బలరాముడు తిరుమల ఆలయం ను దర్శించాడా?

కురుక్షేత్ర మహా సంగ్రామ సమయం లో బలరాముడు శాంతికాముకుడై పుణ్యక్షేత్రాలను దర్శించాడని, అలా దర్శించిన వాటిలో తిరుమల ఆలయం కూడా ఉన్నదని చాలా చోట్ల చదివాను. కానీ నాకు ఒక సందేహం. బలరామకృష్ణులు ద్వాపరయుగము లోని వారు. వెంకటేశ్వరస్వామి కలియుగం లోని వాడు. ద్వాపరయుగము తర్వాత కలియుగము వస్తుంది కదా. ఇంకా మొదలవని కలియుగంలోని తిరుమల ఆలయం ని, ద్వాపరయుగము లోని బలరాముడు ఎలా దర్శించాడు. ఒకవేళ అదే నిజం అయితే తిరుమల ఆలయం ద్వాపరయుగము లో కూడా ఉందా? ఉంటే శ్రీ కృష్ణుడు బ్రతికి ఉండగానే వెంకటేశ్వరస్వామి తిరుమల లో పూజలు అందుకున్నాడా?
 నా సందేహాలను ఎవరైనా నివృత్తి చెయ్యండి దయచేసి.

2 comments:

astrojoyd said...

pl.read tirumala aalaya charitra by gopikrishna[published by ttd].the temple dated bk from tretaa yuga nd rama visited this temple sir..

said...

ఇదే కథ నేను ఈనాడు లో చదివా, తిరుమలలో వరాహస్వామి త్రేతా యుగం నుండి ఉన్నారు. ఎవరో అనువాదం లో వెంకన్న గురించి కలిపెసినట్టున్నారు.

Post a Comment

Copyright © ఆకాశ గంగ