేథావులు అనుకునే కొందరు అతి తెలివైన వారు.

ఇక ముగింపుగా రావణుడు బ్రాహ్మణుడే. రాక్షసుడే. బ్రాహ్మణత్వం జన్మణా వచ్చినది. రాక్షసత్వం బాధ్యతగా అంగీకరించినది.

రాజేష్ జి said...

Thanks you very much Panditji for investing your invaluable time and sharing the information to us.
Highlighted points would be,

$మూలగ్రంథాలను చదివే అలవాటు, తీరికా లేని ఇలాంటి మేథావులే ఇలాంటి తిక్క విషయాలను వ్యాప్తిలోకి తెస్తారు.

literally true.

$ఇప్పుడు కులాల వారీగా తెలివి పెరిగిపోతున్నది కాబట్టి దేవతల చేతిలో చచ్చినవారంతా దళితులని, రాక్షసులు అంటే దళితులను విపరీతార్థాలను వ్యాప్తిలోకి తీసుకువస్తున్నారు నేటికాలపు పరిశోధకులు, మేథావులు అనుకునే కొందరు అతి తెలివైన వారు.

మరి వారి పప్పులు(ఆర్య-ద్రవిడ) ఉడకాలంటే మరి రావణుడు దళితుడు అవ్వాల్సిందే!!!

పండిట్ జీ, మీరు ఇలా మీకు తెలిసిన వాస్తవాలని పంచుకోవాలని కోరుకుంటున్నా.

Post a Comment

Copyright © ఆకాశ గంగ