- అల్లసాని పెద్దన: 'మనుచరిత్ర' అను ప్రబంధమును రచించెను. శ్రీకృష్ణదేవరాయలకు అంకితము చేసి సత్కారము పొందెను.ఆంధ్రకవితాపితామహుడు అను బిరుదు కూడా కలదు.
- నందితిమ్మన: ఈయనను ముక్కుతిమ్మన అని కూడా అందురు. 'పారిజాతాపహరణము' అను గ్రంథమును రచించెను.
- మాదయగారి మల్లన్న: ఇతడు 'రాజశేఖరచరిత్ర' అను గ్రంథమును రచించెను.
- ధూర్జటి: శ్రీకాళహస్తి మహత్యము, శ్రీకాళహస్తీశ్వర శతకములను రచించెను
- అయ్యలరాజ రామభద్రుడు: ఇతడు రామాభ్యుదయమును రచించెను
- పింగళి సూరన: ఇతడు రాఘవ పాండవీయము అను శ్లేష కావ్యమును, కళాపూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నము అను గ్రంథములను రచించెను.
- రామరాజభూషణుడు: భట్టుమూర్తి ఇతని నామాంతరము. వసుచరిత్ర అను శ్లేష కావ్యమును, హరిశ్చంద్రోపాఖ్యానము అను ద్వర్థి కావ్యము రచించెను
- తెనాలి రామకృష్ణుడు: ఇతనికి వికటకవి అని కూడా పేరు. పాండురంగ మహత్యము అను కావ్యమును రచించెను
అష్టదిగ్గజములు
కేకు తిన్నానండి!
భార్య: ఏమండీ! రాత్రి నాకు కేకు తిన్నట్లు కల వచ్చిందండీ!
భర్త: ఓహో పొద్దున్న నాకు సబ్బుబిళ్ళ కనిపించలేదు అందుకేనా?
భర్త: ఓహో పొద్దున్న నాకు సబ్బుబిళ్ళ కనిపించలేదు అందుకేనా?
నిద్రపొయేవారిని ఎలా లేపాలి?
పెద్దగా అరిచి లేపకూడదు. పడుకున్నవాణ్ణి కుదిపి కుదిపి లేపకూడదు. ముందు మెల్లగా పిలిచి, ఆపై స్వరం పెంచి, నెమ్మదిగా చేయివేసి కదిపి లేపాలి. ఒంటరిగా నిద్రపోతున్నవారి విషయం లో మరింత జాగరూకత వహించాలి.
మనిషి నిద్రిస్తున్నపుడు ఆత్మలోని కొన్ని అంశాలు బయటకు వెళుతుంటాయి అంటారు. అందుకే అనర్ధాలు జరిగే అవకాశం ఉండుటవలన నిద్రలేపే విషయంలో అదీ అనారోగ్యంగా ఉన్నవారి విషయంలో పెద్దవారి విషయంలో జాగ్రత్త వహించాలి.
మనిషి నిద్రిస్తున్నపుడు ఆత్మలోని కొన్ని అంశాలు బయటకు వెళుతుంటాయి అంటారు. అందుకే అనర్ధాలు జరిగే అవకాశం ఉండుటవలన నిద్రలేపే విషయంలో అదీ అనారోగ్యంగా ఉన్నవారి విషయంలో పెద్దవారి విషయంలో జాగ్రత్త వహించాలి.
గంగాజలంలో అంతటి శక్తి ఉండటానికి గల కారణం ఏమిటి?
హిమాలయాల్లో పుట్టిన జలం గంగ. గంగ ప్రవహించే చాలా ప్రాంతం భూభాగంలో ఔషధ మొక్కలు ఉండటం వల్ల ఈ నీటిలో చైతన్యం కలిగించే శక్తి నిక్షిప్తమై ఉంటుంది. కలరా, అంటువ్యాధులు వంటి క్రిములు ఈ నీటిలో బ్రతకలేవు. గంగాజలం సమస్త వ్యాధులను పోగొట్టే అమృతజలమని చరకమహర్షి చెప్పారు.
తల్లితండ్రుల గొప్పతనం
తల్లితండ్రుల గొప్పదనం గురించి శాస్త్రాలలో చెప్పబడిన విధానం:
- ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి
- ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి
- ఒక్కసారి తల్లికి,తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.
- సత్యం తల్లి .............. జ్ఞానం తండ్రి.
- పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.
- ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం
- ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.
- తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే అని ధర్మశాస్త్రం చెబుతోంది. తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదు.
చతుర్విద దానములు అనగా?
చావుభయంతో భీతిల్లేవాడికి ప్రాణ అభయం ఇవ్వటమూ, రోగాలతో, రొప్పులతో భాధపడేవారికి వైద్యం చేయించడమూ, పేదవారికి ఉచితవిద్యను అందించడమూ, ఆకలితో అల్లాడేవారికి ఆహారం ఇవ్వడం. ఇవీ చతుర్విద దానాలు. ఈ దానాలు చేసిన వారికి పూర్వజన్మ పాపాలు నశిస్తాయి.
ఎపుడు అభ్యంగన స్నానం చెయ్యకూడదు?
శ్రాద్ధ దినములయందు, ఆది, మంగళ వారములు, పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, చతుర్ధశి తిధులయందు అభ్యంగన స్నానం చెయ్యరాదని శుకమహర్షి తెలియచేశారు.
శంఖం పూరించుటవలన?
గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి. ఆరునెలల పురాణ శ్రవణం వలన కలిగిన ఫలం, ఒక్కసారి శంఖం పూరించినంతనే కలుగుతుంది.
ఉత్తమమైన ఆహరం ఏది?
తీగ ద్వారా వచ్చే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ, గుమ్మడి, చిక్కుడు, దోసకాయ మరియు ఆకుకూరలు ఉత్తమమైన ఆహరం. కాయల ద్వారా వంకాయ, టొమేటో మొదలైనవన్నీ మధ్యమాలు. ఇక అధమం - భూమిలో పండేవి. అనగా దుంప కూరలు. దుంపకూరలు ఆరోగ్యానికి ఏమంత మంచి చేయవని వైద్యశాస్త్రం చెబుతోంది.
తల్లి గర్భం లో బిడ్డ ఎలా ఎదుగుతాడు?
మొదటిరోజు కలిలం అవుతుంది. అయిదురోజులకు బుద్బుదాకారము. పదిరోజులకు రేగుపండంత. ఒక నెలకి తల, రెండో నెలకి భుజాలు, మూడో నెల పూర్తయ్యేసరికి ఆకలిదప్పికలు మొదలవుతాయి.
ఆరునెలలకి మాయతో కప్పబడతాడు. ఏడు నెలలకి జ్ఞానము కలుగుతుంది. కదలడం మొదలవుతుంది. అపుడే భగవంతుడ్ని, గత జన్మలో వలె పాపాలు చెయ్యననీ, మంచి బుద్ధిని ఇవ్వమనీ అనేకవిధాల వేడుకుంటాడు. నెలలు నిండాక భూమి మీద పడతాడు. తల్లి కడుపులో చేసిన ప్రతిజ్ఞలన్నీ మర్చిపోతాడు. అతనిని మహామాయ కమ్మేస్తుంది.

వరాలివ్వకూడదు
రాజు: ఒరేయ్ రవీ ! రామాయణం చదవడం వలన నువ్వు గ్రహించిన నీతి ఏమిటో చెప్పరా?
రవి: భార్యకు వరాలివ్వకూడదు.
రాజు: ????????????????????
రవి: భార్యకు వరాలివ్వకూడదు.
రాజు: ????????????????????
నేనా? మా ఆయనా?
డాక్టర్: మీ ఆరోగ్య విషయమై దాంపత్యానికి కొంతకాలం దూరంగా ఉండాలి.
పేషెంటు భార్య: నేనా? మా ఆయనా?
డాక్టర్: ???????????????????????
పేషెంటు భార్య: నేనా? మా ఆయనా?
డాక్టర్: ???????????????????????
ఎన్ని యజ్ఞాలు చేసినా పోని పాపాలు ఏవి?
అన్యాయంగా పరుల ధనాన్ని చేజిక్కించుకున్నవారికీ, పరాయివాని భార్యని ఆశించి పొందినవానికీ, ఇంటి యజమాని లేదా పెద్దలు లేనపుడు పిల్లలకి చెందాల్సిన ఆస్తిని కాజేసినవారికీ ఎన్ని శ్రాధ్ధాదులు పెట్టినా, ఎన్ని యజ్ఞాలు చేసినా ఆ పాపాలు నశించవు. ఆ పాపాలకు శిక్ష పై లోకాలలోనూ, ఇక్కడా అనుభవించవలసిందే.
యమపురి దారి ఎలా ఉంటుంది?
మనిషి ఆయువు తీరిన పదమూడో రోజు తర్వాత యమభటులు జీవిని యమపురికి తీసుకెళ్తారు. దారి అంతా ఎగుడు దిగుడులు. ఆకలిదప్పికలు తీరే అవకాశం లేని ప్రాంతంలో అరికాళ్ళు బొబ్బలెత్తినా యమభటులు కొరడాలతో కొట్టి నడిపిస్తారు. కనుచూపు మేరలోనే నీరు ఉంటుంది. త్రాగబోతే చేతికి అందదు. మేఘాలు నిరంతరం రక్తాన్ని వర్షిస్తుంటాయి. అలా పదిహేడు రోజులపాటు, జీవించినపుడు చేసిన పాపాలను తలచుకుని వాపోతుంటాడు జీవుడు. ఆ తరువాతే యమపురి మజిలీ అయిన సౌమ్యపురం చేరతాడు.
దేవత్వ స్త్రీ లక్షణాలేమిటి?
అడుగు దూరంలోనే సువాసన తగులుతుంది. నిట్టూర్పుల శరీరతత్వం కలది. ప్రశాంతమైన ముఖంతో ఎపుడూ నిండుకుండలా కనిపించే స్త్రీ దేవత్వ అని చెప్పబడింది.
వైతరణి నది ఎలా ఉంటుంది?
వంద యోజనాల వెడల్పు తో ఉంటుంది. అందులో చిక్కని రక్తం, చీము , మహా జలచరాలు ఉంటాయి. ఒక్క క్షణం కూడా భరించలేని వాసన. ఎన్ని దీనాలాపనలు చేసినా పాపి అక్కడ తాను చేసిన పాపాలకు ఫలితం అనుభవించవలసిందే.
