ఒకానొక పట్టణము లో ఒక బిక్షగాడు ఉండేవాడు. వాడికి చాలా కొద్ది మొత్తములో సాగు భూమి ఉన్నది. దాని మీద ఏమీ ఆదాయం లేక యాచన చేసుకుంటూ, ఆ వచ్చిన దానిని తిని బతుకుతుండేవాడు.
వాడికి ఒక రోజూ ఒక ఇంటిలో మంచి ఆహారం దొరికినది. వాడు ఆహారాన్ని ఆ ఇంటివద్దే కడుపునిండా భుజించాడు. కడుపు నిండడం తో ఆ రోజుకి యాచన చలించి ఇంటి దారి పట్టాడు. దారిలో ఒక గృహస్థుడు వానికి కొద్దిగా పేలపిండి ఇచ్చినాడు. వానికి ఆకలి తీరి ఉండటం తో దానిని భుజింపక తనతో తీసుకుని ఇంటిదారి పట్టాడు. దారిలో ఒక చెట్టు నీడలో విశ్రమింపదలచి, తన చెంత ఉన్న ఒక గుడ్డను చెట్టు కింద పరచి, తన మేను వాల్చి, తనలో తాను ఈ విధంగా ఊహించుకోసాగాడు
"ఇపుడు నా కడుపు నిండినది కనుక ఈ పేలపిండిని సంతలో అమ్మి ఆ వచ్చిన కొద్ది మొత్తము తో కొద్దిగా నువ్వులు కొని నా భూమిలో చల్లుతాను. కొంతకాలము తరువాత అవి మంచి కాపుకు వస్తాయి. వాటిని అమ్మి ఆ వచ్చిన మొత్తము తో వడ్డీ వ్యాపారము చేసి బాగుగా సంపాదిస్తాను. అప్పటికి నాకు వివాహ వయసు కూడా వస్తుంది. బాగా డబ్బు సంపాదిస్తాను కనుక నాకు పిల్లను ఇవ్వడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. అందునుండి ఒక మంచి అమ్మాయిని ఎన్నుకుని వివాహం చేసుకుంటాను. ఎపుడైనా నా భార్య నా మాట విననిచో నేను ఊరుకోను, నా కాలితో గట్టిగా ఇలా తన్నుతాను"
అని అసంకల్పితంగా తన కాలితో పేల పిండిని తన్నాడు. అది కాస్త కింద పడి గాలికి మొత్తం ఎగిరిపోయింది. ఏదో జరుగుతుంది అని ఏదో ఏదో ఊహించుకుంటూ వాడి అత్యాశకు వాడే బలి అయ్యాడు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment