మన డబ్బు మనమే ముద్రించవచ్చా?

క్షమించాలి, ఇది చాలా సిల్లీ ప్రశ్న లా ఉండవచ్చు, ఈ మాత్రం తెలియదా అనిపించవచ్చు, కానీ నాకు నిజం గా తెలియకే అడుగుతున్నాను. మనం చాలా అప్పుల్లో ఉన్నాం, ఖజానా ఖాళీగా ఉంది అంటుంటాం. కానీ మన రిజర్వ్ బ్యాంక్ కు డబ్బు ముద్రించే (టంకశాల) రైట్స్ ఉన్నాయి కదా, మనకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ముద్రించుకుని మన దేశ ప్రగతి కి ఉపయోగించవచ్చును కదా, ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకోవడం దేనికి?

4 comments:

Anonymous said...

మీరన్నట్లు కూడా చేస్తారు. కానీ చెలామణిలోంచి బయటికి వెళ్ళిపోతున్న/ ఇక పనికిరాని నోట్ల సంఖ్య ఎంతో ఆ నిష్పత్తి (ratio) లో చేస్తారు. కేంద్రప్రభుత్వానికి దేశీడబ్బు బాగా అత్యవసరమైనప్పుడు కూడా చేస్తారు. అయితే అలాంటివి చాలా తక్కువ మొత్తాల్లో చేస్తారు (ఏడాదికి సుమారు రూ. ఒకవెయ్యి - రెండువేల కోట్లకు మించకుండా).

Anonymous said...

దానికి బదులు ఇంట్లోనే ఒక అచ్చుయంత్రాన్ని కొనుక్కుని మనకి కావాల్సిన నోట్లు మనమే అచ్చు వేసుకుంటే పోలా ?kidding

Ramakrishna Bysani said...

బ్రహ్మాండంగా ముద్రించుకోవచ్చు. ప్రస్తుతం అన్ని దేశాలు చేస్తుంది అదే...అదే పనిగా ముద్రించుకుంటూ పోతే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, మన రూపాయి విలువ తగ్గిపోయి, అంతర్జాతీయ మార్కెట్ లో ఎమీ కొనలేము...జింబాబ్వే లో జరిగింది అదే
for more info

http://telugubudugu.blogspot.com/2010/11/currency-war-insight.html

Sravya V said...

ఏమిటి ఈ పోస్టు నిజం గానే రాసారా ? ఒక్క సారి గూగుల్ చేస్తే మీరే బోలెడు విషయాలు చెప్పేవారేమో . పైన రామకృష్ణ గారు చెప్పినట్లు చక్కగా ముద్రించుకోవచ్చు (ఒక నలబై ఏళ్ళ క్రితమైతే బంగారం లాంటి precious మెటల్స్ , ఆయిల్ నిల్వలు , ఎగుమతుల విలువ వీటిని పరిగణనలోకి తీసుకొనే వాళ్ళు , ఇప్పుడు అదేమీ లేదు, ఇప్పుడు అన్ని దేశాలు డిమాండ్ ఆధారం గానే ఆ పని చేస్తున్నాయి ). కాకపొతే ముద్రించటం ఎంత ఎక్కువైతే , ఆ కరెన్సీ విలువ అంత దారుణం గా పడిపోతుంది . సింపుల్ గా చెప్పాలంటే ఒక బస్తాడు నోట్లు తీసుకెళ్ళి ఒక కేజీ కూరగాయలు కొనే పరిస్తితి వస్తుంది . జింబాబ్వే తో పాటు ఇండోనేషియా కూడా దీనికో గొప్ప ఉదాహరణ , మీరు ఇండియా లో 500 పెట్టి కొనే వాచ్ అక్కడ చక్క గా ఒక లక్ష రుపియాలు ఇచ్చి కొనుకోవచ్చు :)

Post a Comment

Copyright © ఆకాశ గంగ