అందుకే తమ వారి కోసం భూమిపై వారి పేరు మీద గోదానం చేస్తారు. గోదానం చేస్తే వైతరణి నదిని సులభంగా దాటగలరని పురాణంలో శ్రీ మహవిష్ణువు స్వయంగా గరుగ్మంతునికి చెప్పాడని అంటారు.
అందుకే తమ వారి కోసం భూమిపై వారి పేరు మీద గోదానం చేస్తారు. గోదానం చేస్తే వైతరణి నదిని సులభంగా దాటగలరని పురాణంలో శ్రీ మహవిష్ణువు స్వయంగా గరుగ్మంతునికి చెప్పాడని అంటారు.
కరెంట్ తీగలు పక్షులకు షాక్ కొట్టవా?
కరెంట్ తీగల మీద కూర్చున్న పక్షి శరీరం కరెంట్ తీగలతో సమాంతర వలయాన్ని ఏర్పరచడం వలన విద్యుత్ పొటెన్షియల్ స్థిరం గా ఉంటుంది. పక్షి రెండు కాళ్ళ మధ్య పొటెన్షియల్లో ఏ భేధం ఉండదు. అందుకే షాక్ కొట్టదు.
కానీ అదే పక్షి ఒక తీగ మీద వాలి ఉండి, ముక్కుతో మరో తీగను తాకితే విద్యుత్ పొటెన్షియల్ లో భేధం ఏర్పడి, విద్యుత్ ప్రవహించి షాక్ కొడుతుంది.
కానీ అదే పక్షి ఒక తీగ మీద వాలి ఉండి, ముక్కుతో మరో తీగను తాకితే విద్యుత్ పొటెన్షియల్ లో భేధం ఏర్పడి, విద్యుత్ ప్రవహించి షాక్ కొడుతుంది.
అసూయాపరురాలైన కోడలు అంటే ఎవరు?
'నిండు నూరేళ్ళు బ్రతకడం ఎలా?' అన్న పుస్తకం భర్త తెచ్చిస్తే అత్తగారు ఎక్కడ చదివేస్తారో అని బీరువాలో దాచేసేది.
తిరుమలస్వామి ని దర్శించేటపుడు బ్రహ్మనాడి ని కూడా దర్శించాలా?
తిరుమలస్వామి ని దర్శించేటపుడు బ్రహ్మనాడి ని కూడా దర్శించాలంటారు. సప్తగిరివాసుని దర్శనానికి వెళ్ళినపుడు కనులు మూసుకుని ధ్యానించకుండా సాధ్యమైనంతవరకు స్వామినే చూడాలి. శ్రీవారి విగ్రహ నొసటి కుడిప్రక్కన నామం క్రింద సూర్యనాడి, ఎడమ ప్రక్కనున్న నామం క్రింద బ్రహ్మనాడి ఉంటాయి. అంటే మధ్యనున్న ఎర్రని నామమే బ్రహ్మనాడి. దీనియందే పరమాత్ముడు ఉన్నాడంటారు.
నందకం అంటే ఏమిటి?
శ్రీవారి పంచాయుధాలలో నందకమనే ఖడ్గం తిరుమలలో సూర్యకఠారి అనే పేరు తో నడుము భాగం లో అలంకరించబడుతుంది. సుమారు మూడడుగుల పొడవు తో బంగారు ఒర లో ఇమిడిన నిజమైన ఖడ్గమది.
రెండు తలల శిశువు జననం.
చిత్తూరు జిల్లా , రేణిగుంట మండలం, కొత్తపాలెం కు చెందిన మునిరామిరెడ్డి కి ఈ శిశువు జన్మించాడు. ఈ శిశువు కి రెండు తలలు, రెండు వెన్నెముక లు ఉన్నాయి. జన్యు లోపం వల్ల ఇలా అరుదుగా పుడతారని వైద్యులు చెబుతున్నారు.
నటుల అసలు పేర్లు
- రాజబాబు ---------- పుణ్యమూర్తుల అప్పలరాజు
- చిరంజీవి ---------- కొణిదెల శివశంకర వరప్రసాద్
- కృష్ణంరాజు ---------- ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు
- ఎస్వీ రంగారావు --------------- సామర్ల వెంకట రంగారావు
- బ్రహ్మానందం --------------- కన్నెగంటి బ్రహ్మానందం
- సుత్తివేలు -------------- కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు
- కృష్ణ భగవాన్ ----------- పాపారావు చౌదరి
- చక్రవర్తి ---------------- కొమ్మినేని అప్పారావు
- గిరి బాబు -------------- యర్రా శేషగిరిరావు
- కృష్ణ -------------------- ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి
- జగపతిబాబు ------------ వీరమాచనేని జగపతి చౌదరి
- కాంతారావు -------------- తాడేపల్లి లక్ష్మీ కాంతారావు
- నూతన్ ప్రసాద్ ------------ వరప్రసాద్
- పవన్ కళ్యాణ్ ------------ కొణిదెల కల్యాణ్ బాబు
- మోహన్ బాబు ----------- మంచు భక్తవత్సలం నాయుడు
- మమ్మూట్టి ---------------- ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్
- సుమంత్ ---------------- యార్లగడ్డ సుమంత్ కుమార్
- రజినీకాంత్ -------------- శివాజీరావ్ గయక్వాడ్
- రవితేజ ----------------- భూపతిరాజు రవిశంకర్ రాజు
- శుభలేఖ సుధాకర్ -------------- సూరావఝుల సుధాకర్
- శోభన్ బాబు ----------------- ఉప్పు శోభనా చలపతిరావు
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ------------ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
- ముక్కు రాజు ----------------- సాగి రాజన్ రాజు
- సుమన్ -------------------- సుమన్ తల్వార్
- సూర్య ---------------------- సూర్య శివకుమార్
మీకు తెలుసా?
- హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పుస్తకం విడుదలైన మొదటి రోజునే తొమ్మిది మిలియన్ల ప్రతులు అమ్ముడయింది.
- వైర్‌లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ ద్వారా మొబైల్ ఫోన్లలో మరియు పీడిఏ లలో వెబ్ ను సందర్శించవచ్చు.
- నోబెల్ పతకాన్నిముందుగా 18 క్యారట్ల బంగారంతో తయారు చేసి దానికి 23 క్యారట్ల బంగారంతో పూత వేస్తారు.
- అమెరికా అధ్యక్ష భవనం నిర్వహణకు ఏటా సుమారు 600 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.
- ఈ రోజు ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ (డిసెంబర్ 22 , 1887) జన్మించాడు
అంతరాత్మకు, మనసుకు గల తేడా ఏమిటి?
ఈ ప్రశ్న ఉదయం నేను ఆఫీసు కు వస్తున్నపుడు నా స్నేహితుడు అడిగాడు. దీనికి సమాధానం ఎందుకు చెప్పలేములే అనుకున్నాను. కానీ సమాధానం చెప్పడానికి చాలా గింజుకున్నాను. ఇంతకీ సమాధానం చెప్పలేదనుకోండి అది వేరే విషయం. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి , నేను మళ్లీ వాడికి చెప్పాలి కదా!
ఆశకు తృప్తి కి తేడా ఏమిటి?
ఆవగింజ కు అగ్నిపర్వతానికి ఉన్నంత తేడా ఉంది. కోట్లు మూలుగుతున్నా పావలా కోసం కక్కుర్తి పడటం ఆశ అయితే, దొరికిన అదే పావలా తో గంజి త్రాగి హాయిగా జీవితాన్ని వెళ్ళబుచ్చడం తృప్తి.
సీమంతం లో గాజులు ఎందుకు తొడుగుతారు?
ఏ శుభకార్యాల్లో లేని విధంగా సీమంతం లో గాజులు తొడిగి పండంటి బిడ్డను ఇమ్మని ఆశీర్వదిస్తారు. అలా గాజులు ఎందుకు తొడుగుతారంటే గర్భం ధరించిన స్త్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి. చేతుల్లో నరాలకీ, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది. అలా ఎక్కువ గాజులు తొడగడం వలన గర్భకోశం పై సరైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుంది.
శరీరాన్ని అనారోగ్యం ఎలా ఆవహిస్తుంది?
- ఆహారం జీర్ణం కాకముందే మళ్లీ మళ్లీ ఆత్రం గా తినడం వల్ల
- అమితంగా పుల్లటి పదార్ధాలు తినడం వలన
- చలిమిడి తినడం వలన
- శరీరానికి పని లేకుండా ఉండుట వలన
- పగటిపూట నిదురించుట వలన
- పాలు, చేపలు ఏకకాలం లో ఆహారం గా తీసుకొనుట వలన
కంచు పాత్రల్లో ఎవరు భోజనం చెయ్యకూడదు?
కంచు పాత్రల్లో మఠాధిపతులు, మతప్రచారకులు, సన్యాసులు, దీక్ష తీసుకున్నవాళ్ళు భోజనం చెయ్యకూడదు. ఎందుకంటే కంచు అధికంగా శరీర పటుత్వాన్ని పెంచుతుంది. ఆ కారణం గా ఐహిక సుఖాల మీద వాంఛ పెరుగుతుంది.
మగవారికి ప్రాతివత్య నియమం లేదా?
ఆడవారి లాగా మగవారికి ప్రాతివత్య నియమం ఎందుకు పెట్టలేదు?
తప్పు ఎవరు చేసినా తప్పే. స్త్రీ చేసినా పురుషుడు చేసినా నరకలోక శిక్షలు తప్పవు. ఐతే పురుషునికి ప్రాతివత్య నియమం ఎందుకు పెట్టలేదంటే, పురుషుడు తప్పు చేస్తే ఆ వంశం చెడదు. అదే స్త్రీ ప్రాతివత్య నియమాన్ని ఉల్లంఘిస్తే ఆ వంశం చెడుతుంది. ఎందుకంటే వంశాన్ని వృద్ది చేసేది స్త్రీ కాబట్టి. భర్త ద్వారా కాకుండా ప్రాతివత్య నియమాన్ని ఉల్లంఘించి బిడ్డను కంటే మరి ఆ వంశవృక్షం నాశనం అయినట్లే కదా!

ఆయుష్షు ను పెంచుకోవడం ఎలా?
- సాయంకాల ఎండ ను ఆస్వాదించడం వలన
- యజ్ఞ యాగాదుల పొగను పీల్చడం వలన
- తన కన్నా చిన్నదానిని భార్య గా చేసుకొనుట వలన
- ఎక్కువ నీరు త్రాగటం వలన
- రాత్రిపూట క్షీరాన్నం భుజించుట వలన
- నిత్యం వ్యాయామం చేయుట వలన
- అత్యాశ లేకుండుట వలన
ఎంత కంగారుపడ్డానో తెలుసా!
భర్త ఆఫీసు నుండి ఇంటికి రాగానే భార్య 'హమ్మయ్య, మీరు క్షేమంగానే ఇల్లు చేరారు, మీరు ఇంకా రాలేదని నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా' అంది.
భర్త: ఎందుకు కంగారుపడటం. ఏమి జరిగింది.
భార్య: ఇందాక ఎవరో పిచ్చివాడి లా ఉన్న వ్యక్తి బస్సు కింద పడ్డాడని అందరూ అనుకుంటుంటే విన్నాను.
భర్త: ????????????
భర్త: ఎందుకు కంగారుపడటం. ఏమి జరిగింది.
భార్య: ఇందాక ఎవరో పిచ్చివాడి లా ఉన్న వ్యక్తి బస్సు కింద పడ్డాడని అందరూ అనుకుంటుంటే విన్నాను.
భర్త: ????????????
సాగర కన్యలు ఉన్నారా?
సముద్రం ఒక తరగని గని. అనంతమైన ఈ సాగరగర్భం లో సామాన్యులకు అర్ధం కాని ఎన్నో వింతలూ, విశేషాలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద నౌక లను ముంచివేసే ప్రాణులు ఉన్నాయి. ఎవరూ తెలుసుకోలేని భారీ ప్రాణులు ఉన్నాయి. సముద్రం మధ్యకు వెళ్ళిన హెలికాప్టర్ హఠాత్తుగా మాయమైనపోయిన సంఘటన ఈ మధ్య జరిగినది. అది ఎలా మాయమైనదో ఏమి జరిగిందో కూడా ఎవరికీ తెలియలేదు. అలాంటి ఒక విచిత్రమైన విశేషమే 'సాగర కన్య'.
చిన్నప్పుడు మనం చందమామ కధలలో సాగరకన్యల గురించి చదువుకున్నాం. కానీ అవి కధల వరకేనా లేక నిజంగా అవి ఉన్నాయా అనేదే ఇపుడు ప్రశ్న. తల నుండి నడుము వరకు మనిషి లా ఉండి, నడుము క్రింది భాగం అంతా చేప లా ఉండే ఈ సాగరకన్య లు సముద్రం లోని ఏ ప్రాణీ వెళ్లలేనంత లోతుకు వెల్లగలవని, వాటికి సముద్రం లోని అపారమైన ఖనిజ సంపదను గుర్తించే శక్తి ఉందని అంటుంటారు.
కొన్నేళ్ళ క్రితం ఫిజీ సముద్ర తీరం లో చేపలు పట్టేవాళ్ళకు ఒక మరణించిన మత్స్యం లభించింది. అది నడుము వరకు మనిషి లా, నడుము కింద చేపలా ఉండటం తో దాన్ని సాగరకన్య గా గుర్తించారు. దాంతో ఎన్నో ఏళ్లుగా సాగరకన్య ల మీద పరిశోధనలు చేస్తున్న డాక్టర్ గ్రిఫిన్ అక్కడకు వచ్చి దానిని తన ప్రయోగశాలకు తీసుకువెళ్ళి పరిశోధన చేసి దానిని సాగరకన్య గా నిర్ధారించాడు.
మన దేశం లో కూడా సాగరకన్య లభించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. డిసెంబరు 2004 లో సునామీ వచ్చినపుడు చెన్నై మెరీనా బీచ్ కు ఒక సాగరకన్య కొట్టుకువచ్చినట్లుగా అప్పట్లో కొంతమంది పేర్కొన్నారు. ఏది ఏమైనను భగవంతుని అపూర్వ సృష్టి లో సాగరకన్య ఒక అద్భుతం, విశేషం అది ఉన్నా లేకపోయినా.

పరమేశ్వరుడు లింగరూపం లోనే ఎందుకు ఉంటాడు?
భృగు మహర్షి శాపం వలన పరమేశ్వరుడు లింగరూపం లో ఉంటాడు. లింగానికి పూజిస్తేనే ఫలితమెక్కువ. శివలింగానికి మడి, శుద్ధి, ఆచారము ఉండవు. కావున శివసన్నిధి కి ఎలా అయినా వెళ్ళవచ్చును.
విష్ణు ఆలయానికి మాత్రం అత్యంత శుభ్రత తో వెళ్ళాలి. లేదంటే విష్ణువు ఊరుకున్నా, మహాలక్ష్మి ఊరుకోదు.
విష్ణు ఆలయానికి మాత్రం అత్యంత శుభ్రత తో వెళ్ళాలి. లేదంటే విష్ణువు ఊరుకున్నా, మహాలక్ష్మి ఊరుకోదు.
పూర్వకాలం లో ఉపద్రవాలను ఎలా కనిపెట్టేవారు?
- తేనెపట్టు లోని తేనెటీగలు బయటకు వచ్చి ఝుంకారనాదాన్ని వినిపిస్తాయి.
- పావురాలు దారితెన్నూ లేకుండా తిరుగుతూ అలజడి సృష్టిస్తాయి.
- కొన్ని జంతువులు ఆహారం కోసం బయటకు రాకుండా లోపలే ఉండిపోతాయి.
- కుక్కలు చెవులు రిక్కిరించి భయం తో తుఫాను దిశగా చూస్తాయి.
- అరణ్యము లోని ఏనుగులు గుంపులు గుంపులు గా నిర్దిశ లో పరిగెడతాయి.
- కొన్ని జంతువులు ఉపద్రవాలను ముందుగానే పసిగట్టి వాటి స్వభావానికి విరుద్ధముగా అరుస్తాయి.
ఆంజనేయస్వామి కి పెళ్లి అయ్యిందా?
ఆంజనేయుడు నిత్య బ్రహ్మచారి అనే విషయం మనకు తెలిసినదే. కానీ ఆయన సూర్యుని వద్ద సకల శాస్త్రాలు నేర్చుకునేటపుడు, వివాహితులు మాత్రమే నేర్చుకోవలసిన కొన్ని శాస్త్రాలను నేర్చుకోవడానికి వీలుగా, ఆంజనేయుడు సూర్యుని కుమార్తె అయిన సువర్చల ను వివాహమాడాడని, అయినను ఆయన బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లకుండా సూర్యభగవానుడు ఆయనకు వరం ఇచ్చాడని చెప్తారు. ఇది నిజమా లేక పుక్కుటి పురాణమా అనేది తెలియదు. ఏది ఏమైనను మన ఆంజనేయుడు నిత్య నూతన బ్రహ్మచారి, సర్వదా పూజనీయుడు
అత్యాశ
ఒకానొక పట్టణము లో ఒక బిక్షగాడు ఉండేవాడు. వాడికి చాలా కొద్ది మొత్తములో సాగు భూమి ఉన్నది. దాని మీద ఏమీ ఆదాయం లేక యాచన చేసుకుంటూ, ఆ వచ్చిన దానిని తిని బతుకుతుండేవాడు.
వాడికి ఒక రోజూ ఒక ఇంటిలో మంచి ఆహారం దొరికినది. వాడు ఆహారాన్ని ఆ ఇంటివద్దే కడుపునిండా భుజించాడు. కడుపు నిండడం తో ఆ రోజుకి యాచన చలించి ఇంటి దారి పట్టాడు. దారిలో ఒక గృహస్థుడు వానికి కొద్దిగా పేలపిండి ఇచ్చినాడు. వానికి ఆకలి తీరి ఉండటం తో దానిని భుజింపక తనతో తీసుకుని ఇంటిదారి పట్టాడు. దారిలో ఒక చెట్టు నీడలో విశ్రమింపదలచి, తన చెంత ఉన్న ఒక గుడ్డను చెట్టు కింద పరచి, తన మేను వాల్చి, తనలో తాను ఈ విధంగా ఊహించుకోసాగాడు
"ఇపుడు నా కడుపు నిండినది కనుక ఈ పేలపిండిని సంతలో అమ్మి ఆ వచ్చిన కొద్ది మొత్తము తో కొద్దిగా నువ్వులు కొని నా భూమిలో చల్లుతాను. కొంతకాలము తరువాత అవి మంచి కాపుకు వస్తాయి. వాటిని అమ్మి ఆ వచ్చిన మొత్తము తో వడ్డీ వ్యాపారము చేసి బాగుగా సంపాదిస్తాను. అప్పటికి నాకు వివాహ వయసు కూడా వస్తుంది. బాగా డబ్బు సంపాదిస్తాను కనుక నాకు పిల్లను ఇవ్వడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. అందునుండి ఒక మంచి అమ్మాయిని ఎన్నుకుని వివాహం చేసుకుంటాను. ఎపుడైనా నా భార్య నా మాట విననిచో నేను ఊరుకోను, నా కాలితో గట్టిగా ఇలా తన్నుతాను"
అని అసంకల్పితంగా తన కాలితో పేల పిండిని తన్నాడు. అది కాస్త కింద పడి గాలికి మొత్తం ఎగిరిపోయింది. ఏదో జరుగుతుంది అని ఏదో ఏదో ఊహించుకుంటూ వాడి అత్యాశకు వాడే బలి అయ్యాడు.

మానేసి రెండేళ్లయ్యింది
తండ్రి: బాబూ! నీకు ఈ రోజు కి 16 ఏళ్ళు వచ్చాయి. సిగరెట్, మందు, గుట్కా వగైరా అలవాటు అయ్యేవి ఈ వయసులోనే, కొంచెం జాగ్రత్త!
కొడుకు: నువ్వేమీ కంగారుపడకు నాన్నా! అవన్నీ మానేసి 2 సంవత్సరాలు అయ్యింది.
తండ్రి: ????????????
కొడుకు: నువ్వేమీ కంగారుపడకు నాన్నా! అవన్నీ మానేసి 2 సంవత్సరాలు అయ్యింది.
తండ్రి: ????????????
సెంచరీ మిస్సయిన సచిన్
నాగపూర్ లో న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్, మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే, సచిన్ 61 పరుగులకు మెక్ కే బౌలింగ్ లో ఔటయ్యాడు.
సిరిమల్లెపువ్వా ... సిరిమల్లెపువ్వా ...
చిత్రం: పదహారేళ్ళ వయసు
నటీనటులు: చంద్రమోహన్, శ్రీదేవి.
పల్లవి:
సిరిమల్లెపువ్వా ... సిరిమల్లెపువ్వా ...
చిన్నారి చిలకమ్మా...
నా వాడు ఎవరే? నా తోడు ఎవరే?
ఎన్నాళ్ళకొస్తాడే?
సిరిమల్లెపువ్వా.....
చరణం 1 :
తెల్లారబోతుంటే... నా కల్లోకి వస్తాడే....
కళ్ళారా చూదామంటే.... నా కళ్ళు మూస్తాడే....
ఆ అందగాడు... నా ఈడు జోడు ఏడే?
ఈ సందెకాడ... నా చందమామ రాడే
చుక్కల్లారా ...... దిక్కులు దాటి
వాడెన్నాళ్ళకొస్తాడో? (సిరిమల్లెపువ్వా ... )
చరణం 2 :
కొండల్లో కోనల్లో.... కూయన్న ఓ కోయిలా...
ఈ పూల వానల్లో..... ఝుమ్మన్న ఓ తుమ్మెదా....
వయసంతా వలపై.... మనసే మైమరపై ఊగేనే...
పగలంతా పగలు..... రేయంతా దిగులు రేగేనే...

వరుసకు ఏమి అవుతారు?
ఇది భేతాళ కధలు లోనిది. భేతాళుడు విక్రమార్క చక్రవర్తి ని అడిగిన ప్రశ్న. ప్రశ్న మీకోసం.
ఒకనాడు ఇద్దరు తండ్రీకొడుకులు నదీ తీరాన నడుచుకుంటూ వెళుతున్నారు. కొంతదూరం వెళ్ళాక వాళ్ళకు రెండు రకాల అడుగుజాడలు పక్కపక్కన కనిపించాయి. అవి స్త్రీ ల అడుగుజాడలు అని ఆ తండ్రీకొడుకులు గ్రహించారు. తండ్రి ఆ చిన్న అడుగులు గల స్త్రీ ని వివాహమాడతానని ప్రతిజ్ఞ చేశాడు. అలాగే కొడుకు ఆ పెద్ద అడుగుల స్త్రీ ని పెళ్లి చేసుకుంటానని శపధం చేశాడు. అలా వాళ్ళు ఆ అడుగుల వెంబడి నడుస్తూ వెళ్లారు. కొంతసేపటికి ఆ ఇద్దరి స్త్రీ లను కలుసుకున్నారు. తీరా చూస్తే వాళ్ళు కూడా వీల్లలాగే ఒక తల్లీకూతుల్లు . కాని వాళ్ళ శపధం కోసం కొడుకు తల్లిని, తండ్రి కూతురుని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం పిమ్మట కొడుకుకి తల్లి వల్ల ఆడబిడ్డ, తండ్రికి కూతురి వల్ల మగబిడ్డ జన్మించారు. అయితే మొత్తంగా వాళ్ళ వరుసలు ఏమిటి?

శ్రీ రామదాసు ను బంధించిన జైలు - గోల్కొండ
నవాబు అనుమతి లేకుండా రాముని గుడి కట్టినందుకు గోపన్న ను గోల్కొండ కోటలో బంధించిన విషయం మనకు తెలిసిందే. పై చిత్రం ఆయనను బంధించిన కారాగారమే. ఆయన ఈ కారాగారం లో ఉండగా సీతారామ లక్ష్మణుల మరియు హనుమంతుని చిత్రాలను చిత్రించి వాటిని కీర్తిస్తూ ఉండేవాడట. ఆయన కీర్తన లలో బాగా ప్రాచుర్యం పొందినవి, ఈ కారాగారం లో రచించినవే అంటారు. ఈసారి గోల్కొండ వెళ్ళినపుడు ఈ కారాగారాన్ని దర్శించి ఆ మహానుభావున్ని మననం చేసుకుని రండి.
మావటి ని చంపిన ఏనుగు.
తమిళనాడు లోని వేలూరు సమీప స్వర్ణాలయం లో భక్తులను ఆశీర్వదించే ఒక ఏనుగు గురువారం రాత్రి అకస్మాత్తుగా భక్తులపై దాడి చేసింది. దీనిని ఆపడానికి ప్రయత్నించిన మావాటిని తొండం తో విసిరికొట్టి చంపివేసింది. విశేషం ఏమిటంటే అసలు మావటి సెలవుల్లో ఉంటే ఇతనిని తాత్కాలికంగా నియమించారు.
నోబెల్ బహుమతి అందుకునే చేతులు కరువు?
నోబెల్ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ఈసారి 2010 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని అందుకునే చేతులు కరువయ్యాయి. చైనా ప్రజాస్వామ్యం పై జరిపిన పోరాటానికి గాను ఉద్యమ నేత లియూ జియాంబోకు శాంతి నోబెల్ బహుమతి ప్రకటించారు. బహుమతి ప్రకటించినపుడు ఆయన జైలులో ఉన్నారు. ఇపుడిపుడే ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. పోనీ అయన తరపున ఆయన కుటుంబసభ్యులు కూడా అందుకునే పరిస్థితులు కనిపించడంలేదు. కావున ఈ సారి శాంతి నోబెల్ ప్రదాన కార్యక్రమం రద్దు కావచ్చునని భావిస్తున్నారు. చైనా ప్రభుత్వం మనసు మార్చుకుని కనీసం అవార్డు ప్రధానోత్సవనికైనా ఆయనను తీసుకువస్తే బావుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
సైనా జోరు కు అడ్డుకట్ట.
ఆసియాడ్ బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్న సైనా నెహ్వాల్ జోరు కు అడ్డుకట్ట పడింది. క్వార్టర్ ఫైనల్లో ఓటమి తో వెనుతిరిగింది. నిరుటి ఆసియాడ్‌లో రజత పతక విజేత 'యిప్ పుయ్ యిన్' చేతి లో సైనా 8-21, 21-8, 19-21తో ఓటమి చవిచూసింది.
ఊహలు గుసగుసలాడే నా హ్రుదయము ఊగిసలాడే
చిత్రం: బందిపోటు
నటినటులు: యన్.టి.ఆర్
పల్లవి:
ఊహలు గుసగుసలాడే నా హ్రుదయము ఊగిసలాడే
ప్రియా
ఊ
ఊహలు గుసగుసలాడే నా హ్రుదయము ఊగిసలాడే
చరణం 1 :
వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే అది నీకు ముందే తెలుసు (ఊహలు గుసగుసలాడే..)
చరణం 2 :
నను కోరి చేరిన బేలా.... దూరాన నిలిచేవేలా
నను కోరి చేరిన బేలా.... దూరాన నిలిచేవేలా
నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా (ఊహలు గుసగుసలాడే..)
చరణం ౩:
దివి మల్లెపందిరి వేసే.... భువి పెళ్ళిపీటను వేసే..
దివి మల్లెపందిరి వేసే.... భువి పెళ్ళిపీటను వేసే..
నెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెళ్ళిని చేసే (ఊహలు గుసగుసలాడే...)

బిగ్‌బాస్ కు పండగ
బిగ్‌బాస్ , రాఖీ కా ఇన్సాఫ్ కార్యక్రమాలను ఇకపై రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలని కేంద్ర సమాచార శాఖ ఉత్తర్వులు జారీ చేయడం తో బిగ్‌బాస్ నిర్వాహకులు ముంబై హైకోర్టు ను ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది.
180 కిలోల గొర్రె
నాగపూర్‌లో బక్రీద్ సందర్భంగా అమ్మకానికి తీసుకొచ్చిన ఓ గొర్రె ఏకంగా నాలుగడుగుల ఎత్తు.. 180 కిలోల బరువుతో అందరినీ ఆశ్చర్య పరిచింది! మధ్యప్రదేశ్‌లోని చంబల్‌నుంచి తెచ్చిన ఆ గొర్రెకు మంచి ఆహారం, పాలు ఇచ్చి రెండేళ్ల నుంచి పోషిస్తున్నట్లు దాని యజమాని నదీంఖాన్ చెప్పాడు. రోజుకు తాను దాని ఆహారానికి రూ. 400 ఖర్చుపెట్టానని, అల్లా దయతో 1.75 లక్షలకు అమ్మానని తెలిపాడు.
అశ్లీల, అభ్యంతరకర టీవీ కార్యక్రమాలపై..............
అశ్లీల, అభ్యంతరకర టీవీ కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వివాదాస్పదంగా మారిన ‘బిగ్‌బాస్’, ‘రాఖీ కా ఇన్సాఫ్’ కార్యక్రమాలను ఇకపై రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల లోపు ప్రసారం చేయాలని వాటిని ప్రసారం చేస్తున్న చానళ్లను బుధవారం ఆదేశించింది. ఈమేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నగ్నదృశ్యాలను ప్రసారం చేస్తున్న ఎస్‌ఎస్ మ్యూజిక్ చానల్‌ను వారం రోజులు నిషేధించింది. ‘కలర్స్ చానల్‌లో వస్తున్న బిగ్‌బాస్, ఎన్డీటీవీ ఇమాజిన్ చానల్‌లో వస్తున్న రాఖీ కా ఇన్సాఫ్‌లు అందరూ చూడడానికి ఉద్దేశించినవి కావు. వీటిని ఎక్కువ మంది టీవీ చూసే సమయం(ప్రైమ్ టైమ్)లో ప్రసారం చేయొద్దు’ అని పేర్కొంది. బిగ్‌బాస్‌లో పాల్గొంటున్న వారు తరచూ గొడవలు పడుతూ బూతులు మాట్లాడుతున్నారని, ముష్టి యుద్ధాలకు దిగుతూ, వ్యక్తిగత విషయాలు బట్టబయలు చేస్తున్నారని తెలిపింది.
ఈ కార్యక్రమాలను పునఃప్రసారం కూడా చేయొద్దని ఆదేశించింది. తమ చానల్‌లో ప్రసారం చేస్తున్న వాటిలో అశ్లీల దృశ్యాలేమీ లేవంటూ ఎస్‌ఎస్ చానల్ ప్రతినిధి చెప్పారు. కొన్ని పాటల విజువల్స్‌ను చూపగా, అవి అశ్లీలమైనవేనని ఆయన అంగీకరించారు. అయితే వాటిని తమ చానల్‌లో ఎప్పుడూ ప్రసారం చేయలేదని చెప్పారు. అశ్లీల కార్యక్రమాలపై కొరడా ఝళిపించాలని సోమవారం జరిగిన అంతర్ మంత్రిత్వశాఖల సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో హోంశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, విదేశాంగ శాఖ, సమాచార ప్రసారాల శాఖల అదనపు కార్యదర్శులు పాల్గొన్నారు.

