నటినటులు: యన్.టి.ఆర్
పల్లవి:
ఊహలు గుసగుసలాడే నా హ్రుదయము ఊగిసలాడే
ప్రియా
ఊ
ఊహలు గుసగుసలాడే నా హ్రుదయము ఊగిసలాడే
చరణం 1 :
వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే అది నీకు ముందే తెలుసు (ఊహలు గుసగుసలాడే..)
చరణం 2 :
నను కోరి చేరిన బేలా.... దూరాన నిలిచేవేలా
నను కోరి చేరిన బేలా.... దూరాన నిలిచేవేలా
నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా (ఊహలు గుసగుసలాడే..)
చరణం ౩:
దివి మల్లెపందిరి వేసే.... భువి పెళ్ళిపీటను వేసే..
దివి మల్లెపందిరి వేసే.... భువి పెళ్ళిపీటను వేసే..
నెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెళ్ళిని చేసే (ఊహలు గుసగుసలాడే...)
4 comments:
ఎనకమాల ఆడియోసాంగ్ కూడా ప్లేచెయ్యాల
Try chestanu andi
అడి యో సాంగ్ కోసం పోతే వి డి యో సాంగ్ దొరికినట్టు .బావుంది నాని .keep going
thanq
Post a Comment