క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్న సైనా నేహ్వాల్
ఆసియా క్రీడల మహిళల సింగిల్స్ బాడ్మింటన్‌లో భారత నెంబర్‌వన్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. రెండవ రౌండ్‌లో మలేషియాకు చెందిన లిడియా ఛీపై 21-15, 21-17 స్కోరు తేడాతో విజయం సాధించింది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో హాంగ్‌కాంగ్‌కు చెందిన ప్యూ యిన్, తైపై క్రీడాకారిణి మా సియా పాయ్‌ల మధ్య జరిగే పోటీలో గె లుపొందిన వారితో తలపడనుంది.
ఇంటివాడైన అనంతశ్రీరాం
ఇండస్ట్రీకి ప్రవేశించిన ఆనతికాలం లోనే అగ్రస్థాయికి ఎదిగిన అతికొద్ది మంది గేయ రచయితలలో అనంతశ్రీరాం ఒకరు. ఈయన వివాహం నిన్న రాత్రి పాలకొల్లు లో వైభవం గా జరిగింది. ఈయన యలమంచిలి లో జన్మించారు. పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు వివాహానికి హాజరై వీరిని ఆశీర్వదించారు.
అతి ఖరీదైన వజ్రం
గ్రాఫ్ పింక్ అనే పేరు గల ఈ వజ్రాన్ని ఇటీవల జెనీవా లో వేలం వేశారు. ఈ పింక్ కలర్ వజ్రం చాలా అరుదైనది గా గుర్తించారు. దీని బరువు దాదాపుగా 25 క్యారట్స్ ఉంటుంది. దీనిని లండన్ కు చెందినా ఒక వ్యాపారి దాదాపుగా 210 కోట్లకు కైవసం చేసుకున్నాడు.
తిరుమల లో వై.యస్ చిత్రపటం పై రగడ
తిరుమల లోని ఒక సత్రం లో దివంగత వై.యస్ చిత్రపటం ఏర్పాటు చేయడంపై టి.టి.డి నోటీసులు జారీ చేసింది. ఆ చిత్రపటాన్ని తక్షణమే తొలగించాలని లేనిపక్షంలో ఆ సత్రం యొక్క లైసెన్సును రద్దు చేస్తామని తెలిపింది. నిబంధనల ప్రకారం తిరుమల లో వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవార్ల చిత్రపటాలు మాత్రమే ఉండాలట.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు హీరో గా రంగప్రవేశం?
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు హీరో గా రంగప్రవేశం చేయబోతున్నట్లు తెలిసింది. ఇతగాడి పేరు అశోక్. ఇతను కృష్ణ పెద్ద కూతురు కొడుకు. ఇతన్ని గ్రాండ్ గా లాంచ్ చెయ్యడానికి ప్రయత్నాలు జోరందుకున్నాయ్. ఎవరి బ్యానర్ లో చేయబోతున్నాడు, డైరెక్టర్ ఎవరు అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్.
తిరుమల భగవానుని జోస్యం
ఇది ఎపుడు జరిగిందో నాకు తెలియదు. రాత్రి టి.వి లో చూశాను. ఊరి పేరు తెలియదు (తమిళనాడు అనుకుంటాను). అక్కడ తిరుమల భగవానుని దేవాలయం ఉంది. అక్కడ 200 సంవత్సరాల క్రితం ఒక సిద్ధుడు ఉండేవాడట. అతను చాలా మహిమలు కలవాడని ప్రసిద్ధి. అతను అక్కడ ఒకానొక చోట, ఒక గిన్నెలో పంచదార వేసి తాడు ఆధారంగా ఉట్టి కట్టాడట. ఆ తాడు మెల్లిగా కిందకు జరుగుతూ, ఉట్టి ఎపుడైతే భూమికి అంటుకుంటుందో అపుడు ప్రళయం వచ్చి ఈ భూమండలం నాశనం అవుతుందని చెప్పాడట. ఆయన చెప్పినట్లే ఆ ఉట్టి కిందకు దిగుతూ వచ్చింది. ప్రళయ కాలంలో ఆ తిరుమల భగవానుడు అవతరించి దుష్టశిక్షణ చేస్తాడట. ఇపుడు ఆ ఉట్టికి, భూమికి మధ్య అర అంగుళం మాత్రమే ఖాళీ ఉంది. అది కూడా అయిపోతే ఈ భూమి అంతం అయిపోతుందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారని నిన్న టి.వి లో ప్రసారం చేశారు. అసలు ఉట్టికి, ప్రళయం రావడానికి సంబంధం ఏమిటో?
అంతేకాదండోయ్ ఇంకో విషయం కూడా ఉంది. 200 సంవత్సరాల క్రితం ఆ తిరుమల భగవానుడు ఉపయోగించిన మంచం ఇంకా అక్కడే ఉందట. అక్కడి పూజారులు దానిని గాలి కూడా చొరబడని గదిలో ఉంచి, రోజూ రాత్రి పూజ అవగానే, ఆ మంచం మీద శుభ్రమైన ధవళ వస్త్రం తో పక్క వేసి , దాని మీద పువ్వులు పెట్టి, పూజ చేసి, తలుపులు మూసి వెళతారట. తెల్లవారుజామున తలుపులు తీసి చూస్తే ఆ పక్క మీద ఎవరో విశ్రమించినట్లుగా, పక్క నలిగినట్లు ఉంటుందట. ఆ తిరుమల భగవానుడే వచ్చి విశ్రమించి వెలుతున్నట్లుగా అక్కడి ప్రజలు విశ్వశిస్తున్నారు.

నన్ను దోచుకుందువటే ....
చిత్రం: గులేబకావళి కధ.
నటీనటులు: యన్.టి,ఆర్, జమున.
పల్లవి:
నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసానీ
కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామీ... నిన్నే నా స్వామీ...
నన్ను దోచుకుందువటే ..........
చరణం1:
తరియుంతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియుంతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండ వోలె కర్పూర కళిక వోలె ....... కర్పూర కళిక వోలె
ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు
ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు
కలకాలం వీడని సంకెలను వేసినావు.... సంకెలను వేసినావు. (నన్ను దోచుకుందువటే.. )
చరణం 2:
నా మదియే మందిరమై..... నీవే ఒక దేవతవై...
నా మదియే మందిరమై..... నీవే ఒక దేవతవై...
వెలసినావు నాలో.. నే కలిసిపోదు నీలో...... కలిసిపోదు నీలో......
ఏనాటిదో మన బంధం .... ఎరుగరాని అనుబంధం
ఏనాటిదో మన బంధం .... ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా ఇది ఇరిగిపోని గంధం..... ఇరిగిపోని గంధం..... (నన్ను దోచుకుందువటే)

ఇండియా Vs న్యూజిలాండ్ 2nd టెస్ట్
మొదటి ఇన్నింగ్స్ లో 350 పరుగులు చేసిన న్యూజిలాండ్, సెకండ్ ఇన్నింగ్స్ ను 448 /8 వద్ద డిక్లేర్ చేసింది. మెక్‌కల్లం 225 పరుగులతో భారత్ విజయావకాశాలకు గండి కొట్టాడు. ఇపుడు భారత విజయలక్ష్యం 327 పరుగులు. సెహ్వాగ్ 7 పరుగులతోను, గంభీర్ 10 పరుగులతోను క్రీజ్ లో ఉన్నారు.
తిరుమలలో మహిళ హత్య!
తిరుమలలో ఓ భక్తురాలు హత్యకు గురైంది. గోవర్థనం అతిథి గృహంలో రూమ్ నెంబర్ 87లో ఈ ఘటన జరిగింది. మృతురాలు తమిళనాడులోని ధర్మపురికి చెందిన జయంతిగా పోలీసులు గుర్తించారు. ఈనెల 11వ తేదీన జయంతి ముగ్గురు వ్యక్తులతో కలిసి కాటేజీ అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు.
యంగ్ టైగర్ N .T .R కు పదేళ్ళు.
యంగ్ టైగర్ N .T .R సినీ ఇండస్ట్రీ కి వచ్చి నిన్నటికి పదేళ్ళు గడిచిపోయాయి. ఈ పదేళ్ళలో అతను చాలా ఎదిగిపోయాడు. ఎన్నో హిట్లు తన ఖాతాలో జమ వేసుకున్నాడు. సింహాద్రి తో తన సక్సెస్ శాతం నెమ్మదించినా యమదొంగ తర్వాత మళ్ళీ ఊపందుకొంది. నిజం చెప్పాలంటే తను వచ్చి పదేళ్ళ పైనే అయ్యింది. ఎందుకంటే తన మొదటి సినిమా 'బాల రామాయణం'. దీనిని శబ్ధాలయా పిక్చర్స్ వారు నిర్మించారు. కాకపోతే అతను కమర్షియల్ హీరో గా చేసిన మొదటి చిత్రం 'నిన్ను చూడాలని' . దీనిని ఉషాకిరణ్ మూవీస్ వారు నిర్మించారు.
మాంసం తింటున్న కోతులు
మనం సాధారణంగా కోతులు పూర్తి శాఖాహారులు అనుకుంటాం. ఇవి కామన్ గా పళ్ళు, చిరుతిళ్ళు వంటివి తింటాయి. కానీ బబూన్ వంటి కోతులు చనిపోయిన ఒక జంతువు శరీరాన్ని తింటున్న దృశ్యాన్ని మీరు కింది వీడియో లో చూడవచ్చు.
ఇవి సాధారణంగా ఆహారం దొరకనపుడు, ఆకలి తీర్చుకోవడం కోసం ఈ విధంగా చేస్తాయి.
ఇవి సాధారణంగా ఆహారం దొరకనపుడు, ఆకలి తీర్చుకోవడం కోసం ఈ విధంగా చేస్తాయి.
రతన్ టాటా ను లంచం అడిగిన కేంద్ర మంత్రి!
డెహ్రడూన్ లో జరిగిన ఒక కార్యక్రమం లో రతన్ టాటా పాల్గొన్నారు. అక్కడ ఒక విలేఖరి 'మీరు పౌర విమానయాన రంగం లోనికి ఎందుకు ప్రవేశించలేదు' అని అడిగిన ఒక ప్రశ్న కి ఆయన కింది విధంగా సమాధానమిచ్చారు.
'విమానయాన రంగం లోనికి ప్రవేశించాలని టాటా గ్రూప్ 1995 , 1997 , 2001 లో మూడు సార్లు ప్రయత్నించింది. అపుడు ఒక కేంద్ర మంత్రి 15 కోట్లు లంచం అడిగారు, లంచం ఇవ్వడం ఇష్టం లేని టాటా గ్రూప్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అపుడు లంచం ఇచ్చి ఉంటే టాటా గ్రూప్ ఎపుడో విమానయాన రంగం లో ఉండేది.'
కానీ ఆయన ఆ మంత్రి పేరు వెల్లడించలేదు. ఆ మంత్రి పేరు వెల్లడించాలని, ప్రధానమంత్రి దీనిపై C .B .I విచారణ జరిపించాలని కొందరు పట్టుబడుతున్నారు.

హైదరాబాద్ లో మొసలి పట్టివేత!
హైదరాబాద్ నానక్‌రాంగూడ సెల్లార్ గుంతలో కొద్ది రోజుల క్రితం కనిపించిన మొసలి ని పట్టుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. మొసలి ని పట్టుకునేందుకు అధికారులు కొద్దిరోజులుగా గుంతలోని నీటిని మోటార్లు తో తోడుతున్నారు. గుంతలో నీరు తగ్గిపోవడంతో ఉదయం మొసలి తప్పించుకుని బయటకు వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికుడు అధికారులకు తెలియచేయగా కొన్ని గంటలపాటు అధికారులు కష్టపడి దగ్గర లోని పొదల్లో మొసలి బంధించి, జూపార్క్ కు తరలించారు. అసలు ఈ గుంతలోకి మొసలి ఎలా వచ్చిందో అర్ధంకావడంలేదని స్థానికులు అంటున్నారు. ఎట్టకేలకు మొసలి ని బంధించడం తో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
త్రిమూర్తుల జననం
ఒకానొక ఇతిహాసం ప్రకారం త్రిమూర్తుల జననం ఒక విచిత్రం. ఆది పరాశక్తి, త్రినేత్రి యగు శ్రీ రాజరాజేశ్వరీ దేవి బ్రహ్మ,విష్ణు,మహేశ్వరు లకు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన అనంతరం ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను పరిణయమాడవలసినదిగా కోరింది. దానికి మొదట వారు నిరాకరించారు. తర్వాత పరమశివుడు తనను వివాహమాడటానికి ఒక షరతు మీద అంగీకరించాడు. ఆ షరతు ఏమిటంటే వివాహం జరిగిన పిమ్మట ఆమె మూడో నేత్రం తనకు ఇవ్వాలని. దానికి ఆమె అంగీకరించి శివుడ్ని వివాహమాడి, తన మూడో నేత్రాన్ని శివుడి కి ఇచ్చింది. మూడో నేత్రాన్ని స్వీకరించిన శివుడు ఆ నేత్రశక్తి తో ఆమెను భస్మం చేసి ఆ భస్మరాశి ని మూడు భాగాలుగా విభజించాడు. బ్రహ్మ ఆ మూడు భాగాలకు ప్రాణం పోశాడు. వాళ్ళే లక్ష్మి, పార్వతి, సరస్వతి.
best drupal/joomla institute?
Can anyone tell me which is best drupal/joomla training institute in hyderabad. In ammerpet locality is more preferable for me.
శ్రీ కృష్ణుడు గోపికలతో రాసలీలలు ఆడాడా?
శ్రీ కృష్ణుడు ఎంతో మంది గోపికలతో బృందావనం లో రాసలీలలు ఆడాడని చాలా మంది అనుకుంటారు. చాలా మంది వరకు ఎందుకు, మొన్నటి వరకు నేను కూడా అలానే అనుకున్నాను. కానీ ఒక బుక్ లో చదివినట్లు గుర్తు, కృష్ణుడు నిజంగా గోపికలతో ఉండడని, గోపికలు కృష్ణుని మీద అచంచలమైన ప్రేమతో ఆయన్ని ఊహించుకుంటారని. అలా ఊహించుకున్నప్పుడు నిజంగా కృష్ణుడే వాళ్లతో ఉన్నట్లుగా ఆ స్వామి వారిని అలా భ్రమింపచేస్తాడట.ఆ పరమాత్మ ఆ విధంగా వాళ్ళ కోరికలు తీరుస్తాడన్నమాట !.
రావణాసురుడు బ్రాహ్మణుడా? రాక్షసుడా?
రావణుడు బ్రాహ్మణుడు అంటారు కదా, మరి అతను రాక్షస రాజు ఎలా అయ్యాడు? ఒకవేళ అతను రాక్షసుడే అయితే బ్రాహ్మణత్వం ఎలా వచ్చింది?
మన డబ్బు మనమే ముద్రించవచ్చా?
క్షమించాలి, ఇది చాలా సిల్లీ ప్రశ్న లా ఉండవచ్చు, ఈ మాత్రం తెలియదా అనిపించవచ్చు, కానీ నాకు నిజం గా తెలియకే అడుగుతున్నాను. మనం చాలా అప్పుల్లో ఉన్నాం, ఖజానా ఖాళీగా ఉంది అంటుంటాం. కానీ మన రిజర్వ్ బ్యాంక్ కు డబ్బు ముద్రించే (టంకశాల) రైట్స్ ఉన్నాయి కదా, మనకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ముద్రించుకుని మన దేశ ప్రగతి కి ఉపయోగించవచ్చును కదా, ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకోవడం దేనికి?
వెంకటేష్ కింగ్ గెటప్
నాగవల్లి లో వెంకటేష్ ఎలా ఉంటాడా అని ఎదురుచూసే ప్రేక్షకులకు సమాధానం దొరికింది. వెంకటేష్ కింగ్ గెటప్ ఫోటో నెట్ లో ఎవరో రిలీజ్ చేసారు.
ఇందులో వెంకటేష్ సైక్రియాట్రిస్త్ గాను, రాజు గాను కనిపించనున్నారు. చంద్రముఖి లో రజనీకాంత్ 'లక లక లక' అని అన్నట్లుగానే ఇందులో వెంకటేష్ ఏదో డిఫరెంట్ వర్డ్ ఉచ్చరిస్తారని తెలిసింది.
బలరాముడు తిరుమల ఆలయం ను దర్శించాడా?
కురుక్షేత్ర మహా సంగ్రామ సమయం లో బలరాముడు శాంతికాముకుడై పుణ్యక్షేత్రాలను దర్శించాడని, అలా దర్శించిన వాటిలో తిరుమల ఆలయం కూడా ఉన్నదని చాలా చోట్ల చదివాను. కానీ నాకు ఒక సందేహం. బలరామకృష్ణులు ద్వాపరయుగము లోని వారు. వెంకటేశ్వరస్వామి కలియుగం లోని వాడు. ద్వాపరయుగము తర్వాత కలియుగము వస్తుంది కదా. ఇంకా మొదలవని కలియుగంలోని తిరుమల ఆలయం ని, ద్వాపరయుగము లోని బలరాముడు ఎలా దర్శించాడు. ఒకవేళ అదే నిజం అయితే తిరుమల ఆలయం ద్వాపరయుగము లో కూడా ఉందా? ఉంటే శ్రీ కృష్ణుడు బ్రతికి ఉండగానే వెంకటేశ్వరస్వామి తిరుమల లో పూజలు అందుకున్నాడా?
నా సందేహాలను ఎవరైనా నివృత్తి చెయ్యండి దయచేసి.
నా సందేహాలను ఎవరైనా నివృత్తి చెయ్యండి దయచేసి.
ధర్మరాజు నరక ప్రయాణం
ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజు కు దారి లో వైతరణి నది కనిపిస్తుంది. ఈ నది ఎన్నో వేల వైశాల్యం కలిగి, ఎముకలు,చీము,రక్తము మరియు బురద కలిగిన మాంసము తో నిండి ఉంది. ఈ నది నిండా పెద్ద పెద్ద మొసళ్ళు, మాంసము తినే క్రిములు, విశ్వం లో మాంసాహారం భుజించే సకల జీవాలు అందులో నిక్షిప్తం అయి ఉన్నాయి. దోవ అంతా దుర్గందపూరితం గా ఉంది. దానిని భరించలేక ధర్మరాజు మూర్చపోయాడు. జన్మలో ఎటువంటి తప్పు చెయ్యని నాకు ఈ దురవస్థ ఏమిటని ధర్మరాజు ఇంద్రుని అడిగాడు. అపుడు ఇంద్రుడు ధర్మరాజు తో 'కురుక్షేత్ర సంగ్రామాన, అశ్వద్ధామ హత: అని బిగ్గరగా పలికి, కుంజర: అని హీన స్వరం తో పలికి గురుదేవుని వంచించిన ఫలితమిది' అని చెప్పాడు. అబద్దం ఆడిన వారికే నరక దర్శనం తప్పకపోతే ఇక పాపాలు చేసే వారి పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి.
భారత్ బ్లడ్ బ్యాంక్
రక్తదానం చెయ్యండి తోటివారిని బ్రతికించండి. ఎవరికైనా అత్యవసర పరిస్థితులలో రక్తం అవసరం అయినపుడు ఎవరైనా రక్తం ఇచేవాళ్ళు ఉన్నారేమో అని వెతుకులాడటం, లేదా టీవీ లో scroll చెయ్యడమో చేస్తుంటాం. అందుకోసం వృధాగా పోయే ప్రతి క్షణం భాదితుడి ఆయుర్దాయాన్ని హరించివేస్తుంది. ఇటీవల నేను ఒక వెబ్ సైట్ చూసాను. అందులో వివిధ ప్రాంతాల్లో వివిధ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల ఫోన్ నెంబర్ లు ఉంటాయి. ఆ వివరాలను ఉపయోగించి మనం ఆ వ్యక్తుల తో మాట్లాడి భాదితుడిని బ్రతికించవచ్చు. మన వివరాలు కూడా ఆ వెబ్ సైట్ లో పెడితే మనం కూడా కొంత మందిని బ్రతికించిన వాళ్ళమవుతాం. ఆ వెబ్ సైట్ పేరు మీ కోసం
Bharat Blood Bank
Bharat Blood Bank
బాలతీర్ధం
తిరుమల లో 108 తీర్ధాలు ఉన్నాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందులో బాలతీర్ధం గురించి విన్నప్పుడల్లా నాకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఆ బాలతీర్ధం లోని జలం సేవిస్తే ముసలివాళ్ళు, బాలలు (యవ్వనవంతులు) గా మారతారని, ఇక ఎపుడూ వృద్ధాప్యం దరి చేరదని అంటారు. ఆ తీర్ధాన్ని సర్పాలు ఎల్లప్పుడూ కావలి కాస్తూ ఉంటాయని కూడా అంటారు. కానీ అలా అందరూ బాలలు గా మారితే సృష్టి కి అవరోధం అవుతుంది అని దానిని పెద్ద పెద్ద బండల తో మూసివేశారని చెప్తారు. నిజం గా ఆ జలం తాగితే బాలలు గా మారతారా? ఏమో అంతా ఆ శ్రీవారికే తెలియాలి.
శ్రీ కృష్ణ నిర్యాణం
కురుక్షేత్ర సంగ్రామం అనంతరం, ఒకనాడు కణ్వ, విశ్వామిత్ర , నారద మహర్షులు శ్రీ కృష్ణుని సందర్శనార్దం ద్వారకకు విచ్చేశారు. వీరు పురవీధుల్లో సంచరిస్తూ ఉండగా కొందరు ద్వారక యువకులకు చిలిపి ఊహ తట్టింది. ఆ యువకులు ఒకడికి స్త్రీ వేషం వేసి ఆ మునుల వద్దకు తీసుకుని పోయి ఈ చిన్నదానికి ఆడ బిడ్డ పుడతాడో , మగ బిడ్డ పుడతాడో చెప్పమన్నారు. ఆ మహర్షులు అమాయకులు కాదు కదా, దివ్యదృష్టి తో మొత్తం కనుక్కుని ఆగ్రహం తో, ఆడబిడ్డా కాదు మగబిడ్డా కాదు ఒక ముసలం(రోకలి) పుడుతుంది, అది మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ విషయం శ్రీ కృష్ణునికి తెలిసింది. విధి రాత ను ఎవరూ తప్పించలేరు, యాదవ వంశానికి కాలం చెల్లింది అనుకున్నాడు.
మహర్షుల తపశ్శక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది. ఆ యువకులు దానిని శ్రీ కృష్ణుని వద్దకు తీసుకుపోయారు. శ్రీ కృష్ణునికి అది యాదవ వంశాన్ని నాశనం చేసే ఆయుధం లా కనిపించింది. దానిని పిండి చేసి సముద్రం లో కలపమని ఆ యువకులకు చెప్పాడు. వారు దానిని పిండి చేసి సముద్రం లో కలిపారు. చివరగా ఒక ముక్కను అరగదీయలేక దానిని సముద్రం లోనికి విసిరివేశారు. పిండి చేసిన ముసలం మనల్ని ఎలా నాశనం చేస్తుంది లెమ్మని సంతోషం గా ఇళ్ళకు పోయారు. కానీ మునుల వాక్కు వృధా పోదు కదా. మిగిలిన ఆ రోకలి ముక్క తీరానికి కొట్టుకు వచ్చి ఒకానొక చోట ఇసుకలో దిగబడింది. సముద్రంలో కలిసిన రోకలి పిండి బడబాగ్ని వలె కాచుకుని ఉంది. శ్రీ కృష్ణునికి ఇవన్నీ తెలిసినా విధి రాతను తప్పించే శక్తి లేక మిన్నకుండి పోయాడు.
అది మొదలు ద్వారక నగరం లో అనేక ఉత్పాతాలు సంభవించాయి. ఎపుడూ లేని విధంగా యాదవులు సజ్జనలును బాధించడం మొదలుపెట్టారు. స్త్రీలు భ్రష్టు పట్టిపోతున్నారు. యాదవవంశ నాశనం దగ్గరలోనే ఉందని కృష్ణునికి అర్ధం అయ్యింది. తను ఎంతో ప్రేమించే ద్వారకలో యాదవులు నాశనం అవ్వడం ఇష్టం లేని కృష్ణుడు యాదవులు అందరినీ కొలువుపర్చాడు. సముద్రానికి జాతర చెయ్యాలని అందరినీ బయలుదేరమని చెప్పాడు. అందరూ కావలసిన సరంజామా అంతా తీసుకుని బయలుదేరారు. బలరాముడు అరణ్యమునకు బయలుదేరాడు. శ్రీ కృష్ణుడు ఒక్కడే యాదవుల తో పాటు వెళ్ళాడు. వెళ్ళే ముందు తండ్రియైన వసుదేవునితో ఇలా అన్నాడు. "తండ్రీ! కొద్ది రోజులలో ద్వారకను సముద్రం ముంచెత్తనున్నది. అర్జునుడు వస్తాడు మిమ్ములను అందరినీ ఉద్ధరిస్తాడు. అతను వేరు నేను వేరు కాదు. అందరూ అతని ఆజ్ఞను పాటించండి."
సముద్ర తీరానికి వెళ్ళిన యాదవులు సుష్ఠుగా భోజనం చేసి, కృష్ణుని ఎదుటే మద్యం తాగి ఒకరిలో ఒకరు కలహించుకోసాగారు. అన్నీ తెలిసినా కృష్ణుడు ఏమీ చెయ్యలేని వాడయ్యాడు. అంతలో ఒకడు ఆనాడు సముద్ర తీరంలో దిగబడిన రోకలి తుంగను తీసుకుని ఒకడిని మోది చంపేశాడు. అది మొదలు అందరూ ఒకరిని ఒకరు చంపుకున్నారు.
మిగిలిన దారుకుడిని, భబ్రుడిని తీసుకుని బలరాముడు ఉన్న చోటికి బయలుదేరాడు శ్రీ కృష్ణుడు. అక్కడ బలరాముడు అరణ్యం లో ధ్యానం లో ఉన్నాడు. అపుడు శ్రీ కృష్ణుడు అర్జునుడి ని ద్వారకకు తీసుకురమ్మని దారుకుడిని పంపాడు. భబ్రుడి ని ద్వారకలోని స్త్రీలను, మిగిలిన వాళ్ళని ప్రయాణమునకు సిద్దం చెయ్యమని పంపాడు. కానీ మార్గమధ్యం లో ఒక ఆటవికుడు అతనిని అదే రోకలి తుంగ తో సంహరించాడు.
దారుకుడు ఏడుస్తూ పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అతనిని ఆ పరిస్థితి లో చూసి పాండవులు చలించిపోయారు. అపుడు దారుకుడు జరిగిన విషయం చెప్పి బలరామకృష్ణులు అరణ్యం లో ఉన్నారని, అర్జునుడుని ద్వారకకు తీసుకువెల్లమన్నారని చెప్పాడు. అది విని పాండవులు ఆశ్చర్యపోయారు. శ్రీ కృష్ణ భగవానుడు అచట ఉండగా ఇలా ఎందుకు జరిగిందా అని చాలా భాధపడ్డారు. అర్జునుడు వెంటనే ద్వారకకు పయనమయ్యాడు.
అచట అరణ్యంలో బలరాముడు తన దేహమును విడిచి తన అంశ అయిన మహా సర్ప రూపం ధరించి సముద్రం లో కలిసిపోయాడు. తన అన్న లేని లోకంలో ఉండటం వృధా అని తలచి, తను చెయ్యవలసిన పనులు కూడా ఏమీ లేవని గ్రహించి తన శరీరం వదలడానికి ఏమి కారణం దొరుకుతుందా అని వేచి చూడసాగాడు. ఒకనాడు తనకు అరికాలితో మరణం సంభవిస్తుందని దుర్వాస మహాముని శాపం ఇవ్వడం గుర్తుకువచ్చింది. అపుడు శ్రీ కృష్ణుడు ఒక మహా వృక్షం నీడన మేను వాల్చి, అక్కడకు వస్తున్న ఒక బోయవానికి, తన పాదం లేడి పిల్ల లాగా భ్రమింపచేశాడు. అది తెలియని బోయవాడు గురి చూసి కృష్ణుని పాదానికి బాణం వదిలాడు. తర్వాత వచ్చి చూసి దేవదేవుడైన వాసుదేవునికా నేను బాణం వేసింది అని రోదించడం మొదలు పెట్టాడు. శ్రీ కృష్ణుడు అతనిని ఓదార్చి ఇలా అన్నాడు. "త్రేతాయుగాన వాలి వైన నిన్ను చెట్టు చాటునుండి చంపిన ఫలితం ఇపుడు అనుభవిస్తున్నాను. కర్మ ఫలమును భగవంతుడైనను అనుభవించవలసినదే. నీవు నిమిత్తమాత్రుడవు." అని శ్రీ కృష్ణుడు తన శరీరమును త్యజించాడు.
ద్వారకకు చేరుకున్న అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకను చూసి ఖిన్నుడయ్యాడు. శ్రీ కృష్ణుడి ప్రియ సఖుడైన ఆర్జునుడిని చూడగానే శ్రీ కృష్ణుని భార్యలు పలు విధాల రోదించారు. వసుదేవుడు శ్రీ కృష్ణుడు తనకు చెప్పినదంతా అర్జునుడికి చెప్పి తన యోగనిస్ఠ తో శరీరం వదిలాడు.
వసుదేవుని మరణవార్త శ్రీ కృష్ణునికి చేరవేయడానికి అర్జునుడు అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యం లో శ్రీ కృష్ణ భగవానుని మృతదేహం చూసి కన్నీళ్ళ పర్వంతం అయ్యాడు. మృతదేహానికి చెయ్యవలసిన కార్యక్రమాలు చేసి తను ద్వారకకు పయనమయ్యాడు. సిద్ధంగా ఉన్నవారిని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు. అర్జునుడు ద్వారక విడిచిన మరుక్షణం అప్పటివరకు కాచుకుని ఉన్న సముద్రం ద్వారకను ముంచెత్తింది.
ఇపుడు సముద్రం లో బయటపడిన ద్వారక అదేనని అధికుల విశ్వాసం.
గమనిక:- నేను ఎపుడో ఒకసారి చదివిన విషయాన్ని గుర్తు ఉన్నంతవరకు రాశాను. తప్పులు ఉంటే మన్నించగలరు.

పల్లెటూరు
మా ఊరు ఒక అందమైన పల్లెటూరు. పచ్చపచ్చని పంట పొలాలతో, నిండైన పాడి తో, పొలం పనులకు వెళుతున్న రైతుల తో కళకళలాడుతూ ఉండేది.
మా ఊరి నడిబొడ్డున రామాలయం, దానికి ఎదురుగా రావి చెట్టు కింద చిన్న ఆంజనేయస్వామి గుడి, దానికి ఎదురుగా నిండైన చెరువు, ఆ చెరువు లో ఒక పక్క ఈత కొడుతూ పిల్లలు, మరొక పక్క బట్టలు ఉతుకుతూ పల్లె పడుచులు , వాళ్ళ తో పరాచికాలు ఆడుతూ అక్కడక్కడే తిరిగే కుర్రాళ్ళు ఓహ్ చూడడానికి రెండు కళ్ళు చాలవు.
అటువంటి చక్కని ఊరిలో పుట్టిన నేను అందరి పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ పెరిగాను. కోతి కొమ్మచ్చి ఆడటం, గడ్డి వాము పై నుంచి దూకడం, కబడ్డి ఇలా మొదలైన ఆటలు ఆడేవాళ్ళం. స్నేహితులం అందరం కలసి ఒక ఉమ్మడి కుటుంబం లా ఉండేవాళ్ళం.
అలా మేము పెద్ద చదువులు చదువుకున్నాం. ఉద్యోగ నిమిత్తం గువ్వలు తల్లిని విడిచినట్లు , తల్లి లాంటి మా ఊరి ని విడిచి వచ్చేశాం. స్నేహితులం అందరం చెట్టుకొకరు పుట్టకొకరు గా అయిపోయాం. ఇప్పటకీ మా ఊరికి వెళితే అరె! నువ్వు పలానా వారి అబ్బాయి కదా అని గుర్తు పడతారు. కానీ అక్కడ మా తోటి వాళ్ళు ఎవరూ ఉండరు. ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్లుగా ఉంటుంది. ఒక్క సారైనా స్నేహితులం అందరం కలుసుకోవాలని ఉంటుంది.

శ్రీశ్రీ
20 వ శతాబ్దం లో తెలుగు సాహిత్యాన్ని శాసించిన సుప్రసిద్ధ కవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన మహాకవి ‘శ్రీశ్రీ’ గా ప్రసిద్ధుడు.
శ్రీశ్రీ – శ్రీరంగం శ్రీనివాస రావు – 1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. ( శ్రీశ్రీ తన అనంతం పుస్తకంలో పుట్టిన రోజు గురించి వివరణ ఇచ్చారు. తను ఏప్రిల్లో పుట్టానని, తండ్రి పాఠశాలలో అవసరం నిమిత్తం 2-1-1910 అని రాయించారని పేర్కొన్నారు) శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాధమిక విద్యాభ్యాసం విశాఖపట్నం లో చేసాడు. 1925 లో SSLC పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో మద్రాసు విశ్వ విద్యాలయం లో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు.
1935 లో విశాఖ లోని మిసెస్ ఎ వి ఎస్ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్ ఎడిటరు గా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసాడు. 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది.
1947 లో మద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. పిల్లలు లేని కారణం చేత 1949 లో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు. 1956 లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.
1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించాడు. హనుమాన్ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన అరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు.
వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి “రాజా లక్ష్మీ ఫౌండేషను” అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పని చేసాడు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది.
కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు.
విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది.
తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన “తెలుగు వీర లేవరా..” అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి.
శ్రీశ్రీ రచనల జాబితా

సాహితీ వ్యాసంగం
శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు. తన 18 వ ఏట 1928 లో “ప్రభవ” అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పధ్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం – ఇది గురజాడ అడుగుజాడ అని ఆయన అన్నారు – మొదలు పెట్టి గొప్ప కావ్యాలను రచించాడు.1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది.
తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన “తెలుగు వీర లేవరా..” అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి.
రచనలు
శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రాంభించాడట. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది – కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని వ్రాసేవారు.శ్రీశ్రీ రచనల జాబితా
- ప్రభవ
- వరం వరం
- సంపంగి తోట
- మహాప్రస్థానం
- అమ్మ
- మేమే
- మరో ప్రపంచం
- రేడియో నాటికలు
- త్రీ చీర్స్ ఫర్ మాన్
- చరమ రాత్రి
- మానవుడి పాట్లు
- గురజాడ
ప్రముఖ సినిమా పాటలు
- మనసున మనసై (డాక్టర్ చక్రవర్తి)
- హలో హలో ఓ అమ్మాయి (ఇద్దరు మిత్రులు)
- నా హృదయంలో నిదురించే చెలి (ఆరాధన)
- తెలుగువీరలేవరా (అల్లూరి సీతారామరాజు)
- పాడవోయి భారతీయుడా (వెలుగు నీడలు)
(మూలం వికిపీడియా నుండి తీసుకొనబడినది.)
విశ్వనాథ సత్యనారాయణ
విశ్వనాథ సత్యనారాయణ (1895-1976) “కవి సమ్రాట్” బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు – ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. విశ్వనాధ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించాడు.
తరువాతి కాలంలో ఈయన వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించాడు. బందరు నేషనల్ కాలేజి (1928), గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1938 వరకు), విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.& సి.వి.ఆర్. కాలేజి (1938-1959)(ఈ కళాశాల ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల గా మార్పు చెందింది), కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో ఆయన పని చేసాడు. 1957లో విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడుగానూ, 1958లో విధానమండలికి నామినేటెడ్ సభ్యుడుగానూ విధులు నిర్వర్తించాడు.
తరువాత విశ్వనాథ రచనా పరంపర పుంఖానుపుంఖాలుగా కొనసాగింది. మొత్తానికి 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 88 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శనా గ్రంధాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు – ఇలా తెలుగుభాషకు విశ్వనాథ వందల్లో రచనలందించాడు. ఆయన రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు. రేడియో కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించాడు.
తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పాడు. కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు (ఆనాటి) యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశాడు.
జీవిత విశేషాలు
విశ్వనాథ సత్యనారాయణ 1895, సెప్టెంబరు 10న (మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి)[3] ) కృష్ణా జిల్లా నందమూరు గ్రామం (నేటి ఉంగుటూరు మండలం)లో జన్మించాడు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. ఈయన భార్య వరలక్ష్మమ్మ. విద్యాభ్యాసము నందమూరు, ఇందుపల్లి, మరియు పెదపాడు గ్రామాల్లోను, పై చదువులు బందరు పట్టణంలోను సాగాయి. బందరు హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించడం ఆయన అదృష్టం. బి.ఎ. తరువాత విశ్వనాథ సత్యనారాయణ బందరు హైస్కూలులోనే ఉపాధ్యాయునిగా చేరాడు. ఉద్యోగం చేస్తూనే మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా సాధించాడు. తరువాత మహాత్మా గాంధీ నడపుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాడు.తరువాతి కాలంలో ఈయన వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించాడు. బందరు నేషనల్ కాలేజి (1928), గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1938 వరకు), విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.& సి.వి.ఆర్. కాలేజి (1938-1959)(ఈ కళాశాల ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల గా మార్పు చెందింది), కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో ఆయన పని చేసాడు. 1957లో విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడుగానూ, 1958లో విధానమండలికి నామినేటెడ్ సభ్యుడుగానూ విధులు నిర్వర్తించాడు.
సాహితీ ప్రస్థానం
1961 లో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాలుగా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసాంగానికి కేటాయించాడు. 1916 లో “విశ్వేశ్వర శతకము” తో విశ్వనాథ రచనా ప్రస్థానము ప్రారంభమైనది. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆసమయంలోనే “ఆంధ్రపౌరుషము” రచించాడు. 1920నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.తరువాత విశ్వనాథ రచనా పరంపర పుంఖానుపుంఖాలుగా కొనసాగింది. మొత్తానికి 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 88 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శనా గ్రంధాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు – ఇలా తెలుగుభాషకు విశ్వనాథ వందల్లో రచనలందించాడు. ఆయన రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు. రేడియో కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించాడు.
ముఖ్య రచనలు
విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి – ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి. తెలుగు తనమన్నా, తెలుగు భాషన్నా విశ్వనాధకు ప్రత్యేక అభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి ఆయన మొదటి రచనలలోనివి. విశ్వనాధ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రిక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి.తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పాడు. కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు (ఆనాటి) యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశాడు.
పురస్కారాలు
- ఆంధ్రజాతి తన సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయనను “కవి సామ్రాట్” బిరుదుతో సత్కరించింది.
- 1964లో ఆంధ్రా యూనివర్సిటీ “కళాప్రపూర్ణ” తో సన్మానించింది.
- 1942 సంక్రాంతికి ఆయనకు గుడివాడలో “గజారోహణం” సన్మానం జరిగింది.
- శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది.
- కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది.
- 1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది.
- 1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం తో గౌరవించింది.
- జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. 1971లో ఆయన “రామాయణ కల్పవృక్షము”నకు ఈ పురస్కారము లభించింది.
(మూలం వికిపీడియా నుండి తీసుకొనబడినది.)
సి.నా.రె.
సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988 ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయము లో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆయన డిగ్రీ వరకు ఉర్దూ మాధ్యమములోనే చదివాడు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.
విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది.
బాల్యం
సి.నారాయణరెడ్డి 1931, జూలై 29 న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేటలో జన్మించాడు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు.ఉస్మానియా విశ్వవిద్యాలయము లో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆయన డిగ్రీ వరకు ఉర్దూ మాధ్యమములోనే చదివాడు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.
విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది.
రచనలు
కవిత్వం:- విశ్వంభర
- ఆరోహణ
- మనిషి – చిలక
- ముఖాముఖి
- భూగోళమంత మనిషి
- దృక్పథం
- కలం సాక్షిగా
- కలిసి నడిచే కలం
- కర్పూర వసంతరాయలు
- మట్టి మనిషి ఆకాశం
- నాగార్జున సాగరం
- కొనగోటి మీద జీవితం
- రెక్కల సంతకాలు
- వ్యక్తిత్వం
- పరిణత వాణి
పురస్కారాలు
- డాక్టరేటు డిగ్రీ ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో
- 1988వ సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం
(మూలం వికిపీడియా నుండి తీసుకొనబడినది.)
Subscribe to:
Posts (Atom)